ప్రకృతిలో ఉండే ప్రతి పండు, పుష్పం మనిషికి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. అన్ని పండ్లు, పూలు అందరికి ఉపయోగపడకపోవచ్చు. కాని ప్రకృతి ఇచ్చే ప్రసాదం ఎవరినీ హాని చేసేందుకు కాదు. పండ్లు తింటే ఆరోగ్యంగా ఉంటారని ప్రతి ఒక్కరూ చెప్తుంటారు. కాని వాటి వల్ల కలిగే ప్రయోజనాలేమిటి అని ప్రశ్నిస్తే మాత్రం సరైన సమాధానం ఉండదు. అలాంటి వారి కోసమే పండ్ల వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నాము. ఇప్పుడు ద్రాక్ష పండ్ల వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాము. ద్రాక్ష లేదా అంగూరగా పిలిచే ఈ పండ్లతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వీటిలో రకాలు ఎలా ఉన్నాయో.., అందుకు తగ్గట్లు ప్రయోజనాలూ ఉన్నాయి. అవేమిటో ఇఫ్పుడు చూద్దాము.
* నల్ల ద్రాక్ష తిన్నా.., జ్యూస్ చేసుకుని తాగినా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
* ద్రాక్ష రసం తాగటం వల్ల మైగ్రేయిన్ అదుపులోకి వస్తుంది.
* తలనొప్పి ఉండే వారికి ద్రాక్ష పండ్లు తింటే కాస్త ఉపశమనం లభిస్తుంది.
* పిల్లల్లో రక్త కణాలు తగ్గితే ద్రాక్ష పండ్లు (ముఖ్యంగా నల్ల ద్రాక్ష) తినిపిస్తే ప్రయోజనం ఉంటుంది.
* ద్రాక్షలోని యాంటి ఆక్సిడెంట్లు రక్తనాళాల్లో ఉన్న అడ్డంకులను తొలగించి ప్రసరణ సరిగ్గా అయ్యేలా చేస్తాయి.
* ద్రాక్షలోని టన్నీస్, ఫాలిఫినాల్స్ క్యాన్సర్ కారకాలను దరిచేరనీయవు.
* ద్రాక్షపండ్లు తింటే బరువు పెరుగుతారన్న ప్రచారం కేవలం అపోహ.
* ద్రాక్షలో నీరు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలోని కొవ్వు స్థాయిని తగ్గిస్తుంది.
* అంగూరలో ఉండే పోటాషియం మూత్ర పొండాల సమస్యలను తగ్గిస్తుంది.
* రెగ్యులర్ గా ద్రాక్ష పండ్లు తింటే ఆస్తమా, ఆయాసం తగ్గటంతో పాటు ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది.
ఇలా చెప్పుకుంటూ పోతే ద్రాక్ష పండ్ల వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. చూస్తే చిన్నవిగా ఉన్నప్పటికీ.., ఫలరాజాలతో ధీటైన ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. కాబట్టి వీలు కుదిరినప్పుడు ద్రాక్ష పండ్లు తినండి. చివరగా ఒక్క సలహా.., త్వరగా చెడిపోయే తత్వం ఉన్నందు వల్ల మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత రోజుల తరబడి నిల్వ ఉంచకుండా వీలైనంత త్వరగా తినేయండి.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more
Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more
May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more
May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more
May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more