ద్రాక్షపండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. మానవ శరీరానికి అవసరమయ్యే కొన్ని పోషక విలువలు ఇందులో పుష్కలంగా వుంటాయి. ఈ పండ్లలో అధిక మోతాదులో చెక్కర వుంటుంది. అలాగే కార్పోహైడ్రేట్, సిట్రిక్ ఆసిడ్, ప్రోటీనులు, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు లభ్యమవుతాయి. ఈ పండ్లనుగానీ, ఈ పండ్లతో తయారుచేసే రసాన్ని గానీ తరుచుగా తీసుకుంటే.. ఆరోగ్య సమస్యల్ని అధిగమించవచ్చు.
ద్రాక్ష రసంలో కొద్దిగా పంచదార కలిపి పరిగడుపున 48 రోజులపాటు తాగితే.. అల్సర్, పొట్ట రుగ్మతలు దూరమవుతాయి. ముఖ్యంగా 40 ఏళ్లకు పైబడిన మహిళల్లో నెలసరి సమస్యలు తలెత్తితే.. రోజూ ద్రాక్షరసం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహాలు ఇస్తున్నారు. రోజూ ఈ పండ్లరసాన్ని తాగితే.. ఎముకలు, దంతాలు బలపడుతాయి. అలాగే గుండె ఆరోగ్యంగా వుంటుంది. ఇక ద్రాక్ష రసంతోనే వైన్ తయారుచేస్తారన్న విషయం తెలిసిందే!
AS
(And get your daily news straight to your inbox)
Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more
Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more
May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more
May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more
May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more