Women suiside attempt in chittoor district

women suiside, andhra pradesh, chittoor district, women suiside, women suiside attempt in chittoor district, police, police careless ness, police careless ness cause a death, police action against women

women suiside attempt in chittoor district

7.gif

Posted: 11/17/2012 03:57 PM IST
Women suiside attempt in chittoor district

policeee

     పోలీసుల నిర్లక్ష్యం ఓ తల్లి ప్రాణం మీదకొచ్చింది.  కట్టుకున్న భర్తే కాదు, కడుపున పుట్టిన కొడుకుల నుంచి కూడా ప్రాణ హాని ఉందని పోలీసులను ఆశ్ర యించినా స్పందించక పోవడంతో చిత్తూరు జిల్లా కొత్త శానంబట్లకు చెందిన వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
    వివరాల్లోకి వెళితే,  తన భర్త, కుమారుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ శానంబట్ల పంచాయతీ కొత్త శానంబట్లకు చెందిన బాలకృష్ణారెడ్డి భార్య రత్నమ్మ(42) చంద్రగిరి పోలీసులను ఆశ్రయించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్ వద్దనే రత్నమ్మ పడిగాపులు కాసినా పోలీసులు స్పందించలేదు. చివరకు ‘ స్టేషన్‌లో సిబ్బంది తక్కువగా ఉన్నారని, నీతో పాటు ఎవ్వరినీ పంపించలేమని, రేపు ఉద యం రావాలని’ పోలీసులు సూచించారు.  భర్త, కుమారులు తనను ఇంటి నుంచి గెంటేశారని, ఇప్పుడు వచ్చి బుద్ధి చెబితే తప్ప తాను ఇంటికి వెళ్లలేనని ప్రాధే యపడినా వారు స్పందించలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆమె పోలీసులపై తీవ్రస్థాయిలో మండిపడుతూ ఇంటికి వెళ్లింది.
      పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న కోపంతో రత్నమ్మను కుటుంబ సభ్యులు మరోసారి దుర్భాషలాడారు. దీంతో తనకు న్యాయం చేసే వారు కరువయ్యారని మనోవేదనకు గురైంది. దీంతో చంద్రగిరి పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి ‘మీ నిర్లక్ష్యానికి నేను చనిపోతున్నాను’ అంటూ ఫోన్ చేసి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన ఆమె బంధువులు 108కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమం గా మారడంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను తిరుపతి స్విమ్స్‌కు తరలించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lord sri venkateswara sankuchakranamam
Basketball tournament in chittoor district  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles