ప్రపంచంలో ఏ భాషలో లేని విధంగా 72 వేల నాడులను కదిలించే అమోఘశక్తి ఉన్న ఏకైక భాష తెలుగుభాష అని రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు రాళ్ళబండి కవితాప్రసాద్ ఉద్ఘాటించారు. డిసెంబర్ 27 నుండి మూడు రోజుల పాటు తిరుపతి అవిలాల చెరువులో జరుగనున్న ప్రపంచ తెలుగుమహాసభలకు సేవలు అందించేందుకు వాలంటీర్స్‌గా వినియోగించనున్న 1000 మంది ఎన్‌సిసి, ఎస్‌ఎస్‌ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు ఎస్వీయూ శ్రీనివాస ఆడిటోరియంలో శిక్షణా తరగతులు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో 2372 భాషలున్నాయని, భారతదేశంలో 23 భాషలున్నాయన్నారు. ప్రపంచంలో సాంప్రదాయ భాషలుగా గుర్తించినది కేవలం 6 భాషలన్నారు. అవి వరుసగా సంస్కృతం, గ్రీకు, లాటిన్, తమిళం, తెలుగు, పర్షియా భాషలన్నారు. ఇందులో ఇంగ్లీషుభాష లేదని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. సంస్కృతి నుండి పుట్టినభాషలను సాంప్రదాయ భాషలంటారన్నారు. ప్రపంచం గుర్తించిన ఆరుభాషల్లో తెలుగు భాషలో నాభి నుండి, ముక్కునుండి, గొంతు నుండి, చెవుల నుండి, గర్భం నుండి వచ్చే పదాలున్నాయన్నారు. మనిషి శరీరంలోని 72 వేల నాడులను కదిలించే శక్తి ఒక్క తెలుగుభాషకే వుందన్నారు. ఇంత శక్తివంతమైన తెలుగుభాషను యునెస్కో అంతరించిపోయే భాషల్లో ఒకటిగా తేల్చిందన్నారు.
ఏభాషలో అయినా యేడాదికి 5 శాతం మంది మాట్లాడేవారు తగ్గితే మొదటి ప్రమాదకర హెచ్చరికను జారీ చేస్తోందన్నారు. 10 శాతం తగ్గిపోతే వేగంగా అంతరించిపోయే భాషగా రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేస్తోందన్నారు. 20 శాతం తగ్గిపోతే మృతభాషగా గుర్తిస్తూ చివరిగా మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేస్తోందన్నారు. తెలుగుభాషకు ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరిక యునెస్కో సంస్థ జారీచేసిందన్నారు. దీన్ని దృష్టిలో వుంచుకుని అమృతభాష అయిన మన తెలుగుభాషను కాపాడుకోవాల్సిన అత్యవసర పరిస్థితి ప్రతి తెలుగువాడికి ఏర్పడిందన్నారు.
దేశంలోని 24 భాషల్లో హిందీ తరువాత అతిపెద్ద్భాషగా వున్న తెలుగు మూడవ స్థానానికి పడిపోయిందని రెండవ స్థానంలో నేడు బెంగాలీభాష వచ్చి చేరిందన్నారు. మనం ఇంగ్లీషుభాష మోజులో తెలుగుభాషను విస్మరిస్తున్నామన్నారు. మన నెహ్రూ, గాంధీ, సుభాష్ చంద్రబోస్‌లు ఇంగ్లీషు మాట్లాడుతుంటే బ్రిటీషువారు నోర్లు వెళ్లబెట్టి వినేవారన్నారు. అయితే మన నేతలు ఏనాడు వారి మాతృభాషను విస్మరించలేదన్నారు. తెలుగుభాషను చదవకుండానే మనం ఉన్నత చదువులు పూర్తి చేసుకుంటున్న సంస్కృతి మనకు వచ్చేసిందన్నారు. తిరుపతిలో జరుగనున్న ప్రపంచ తెలుగుమహాసభలకు 18 దేశాల నుండి తెలుగువారు వస్తున్నారన్నారు. 200 ఏళ్లక్రితం 375 మందిని వెట్టిచాకిరి చేయించుకునేందుకు మారిషస్ తీసుకువెళ్లారన్నారు. నేడు ఆ సంతతికి చెందిన వ్యక్తి ప్రధాన మంత్రి అయ్యారన్నారు. అక్కడి తెలుగువారు ఒక ప్రత్యేక విమానంలో తిరుపతికి వస్తున్నారన్నారు.
అలాగే 70 ఏళ్లక్రితం నైజీరియాలో సెటిల్ అయిన వారు, తైవాన్‌కు చెందిన వారు తిరుపతి మహాసభలకు వస్తున్నారన్నారు. అలాగే రష్యా, జర్మనీ తదితర దేశాల నుండి ప్రతినిధులు వస్తున్నారని, మన ఇంటికి వచ్చే అతిథులకు మర్యాదలు చేసి గౌరవించాల్సిన బాధ్యత మరందరిపైనా వుందన్నారు.
ఎస్వీయూ విసి ఉదయగిరి రాజేంద్ర మాట్లాడుతూ ప్రకృతిమిత్ర పేరుతో వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి తెలుగుమహాసభలకు సిద్ధం చేస్తున్నారన్నారు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీతల్లి భూమి భారతిని, నిలుపరా నీజాతి నిండుగౌరవము అంటూ రాయప్రోలు సుబ్బారావు రచించిన గేయాన్ని మనం గుర్తించుకోవాలన్నారు. తెలుగునేలను చూసి విదేశాల్లోని తెలుగువారు సంబరపడిపోనున్నారని, వారిలో ఎంతో ఉత్సాహం వుందన్నారు. మనకన్నా ఎంతో గొప్పగా దీపావళి, సంక్రాంతి వేడుకలను అమెరికాలోని తెలుగువారు చేసుకుంటున్నారన్నారు. వాలంటీర్లు విశేష సేవలు అందించి తిరుపతి విద్యార్థుల సత్తా చూపాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఎస్వీయూ ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం కో- ఆర్డినేటర్ శ్రీనివాసుల నాయుడు, ఎస్వీయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ పాపారావు, ప్రసన్నకుమార్, రఘు తదితరులు పాల్గొన్నారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more