More facilities for tourists at tirupati other heritage sites

More facilities for tourists at Tirupati-other heritage sites, Tirupati, Tourism Ministry, Andhra Pradesh, tourists, mega circuit projects, Tirupati circuit, Sri Kalyana Venkateshwara Swamy Temple, Sri Vedanaryana Swamy Temple, Srivari mettu, Chandragiri fort, Sri Kalahasteeshwara Temple, Sri Varasidhi Vinayaka Temple

More facilities for tourists at Tirupati-other heritage sites

అగ్రస్థానంలో తిరుపతి

Posted: 09/11/2013 09:01 PM IST
More facilities for tourists at tirupati other heritage sites

రాష్ట్రంలోని పలు చారిత్రాత్మక ప్రదేశాలతోపాటు తిరుపతి పుణ్యక్షేత్రంలో మౌళిక సదుపాయాలను, సౌకర్యాలను మెరుగుపరిచేందుకు కేంద్ర పర్యాటక శాఖ నడుం బిగించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యాటక ప్రదేశాల్లో యాత్రికులను ఆకర్షించేందుకు సెంట్రల్ ఫైనాన్స్ అసిస్టెంటెన్స్ (సీఎఫ్ఏ) పథకం కింద 2503 కోట్ల నిధుల విడుదలకు టూరిజం శాఖ పచ్చ జెండా ఊపింది. కేంద్రం విడుదల చేసిన నిధులతో తిరుపతి, కడప జిల్లాలో మెగా ప్రాజెక్టులకు స్వీకారం చూట్టేలా చర్యలు తీసుకోనున్నారు. తిరుపతి పట్టణానికి 1395 కోట్ల రూపాయలు, కడప ప్రాంతంలోని వివిధ ప్రాంతాల అభివృద్ధికి 1107 కోట్లను విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో చిత్తూరు జిల్లాలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీ వేద నారాయణ స్వామి ఆలయం, శ్రీవారి మెట్టు, చంద్రగిరి కోట, శ్రీ కాళహస్తీశ్వర్ ఆలయం, శ్రీ వరసిద్ధి వినాయక ఆలయాల అభివృద్ధికి వినియోగించనున్నారు. దేశంలోని సుప్రసిద్ధ పర్యాటక కేంద్రాలు తాజ్ మహాల్, అజంతా-ఎల్లోరా కంటే తిరుపతి పుణ్యక్షేత్రాన్ని ఎక్కువమంది పర్యాటకులు దర్శించుకుంటారని టూరిజం మంత్రిత్వ శాఖ తెలిపింది. గత సంవత్సరం ఆంధ్ర ప్రదేశ్ లో 206.8 మిలియన్ల స్వదేశీ పర్యాటకులు రికార్టు స్థాయిలో రాష్ట్రంలో పర్యటించినట్టు టూరిజం శాఖ వెల్లడించింది. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలువగా, ఉత్తర ప్రదేశ్ రెండవ స్థానాన్ని ఆక్రమించింది.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles