మునగచెట్టు గురించి తెలియనివారు ఎవ్వరూ వుండరు. ముఖ్యంగా మునగకాడలతో వివిధ రకాల వంటకాలు తయారుచేస్తారు. అయితే.. ఈ మునగచెట్టుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయని చాలా కొద్దిమందికే తెలుసు! మునగ ఆకులు, చెట్టు బెరడు, వేర్లు కూడా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. ఎలాగో తెలుసుకుందామా...
1. మునగ చిగుళ్లు : లేత మునగ చిగుళ్లను బాగా రుబ్బి వాటి నుంచి రసం తీయాలి. ఈ రసాన్ని ప్రతిరోజూ పరిగడుపున ఓ గ్లాసుమేర తాగితే.. త్వరగా బరువు తగ్గుతారు.
2. మునగచెట్టు బెరడు : ఈ బెరడులో వుండే జిరుగును తీసి దాన్ని ఆవుపాలలో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నుదుటి మీద పట్టీలా వేస్తే.. తలనొప్పి మటుమాయమవుతుంది.
3. మునగచెట్టు వేరు : ఈ వేరును బాగా దంచి, రసం తీసి, తేనెలో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ తాగితే వాతపు నొప్పులు తగ్గుతాయి.
4. మునగ ఆకులు : లేత మునగాకును తరుచుగా తింటే.. ఒంటికి పట్టిన నీరు తీసేస్తుంది. అలాగే మనగాకును వేయించి తినిపిస్తే.. పిల్లలు పక్క తడపడం మానేస్తారు.
ఇక చివరగా.. మునగాకును, కాడలను ఎక్కువగా తీసుకుంటే.. బాలింతలకు పాలు బాగా పడుతాయి. ఆకును ఎండబెట్టి పొడిచేసి పరిగడుపున ఓ చెంచాడు తింటే.. కడుపులో వున్న అల్సర్లు మానిపోతాయి. ఇలా ఇన్ని రకాలుగా ఈ మునగచెట్టు ఆరోగ్య ప్రయోజనాలను కలిగింది. అంటే.. ఇది కూడా ఔషధాల సముదాయం లాంటిదే!
(And get your daily news straight to your inbox)
Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more
Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more
May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more
May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more
May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more