Tollywood special story on melody queen s janaki

melody queen s janaki, sishta sreeramamurthy janaki, melody queen - s janak, s janak, telugu, kannada, malayalam, tamil, and hindi,playback singer s janaki

special story on melody queen s janaki

మధుర గాయని స్వరం నుండి జాలువారిన ఎన్నోరాగాలు

Posted: 05/11/2013 05:47 PM IST
Tollywood special story on melody queen s janaki

ఎన్ని వేల పాటలు , లెక్కలేనన్ని భాషల్లో పాడినా, ఈమె స్వరం నేటికీ చేక్కుచేదరదు . తన గాత్రాన్ని అవలీలగా మార్చి , తన గాత్రం తో ప్రేక్షకులను వేరేలోకంలో విహరించే విధంగా ఏమార్చే సత్తా ఉన్న గాయని ఆమె . ఘంటసాల మాస్టర్ దగ్గరి నుండి , నేటి తరం గాయకుల వరకు , అందరితో కలిసి , పోటీ పడి పాటలు పాడిన ఘనత ఆమె సొంతం . ఆమె జానకమ్మ . చిన్న పిల్లలవంటి నిష్కల్మషమైన నవ్వు , వెన్నెలే కన్నా చల్లనైన హృదయం . ఇంత సాధించిన , 'అంతా నా తోటివారు నా మీద చూబించిన అభిమానం , సరి అయిన అవకాశాలు నన్ను నమ్మి నాకు ఇవ్వడం . అన్నిటికీ మించి , అంతా ఈశ్వరేచ్చ' అనే గుణం జానకమ్మ సొంతం . అందుకే , ఈ మధుర గాయని స్వరం నుండి జాలువారిన ఎన్నోరాగాలు , విన్న ప్రతీ ప్రేక్షకుని మదిలో శతకోటి భావాలని పలికిస్తాయి . జాతీయం గా , అంతర్జాతీయం గా ఎంతో గుర్తింపు , ఎన్నో అవార్డులు జానకమ్మ సొంతం . అయినా కూడా , తనకు నచ్చకపోతే , సబబు అనిపించకపోతే , ప్రతిష్టాత్మకమైన అవార్డులని కూడా తిరస్కరించగల ఆత్మాభిమానం ... ఇన్ని గొప్ప అంశాల మేళవింపు జానకమ్మ . ఇటువంటి ఈ గాయని ఎన్నో పాటలు , ఎంతోమంది హేమాహేమీల సంగీత దర్శకత్వం లో పాడినా , ఇలయరాజాగారు ఆవిష్కరించినంతగా జానకమ్మ స్వరాన్ని ఇంకెవ్వరూ పలికించలేదేమో అనిపిస్తుంది .

ఇళయరాజా, యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జానకమ్మల కాంబినేషన్ లో వచ్చిన పాటలు శ్రోతలను విపరీతంగా ఆకర్షించాయి, ఆనందడోలికల్లో తెలేలా చేశాయి. జానకమ్మ గురించి బాలు స్వయంగా ఎ.వి.యమ్.స్టుడియో తన సన్నిహితుల వద్ద అన్నమాట ఇది "జానకి గారి గురించి ఏం చెపుతామయ్యా....ఆవిడ గాత్రం స్వరం మీద నవ్వుతుంది...స్వరం మీద ఏడుస్తుంది....స్వరం మీద నాట్యం చేస్తుంది. ఆవిడ గాత్రంగురించీ, ఆ గాత్రం లోని మధురిమ గురించి పొగిడేందుకు వేయి పడగలున్నఆ ఆదిశేషుడి తరం కూడా కాదయ్యా" అని అన్నారు. ఇంతకంటే అవార్డు ఇంకేం కావాలండీ. ఇంతకంటే రివార్డులేముంటాయి. అటువంటి జానకమ్మ నాలుగుసార్లు జాతీయ ఉత్తమ గాయనిగా ఎన్నికయ్యారు. ఇక తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన "కళైమామణి" అవార్డులవంటివి అనేకం జానకమ్మను వరించి ధన్యత చెందాయి.

జంధ్యాల గారి "శ్రీవారికి ప్రేమ లేఖ" చిత్రంలోని "తొలి సారి మిమ్మల్ని చూసింది మొదలు" పాటలో కన్నె పడుచులోని కలల కమ్మదనాన్ని ఎంత మధురంగానో పలికించారు జానకమ్మ. "రాక్షసుడు" చిత్రంలో దేవులపల్లి వారు వ్రాసిన అద్భుత దేశభక్తి గీతం "జయ జయ జయ ప్రియభారత జనయిత్రి దివ్య ధాత్రి- జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి" అనే పాట వింటే మన దేశం మీద దేశభక్తి పొంగిపొర్లుతుంది. ఇక "ప్రతిఘటన" చిత్రంలో "ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో" అనే పాట గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈ పాటలోని "మర్మం స్థానం కాదది నీ జన్మస్థానం మానవతకు మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం" పదాన్ని జానకమ్మ పలికిన తీరు విన్నవారెవరైనా స్త్రీని గౌరవించకుండా ఉండగలరా.....?

ఆ నటరాజు అనుగ్రహం, అలాగే వాగ్దేవి కరుణ మనపై ఉంటేనే కానీ మనలో కాళాకారులకు కావలసిన కనీస అర్హత ఉండదు. ఆ తర్వాత ఆ కళలో మనం రాణించాలన్నా కూడా వారి అనుగ్రహం ఉండితీరాలి. లేకపోతే ఏ వ్యక్తీ కళాకారులవ్వటం అసాధ్యం. కొంతమందికి కళాకారులవ్వటంలో ఆ భగవంతుడి కరుణాకటాక్ష వీక్షణాలు పరిపూర్ణంగా వారిపై ప్రసరిస్తూ ఉంటుంది. అలాంటి వారిలో తెలుగింటి పాటల పల్లకి, తేనెలూరే గాత్ర మాధురి, ఆరు నుంచి అరవై యేళ్ళ వయసు వారి వరకూ భావాలను తన గాత్రంలో పలికించగలిగే నేర్పరి ప్రముఖ సినీ నేపథ్య గాయని శ్రీమతి యస్.జానకి.

జానకమ్మ గురించి ఇళయరాజా ఒక తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో "జానకమ్మకి తేనె ఖర్చు ఎక్కువ. ఆమె దినామూ కొన్ని లీటర్ల తెనె తాగుతుంటాది. లేకపోతే ఆమె గాత్రంలో అంత మాధుర్యం ఎట్టా వచ్చునప్పా"అని ఆమె గాత్ర మాధుర్యం గురించి చమత్కరించారు.

17 కు పైగా భాషల్లో , 17 వేలకు పైగా పాటలు పాడిన జానకమ్మ , శాస్త్రీయ సంగీతం లో ఏమాత్రం ప్రావేన్యం పొందలేదని , తన తల్లి తండ్రులు చిన్నారి జానకంమకి సంగీతం నేర్పాలని తీసుకెళ్ళినప్పుడు 'ఈ అమ్మాయికి సంగీతం నేర్పనవసంలేదు' అని సంగీతం అన్నారు అంటే , జానకమ్మ కు సంగీతం స్వరం జన్మతః అబ్భిన విద్య , నిజంగానే ఈశ్వరుడు ఇచ్చిన వరం .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles