యావత్ ప్రపంచంలోనే మన భారతదేశంలో అన్యమతాలవారు, జాతులవారు వున్నారు. అలాగే వారు తమకు అనుగుణంగా రకరకాల వంటకాలను తయారుచేసుకుంటారు. ఉత్తర భారతంలో కొన్ని వంటకాలు పేరుపొందగా... దక్షిణ భారతదేశంలో కూడా కొన్ని ముఖ్యమైనవి వున్నాయి. అలాంటి కోవలలోకే వస్తుంది ఈ వంకాయ మసాలా వేపుడు (బ్రింజల్ మసాలా).
దక్షిణ భారతదేశంలోనే డిఫరెంట్ గా ఎంతో రుచికరమైన ఆహార పదార్థాలలో ఈ బ్రింజల్ మసాలా ఎంతో ముఖ్యమైనది. దీనిని తయారుచేసుకునే పద్ధతి కూడా చాలా సులభమైనది. పైగా ఇది చాలా తక్కువ సమయంలోనే వండుకోవచ్చు.
ఇది ముఖ్యంగా మసాలాదినుసులతో తయారుచేసుకుంటారు. అలాగే ఇందులో వేసే వేరుశెనగపప్పు, పుట్నాల పప్పు దీనిని ఎంతో రుచికరంగా, అద్భుతంగా వుండేలా చేస్తాయి. ఎంతోమంది దీనిని ఇష్టపూర్వకంగా భోజనంలో తీసుకుంటారు.
కావలసిన పదార్థాలు :
వంకాయలు (250 గ్రాములు); పళ్లీలు (20 గ్రాములు); నూనె (2 టేబుల్ స్పూన్స్); ఉప్పు (సరిపడేంత), ఉల్లిపాయ (1), పుట్నాల పప్పు (15 గ్రాములు); వెల్లుళ్లి రెబ్బలు ((4); ఎండు మిరపకాయలు (5); జీలకర్ర (1 టేబుల్ స్పూన్); కారం (1 టేబుల్ స్పూన్); పసుపు (తగినంత); ధనియాపౌడర్ (1 టేబుల్ స్పూన్); మెంతిపొడి (తగినంత)
తయారుచేసే విధానం :
ముందుగా తీసుకున్న వంకాయలను తగిన సైజులో కట్ చేసుకుని, ఉప్పు వేసి పక్కన వుంచుకోవాలి.
తగిన మోతాదులలో పళ్లీలు, పుట్నాలపప్పు, ఎండుమిరపకాయలు నూనె లేకుండా వేయించాయి. ఇందులో జీలకర్ర, వెల్లుళ్లి రెబ్బలు తగిన మోతాదులో వేసి, గ్రైండర్ లో వేసి పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి.
ఇలా చేసుకున్న తరువాత పెనుమును ఒక స్టౌ మీద పెట్టుకుని అందులో కొద్ది మోతాదులో నూనె వేసుకోవాలి. కొంచెం వేడెక్కిన తరువాత అందులో ఆవాలు, పచ్చిశెనగపప్పు, కరివేపాకు వేసుకోవాలి. అవి చిటపటలాడిన తరువాత అందులో వంకాయ ముక్కలను వేసి మూతపెట్టాలి.
అది వేడెక్కిన కొద్దిసేపు తరువాత మిగిలిన పదార్థాలైన పసుపు, ధనియాలపొడి, ఉప్పు, మెంతిపొడి, కారం, గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ను వేసి, అందులో కొద్ది మోతాదులో కొంచెం నూనె వేసుకుని.. మరికొద్దిసేపు మూతపెట్టి వేడి చేసుకోవాలి.
చివరగా ఉల్లిపాయలను వేసి.. మరికొద్దిసేపు వేడి చేసుకుని దించుకోవాలి.
ఇలా చేసిన తరువాత ఎంతో రుచికరమైన వంకాయ మసాల వేపుడు (బ్రింజల్ మసాలా) మీకోసం రెడీ!
(And get your daily news straight to your inbox)
Nov 05 | మాంసాహారప్రియులు ఎంతో ఇష్టంగా తీసుకునే చికెన్ తో ఎన్నోరకాల వంటకాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా వీకెండ్ సమయాల్లో డిఫరెంట్ ఫుడ్స్ తీసుకోవడానికి ప్రతిఒక్కరు ఇష్టపడతారు. ఇక చికెన్ తో తయారుచేసే వివిధ వంటకాల్లో చికెన్ గారెలు... Read more
Oct 08 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు రుచికరమైన వెరైటీ వంటకాల్ని తీసుకోవడానికే ఇష్టపడతారు. అలాంటి ప్రత్యేకమైన వంటకాల్లో చికెన్ లాలీపాప్స్ ఒకటి. ఎంతో రుచికరంగా వుండే ఈ రిసిపీని తీసుకోవడానికి చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు ఎంతో... Read more
Sep 18 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా వుంటారు. ఆ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయాలంటే ఆ వీకెండ్ లో ఏదైనా స్పెషల్ రెసిపీ వుండాల్సిందే! అప్పుడు దాని మజాయే వేరుగా వుంటుంది.... Read more
Sep 08 | బియ్యపు పిండితో తయారయ్యే వేడివేడి వడలు కేరళలో ఎంతో స్పెషల్ రెసిపీ. ఇవి కూడా సాధారణ గారెలలాగే వుంటాయి కానీ.. మరింత క్రిస్పీగా, టేస్టీగా వుంటాయి. ఈ వడలతో ఆరోగ్య ప్రయోజనం కూడా వుంది.... Read more
Aug 27 | మాంసాహారులు ఎంతో ఇష్టంగా తినే చికెన్ తో రకరకాల వంటకాలు తయారుచేసుకోవచ్చు. చికెన్ పకోడీలు, బిర్యానీ, ఇంకా నోరూరించే స్పెషల్ వంటకాలు ఎన్నో వున్నాయి. పైగా.. ఈ చికెన్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.... Read more