హిందూ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం 108వ సంఖ్యకు ప్రత్యేక స్థానం ఉంది. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో ఉపయోగించే నిత్యం ఉపయోగించే పవిత్ర మాలలో కూడా 108 పూసలు వుంటాయి.
ఇలా ఒక్క హిందూ సంప్రదాయంలోనే కాదు.... బౌద్ధ, సిక్కు, జైన మతాచారాల్లోసైతం ఈ సంఖ్యకు చాలా ప్రాధాన్యం ఉంది. హిందూ సంస్కృతిలో మంత్రోచ్ఛరణను 108 సార్లు చేయడం ఆచారం. జపాన్లోని జైన దేవాలయాల్లో కొత్త సంవత్సరం ఆరంభం నాడు 108 సార్లు గంటలు కొడతారు.
అయితే ఈ 108వ సంఖ్యకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడానికి గల కారణాలు వేరే వున్నాయి. అవేమిటంటే.. మన ప్రాచీన ఋషులు గొప్ప గణాంకవేత్తలు. నిజానికి మన సంఖ్యావ్యవస్థను కూడా గుర్తించిందివారే. అటువంటి విద్యావేత్తలయిన ఋషులే ఈ సంఖ్యకు ప్రాధాన్యతను సంతిరించిపెట్టారు.
సాధారణంగా తొమ్మిది (9) సంఖ్య పరిపూర్ణత్వాన్ని ప్రతిబింబిస్తుంది. 108ని కూడితే (1+0+8=9) వచ్చేది తొమ్మిది. అంతేకాదు ఏ సంఖ్యను 9 సార్లు హెచ్చించి, కూడినా వచ్చే సంఖ్య తొమ్మిదే.
అంతరిక్షంలో తొమ్మిది గ్రహాలు 12 రాశుల గుండా ప్రయాణిస్తాయి. వాటిని గుణించగా అంటే 9x12= 108 వస్తుంది.
27 నక్షత్రాలలో ఒక్కోదానికి నాలుగు పాదాలుంటాయి. 27 నక్షత్రాలు అగ్ని, భూమి, గాలి, నీరు అన్న నాలుగు అంశాలపై విస్తరించి వుంటాయి. అంటే 27x4=108.
ప్రాచీనకాలంనాటి తాళపత్ర గ్రంథాల్ని అనుసరించి విశ్వం 108 అంశాల కలయికతో ఏర్పడింది.
(And get your daily news straight to your inbox)
Jun 11 | గృహాలంకరణలో భాగంగా రంగులు కీలకమైన పాత్రను పోషిస్తాయి. ఇంటిలోపల, బయట అనుకూలమైన రంగులు వేయిస్తే... ఆ ఇల్లు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా, ఉత్సాహకరంగా కనిపిస్తుంది. ప్రస్తుతకాలంలో ఎన్నో కొత్తరకాల రంగులు కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి.... Read more
May 13 | సాధారణంగా కొత్త ఇంటి నిర్మాణాలను చేపట్టేముందు ప్రతిఒక్కరు తమకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలను ముగించుకుంటారు. ఆధ్యాత్మిక సలహాలను కూడా పండితులు లేదా జ్యోతిష్య నిపుణుల నుంచి తీసుకుంటారు. కానీ కొన్ని సందర్భాలలో వాటి అమరికను... Read more
May 01 | ప్రతిరోజు అందరు ఉదయాన్నే లేవగానే రోజువారీ కార్యక్రమాలు ముగించుకున్న తరువాత స్నానాలు చేసుకుంటారు. ప్రతిరోజు స్నానాలు చేయడంతో ఆరోగ్యంగా వుండటమే కాకుండా.. మన అందాన్ని మరింత పెంపొందించుకోవచ్చు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం స్నానం చేసేటప్పుడు... Read more
Apr 28 | సాధారణంగా ప్రతిఒక్కరికి కలలు రావడం సహజమే. కానీ అందులో కొన్ని కలలు శుభం కలిగిస్తాయని, మరికొన్ని కలలు అశుభ కలిగిస్తాయని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. ఇవి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతిఒక్కరికి వస్తుంటాయి.... Read more
Apr 25 | ప్రస్తుతకాలంలో ప్రతిఒక్కరు ప్రతి చిన్న విషయంలో కూడా మానిసక ప్రశాంతతను కోల్పోతున్నారు. ఆర్థికపరంగా సమ్యలు, ఉద్యోగాలు దొరకకపోవడం, విద్యార్థులు సరిగ్గా చదవకపోవడం, నిర్వహించిన పనులు సరిగ్గా జరగకపోవడం, శుభకార్యాలు అస్మాత్తుగా నిలిచిపోవడం, ఆస్తులకు సంబంధించిన... Read more