'అభినందన' సినిమా చూసిన ప్రతీ ప్రేక్షకుడికి , ఈ సినిమా కధనం , సంగీతం తో పాటు అంతే అమితంగా నచ్చేది ఈ చిత్ర హీరోయిన్ శోభన ... పేరుకి తగ్గ అందం , అందానికి తగ్గ అభినయం , అభినయాన్ని నాట్యం రూపం లో మేళవించి సినిమాల్లో ఇటు నటిగా అటు డ్యాన్స్ వచ్చిన హీరోయిన్ గా ఎంతో పేరు సంపాదించుకున్నారు శోభన ... తెలుగు, తమిళ , మళయాళ సినిమాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన ఘనత శోభన సొంతం ... 'రౌడీ అల్లుడు' చిత్రం లో 'చిలుకా క్షేమమా ' అనే పాటలో , నిజం చెప్పాలంటే, మెగా స్టార్ చిరంజీవి అభిమానులు కూడా శోభన నుండి చూపు తిప్పుకోలేకపోయారు ... ఇక మని రత్నం దర్శకత్వం వహించిన 'దళపతి' లో అయితే , శోభన అందం 'యమునా' నది అంత అందంగా చూబించారు అనడం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు ...
అయితే , హీరోయిన్ గా బిజీ గా ఉన్న సమయం లోనే , కొన్ని కారణాల వల్ల నటనకు స్వస్తి చెప్పి , తాను అభ్యసించిన నాత్యాన్నే వృత్తిగా చేసుకుని 1994 లో కళార్పణ అనే డ్యాన్స్ స్కూల్‌ని చెన్నైలో ప్రారంభించారు ... నాటి నుండి నేటి వరకు , వివిధ ప్రదేశాల్లో , విదేశాల్లో , ఎన్నో సినిమా వాళ్లకు సంబంధించిన వేడుకల్లో , తన బృందం తో కలిసి అబ్బుర పరిచే నాట్య ప్రదర్సనలు ఇచ్చారు , ఇస్తూనే ఉన్నారు శోభన ...
నాట్యం లో అంశాలను జోడించి , ఎన్నో సామాజిక , సాంఘిక , నవరసాల్లోని భావాలు , ఇలా ఒక్కటేమిటి , ప్రతీ విశేషం యొక్క ప్రాముఖ్యతను తన నాట్యం ద్వారా సామాన్య ప్రేక్షకులకు కూడా కళ్ళకు కట్టినట్టుగా చూబించడం శోభన ప్రత్యేకత ...
అందుకేనేమో సినిమాల్లో నటిగా కొనసాగినప్పుడు జాతీయ పురస్కారాలు అందుకున్నారు , నాట్య గురువు గా కూడా యెనలేని గౌరవం పొందారు ...
2010 లో ఒక ఆడపిల్లని దత్తత తీసుకుని , 'అనంతనారాయణి' అని నామకరణం చేసి, తనలోని అమ్మతనాన్ని చాటి చెప్పారు శోభన ...
తన నాట్యం ద్వారా ఈ సమాజం లోనే చైతన్యం తీసుకురావాలి అని తపన పడుతున్నానని , నాట్యం , తన పాపే తనకు ప్రపంచం అని అంటారు ఈమె ...
మనం ఎంచుకున్న రంగం లో ఇబ్బందులు ఎదురైనప్పుడు , ప్రవ్రుత్తినే వృత్తిగా చేసుకుని అందులో సిఖరాలని చేరవచ్చు అని సోభానని చూస్తె మనకు అర్ధం అవుతుంది ...
దాదాపు 60 సినిమాలకు పైగా అన్ని దక్షినాధి భాషల్లో నటించిన శోభన , నాట్యాన్ని కొనసాగిస్తున్నా , నటనా రంగానికి పూర్తిగా స్వస్తి చెప్పకుండా , అడపా దడపా సినిమాల్లో కనిపిస్తూనే ఉన్నారు . రజనీ కాంత్ 'కొచ్చాడియాన్' లో ప్రస్తుతం నటిస్తున్నారు శోభన ...
ఇంతకీ 'చంద్రముఖీ' మలయాళం వెర్షన్లో 'చంద్రముఖి' పాత్రను పోషించింది శోభనే ...
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more