బాదం పాలు అనగానే మార్కెట్ లో జ్యూస్ బండ్లపై అమ్మే బాదం పాలు గుర్తుకు వస్తాయి. సాధారణంగా అందరూ అక్కడే బాదం పాలు తాగుతారు. లేదంటే టీ స్టాల్ వద్ద బాదం పొడి కలిపి.., బాదం టీ అమ్ముతారు. కాని ఇళ్లలో బాదం పాలు లేదా బాదం టీ తాగేవారు చాలా తక్కువమంది ఉన్నారు. దీనివల్ల అంతగా కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటి అని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. పైగా బాదం పాలు అంటే ఓ లగ్జరీ మిల్క్ లా ఫీల్ అవుతారు. నిజానికి బాదం పాలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి ఆవు పాలతో సమానం. ఇంతకీ బాదం పాలతో ఉన్న ప్రయోజనాలేమిటో చూద్దాం.
* బాదం పాలలో సోడియం తక్కువగా ఉండి.., ఒమేగా 3 ఫ్యాటి యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల గుండె నొప్పి, బీపీ అవకాశాలను తగ్గిస్తుంది.
* జ్ఞాపక శక్తి పెంచటంలో బాదంపాలు బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా పడుకునే ముందు తీసుకోవటం వల్ల అధిక ప్రయోజనం ఉంటుంది.
* మలబద్దకంతో బాధపడేవారు బాదంపాలు తాగితే ఉపశమనం లభిస్తుంది. బాదం పప్పు తింటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
* బాదంలో ఉండే కాల్షియం ఎముకల పటుత్వంకు సహకరిస్తుంది. అయితే ఆవు పాలతో పోలిస్తే ఇందులో తక్కువ కాల్షియం ఉంటుంది. కాబట్టి కాల్షియం ప్రయోజనం మాత్రమే కోరుకునేవారు దీన్ని తీసుకోనవసరం లేదు.
* విటమిన్ డి, రైబో ఫ్లెవిన్ కండరాలను బలపరుస్తుంది. కండరాల నొప్పులు తగ్గిస్తుంది.
* బాదంపప్పులో ఐరన్ ఇతర పోషకాలు ఉండటం వల్ల రక్త హీనత తగ్గుతుంది.
* విటమిన్ డి కూడా బాదంలో ఉంటుంది. దీని వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఆర్తరైటిస్, ఓస్టిరియోపోసిస్ ఇబ్బందులు ఉండవు.
* శరీరంలో సెక్స్ హార్మోన్లను విడుదల చేయటంలో బాదం సహకరిస్తుంది. ముఖ్యంగా మహిళల్లో కోరికలను రగులుస్తుంది.
బాదం పప్పును పొడిగా చేసి పాలలో వేసుకుని షేక్ లా బాదం పాలు తాగవచ్చు. లేదా కేవలం బాదంనే పాలుగా కావాలనుకుంటే.., బాదం పప్పులు నీటిలో నానబెట్టి... పొడిచేసి నీటిలో చిక్కగా కలిపి పాలను తయారు చేసుకున్నా సరిపోతుంది.
(And get your daily news straight to your inbox)
Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more
Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more
May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more
May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more
May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more