సాధారణంగా ఒక్కొక్కొ ప్రాంతానికి సంబంధించి ఒక్కో వంటకం ప్రసిద్ధి చెంది వుంటుంది. మన హైదరాబాద్ లో దమ్ బిరియాని, చాయ్ వంటివి ఎంతో ముఖ్యమైనవి. అదేవిధంగా రకరకాల వంటలు రకరకాల ప్రాంతాలలో ఎంతో విశిష్టతను సంతరించుకుని వుంటాయి. కొన్ని వంటకాలయితే ఆ ప్రాంతం పేరుతోనే ప్రచురితమవుతాయి.
అటువంటి కోవలలోకే ఈ దమ్ ఆలు రిసిపీ కూడా ఒకటి. ఇది కాశ్మీర్ లో ఎంతో ప్రసిద్ధి చెందిన రిసిపీ. అందుకే దీనిని ప్రత్యేకంగా కాశ్మీరి దమ్ ఆలూ రిసిపీ అని అంటారు. అలా అని ఇది కేవలం కాశ్మీర్ లోనే చేసుకోరు... యావత్ భారతదేశంలో ఇదొక స్పెషల్ వంటకం. ప్రతిఒక్కరూ దీనిని ఇష్టపూర్వకంగా వండుకుని తింటారు.
ఈ రిసిపీ చిన్నచిన్న సైజులో వున్న పొటాటోస్ తో తయారుచేస్తారు. దీనిని తయారుచేసుకునే విధానం కూడా చాలా సులభమైంది.
కావలసిన పదార్థాలు :
బేబీ బంగాళదుంపలు (500 గ్రాములు); నూనె (ఫ్రై చేయడానికి సరిపడేంత); సన్నగా తరిగిన ఉల్లిపాయలు (1 కప్); అల్లం వెల్లుల్లి పేస్ట్ (1 టేబుల్ స్పూన్); పెరుగు (2 కప్స్); కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ (1 టేబుల్ స్పూన్); పసుపు (1/4 టేబుల్ స్పూన్); జీలకర్ర పొడి (1/2 టేబుల్ స్పూన్); సోంపు పొడి (1 టేబుల్ స్పూన్); గరం మసాలా (/2 టేబుల్ స్పూన్); ఉప్పు (సరిపడేంత)
తయారుచేసే విధానం :
పెద్దసైజులో వున్న బంగాళదుంపలను మీడియం సైజులో కట్ చేసుకోవాలి లేదా బేబీ పొటాటోలను తీసుకుని నీటిలో శుభ్రం చేసుకోవాలి.
తరువాత ఉప్పు కలిపిన నీటిని ఒక గిన్నెలో తీసుకుని, అందులో బంగాళదుంపలను వేసి ఉడికించుకోవాలి.
అలా వేడిచేసిన బంగాళదుంపలను తీసుకుని, వాటిపై వుండే పొట్టను మొత్తం తీసివేయాలి. దీనిని ఒక పక్క పెట్టుకోవాలి.
తరువాత ఒక పాన్ స్టై మీద పెట్టి, అందులో సరిపడేంత నూనెను వేసి, వేడి చేసుకోవాలి. వేడి అయిన కొద్దిసేపు తరువాత అందులో బంగాళదుంపలను వేయాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేడి చేయాలి.
ఇంకొక పాన్ తీసుకుని అందులో మూడుచెంచాల నూనె పోసి బాగా వేడి చేయాలి. ఆ తరువాత అందులో సన్నగా తరిమిన ఉల్లిపాయలను వేసి, అవి కూడా బ్రౌన్ రంగులో వచ్చేంతవరకు వేడి చేయాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ కూడా వేసి 5 నిముషాలవరకు వేడి చేయాలి.
మరోవైపు పెరుగులో పసుపు, కాశ్మిరీ రెడ్ చిల్లీ పౌడర్, జీలకర్ర, ఉప్పు, సోంపు వేసి బాగా మిక్స్ చేయాలి.
ఈ మిక్స్ చేసిన పేస్ట్ ను ఇంతకుముందు వేడి చేసుకున్న ఉల్లిపాయల పేస్టులో వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసిన మిశ్రమాన్ని పాన్ లో వేసి వేడి చేసుకోవాలి.
కొద్దిసేపు వేడి అయిన తరువాత అందులో బంగాళదుంపలు వేసి, కాసేపు ఉడికించాలి.
గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసి మరో రెండు మూడు నిముషాలు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి.
ఈ విధంగా కాశ్మీరీ దమ్ ఆలూని తయారుచేసుకుని తినొచ్చు.
(And get your daily news straight to your inbox)
Nov 05 | మాంసాహారప్రియులు ఎంతో ఇష్టంగా తీసుకునే చికెన్ తో ఎన్నోరకాల వంటకాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా వీకెండ్ సమయాల్లో డిఫరెంట్ ఫుడ్స్ తీసుకోవడానికి ప్రతిఒక్కరు ఇష్టపడతారు. ఇక చికెన్ తో తయారుచేసే వివిధ వంటకాల్లో చికెన్ గారెలు... Read more
Oct 08 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు రుచికరమైన వెరైటీ వంటకాల్ని తీసుకోవడానికే ఇష్టపడతారు. అలాంటి ప్రత్యేకమైన వంటకాల్లో చికెన్ లాలీపాప్స్ ఒకటి. ఎంతో రుచికరంగా వుండే ఈ రిసిపీని తీసుకోవడానికి చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు ఎంతో... Read more
Sep 18 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా వుంటారు. ఆ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయాలంటే ఆ వీకెండ్ లో ఏదైనా స్పెషల్ రెసిపీ వుండాల్సిందే! అప్పుడు దాని మజాయే వేరుగా వుంటుంది.... Read more
Sep 08 | బియ్యపు పిండితో తయారయ్యే వేడివేడి వడలు కేరళలో ఎంతో స్పెషల్ రెసిపీ. ఇవి కూడా సాధారణ గారెలలాగే వుంటాయి కానీ.. మరింత క్రిస్పీగా, టేస్టీగా వుంటాయి. ఈ వడలతో ఆరోగ్య ప్రయోజనం కూడా వుంది.... Read more
Aug 27 | మాంసాహారులు ఎంతో ఇష్టంగా తినే చికెన్ తో రకరకాల వంటకాలు తయారుచేసుకోవచ్చు. చికెన్ పకోడీలు, బిర్యానీ, ఇంకా నోరూరించే స్పెషల్ వంటకాలు ఎన్నో వున్నాయి. పైగా.. ఈ చికెన్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.... Read more