ప్రకృతిలోని ప్రతి పండు కూడా మానవుడికి ఉపయోగపడేదే అని తెలుసు. చాలా పండ్లు సీజనల్ గా లభిస్తాయి. అంటే వేసవిలో మామిడి, వర్షాకాలంలో నారింజ ఇలా ఒక్కో కాలంలో ఒక్కో పండ్లు వస్తుంటాయి. అయితే కాలాలకు అతీతంగా ఎప్పుడూ మనకు అందుబాటులో ఉండేది అరటి. పెరటిలో ఉండే అరటి చెట్టుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేరు సహా.., చివరి కాడ వరకు అరటిలోని ప్రతి భాగమూ ఉపయోగకరమైనదే. అరటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.
* జీర్ణ సంబంధ ఇబ్బందులకు అరటి పండు చక్కని ఔషదంగా పనిచేస్తుంది.
* శరీరంలోని విషపధార్ధాలను తొలగిస్తుంది.
* ఈ పండ్లలో ఉండే పొటాషియం.. బీపీ, పని ఒత్తిడిని తగ్గిస్తుంది. కండరాలను దృడంగా ఉంచుతుంది.
* అరటి పండ్లు గుండెకు జబ్బుల నుంచి రక్షణ కవచంగా ఉంటాయి.
* ఎయిడ్స్ పై పోరాడే శక్తి కూడా అరటి పండ్లకు ఉంది.
* పచ్చి అరటి కాయలు విరేచనాలను తగ్గిస్తాయి.
* డైటింగ్ చేసే వారు కాస్త ఒక పూట టిఫిన్ చేసి అరటి పండు, వెన్న తీసిన పాలు తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు వస్తాయి.
* అరటి పండును గుజ్జుగా చేసి చర్మంపై రాసుకుంటే కాస్త నిగారింపు వస్తుందని బ్యూటిషియన్లు చెప్తుంటారు.
ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే చాలామంది పెరటిలో అరటిని పెంచుకుంటారు. ఓ సినిమాలో చెప్పినట్లు అరటి పండు... ‘తింటే బలపడతాం, తొక్కితే జారిపడతాం’. కాబట్టి వీలు కుదిరినప్పుడల్లా అరటి పండ్లు తినండి.
(And get your daily news straight to your inbox)
Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more
Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more
May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more
May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more
May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more