తీపి పదార్థాలను తినడానికి చాలామంది ఇష్టపడతారు. అందులో రకరకాల వంటకాలతో చేసిన తీపి పదార్థాలను తీసుకోవడంలో ఎక్కువ మక్కువ చూపుతారు. అటువంటి రకాలలో ఒకటైన ఈ బంగాళదుంప హల్వా కూడా చాలా ముఖ్యమైంది.
సాధారణంగా హిందువులు హోలీ పండుగ సందర్భంగా ఈ హల్వాను ప్రత్యేకంగా తయారుచేసుకుంటారు. ఇది ఎంతో రుచికరమైనదే కాకుండా చాలా తక్కువ సమయంలోనే తయారుచేసుకోవచ్చు.
హోలీ పండుగ సందర్భంగా ప్రతిఒక్కరు సంతోషంగా గడుపుతూ, ఒకరిమీద ఇంకొకరు రంగులు జల్లుకుంటూ, ఆహ్లాదకరంగా - ఉత్సాహంగా గడిపేస్తారు. అలాగే ఇంట్లో చేసుకున్న ఆహార పదార్థాలను ఒకరి ఇంటివారు ఇంకొకరితో పరస్పరం పంచుకుంటారు.
అటువంటి ఆహార పదార్థాలలో అందరికి ఆనందం కలిగించేదిగా ఈ హల్వా ఎంతో ముఖ్యమైంది. మరీ ఈ హల్వాను తయారుచేయడంలో ఉపయోగించే పదార్థాలను, విధానాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం....
కావలసిన పదార్థాలు :
ఉడికించిన బంగాళదుంపులు (కనీసం 10); పంచదార (1/4 కప్); బాదం (సరిపడేంత); ముక్కలుగా చేసుకున్న పిస్తా (2 లేదా 3); నెయ్యి (3 టేబుల్ స్పూన్స్)
తయారుచేసే విధానం :
మొదటగా ఉడికించిన బంగాళదుంపలను చల్లని నీటిలో కాసేపు వుంచి, దానిచుట్టూ వున్న పొట్టును తీసేసి, మెత్తగా చిదిమి పక్కన పెట్టుకోవాలి.
ఒక పెనుమును స్టౌ మీద ఉంచి, అందులో కొంచెం నెయ్యి పోసి వేడి చేయాలి.
అలా వేడి చేసిన నెయ్యిలో మెత్తగా చిదిమిన బంగాళదుంపలను వేసి బాగా మిక్స్ చేయాలి. అలా ప్రతి నిముషానికోసారి పెనుముకు అట్టుకోకుండా మిక్స్ చేస్తూ వుండాలి.
అలా చేసిన తరువాత పంచదారను వేసి దానిని కూడా పూర్తిగా కరిగేవరకు బాగా మిక్స్ చేసుకోవాలి.
అలా మిక్స్ చేసుకున్న హల్వాను స్టౌ నుంచి కిందకు దించి, దానిపై బాదం, పిస్తాలు వేసుకోవాలి.
ఈ విధంగా తయారుచేసుకున్న ఆలూ హల్వాను హోలీ పండుగరోజు పరస్పరం సర్వ్ చేసుకుంటూ, ఆనందంగా గడుపుతారు
(And get your daily news straight to your inbox)
Nov 05 | మాంసాహారప్రియులు ఎంతో ఇష్టంగా తీసుకునే చికెన్ తో ఎన్నోరకాల వంటకాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా వీకెండ్ సమయాల్లో డిఫరెంట్ ఫుడ్స్ తీసుకోవడానికి ప్రతిఒక్కరు ఇష్టపడతారు. ఇక చికెన్ తో తయారుచేసే వివిధ వంటకాల్లో చికెన్ గారెలు... Read more
Oct 08 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు రుచికరమైన వెరైటీ వంటకాల్ని తీసుకోవడానికే ఇష్టపడతారు. అలాంటి ప్రత్యేకమైన వంటకాల్లో చికెన్ లాలీపాప్స్ ఒకటి. ఎంతో రుచికరంగా వుండే ఈ రిసిపీని తీసుకోవడానికి చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు ఎంతో... Read more
Sep 18 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా వుంటారు. ఆ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయాలంటే ఆ వీకెండ్ లో ఏదైనా స్పెషల్ రెసిపీ వుండాల్సిందే! అప్పుడు దాని మజాయే వేరుగా వుంటుంది.... Read more
Sep 08 | బియ్యపు పిండితో తయారయ్యే వేడివేడి వడలు కేరళలో ఎంతో స్పెషల్ రెసిపీ. ఇవి కూడా సాధారణ గారెలలాగే వుంటాయి కానీ.. మరింత క్రిస్పీగా, టేస్టీగా వుంటాయి. ఈ వడలతో ఆరోగ్య ప్రయోజనం కూడా వుంది.... Read more
Aug 27 | మాంసాహారులు ఎంతో ఇష్టంగా తినే చికెన్ తో రకరకాల వంటకాలు తయారుచేసుకోవచ్చు. చికెన్ పకోడీలు, బిర్యానీ, ఇంకా నోరూరించే స్పెషల్ వంటకాలు ఎన్నో వున్నాయి. పైగా.. ఈ చికెన్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.... Read more