2014వ సంవత్సరంలో భారతదేశం మొత్తం మీద జరిగిన ఎన్నికల్లో ఎన్నడూలేని విధంగా ఫలితాలు వెల్లడయ్యాయి. ప్రధానమంత్రి హోదాను పొందేందుకు ఒకవైపు దేశంమొత్తం మీద మోదీ ప్రచారం కొనసాగితే.. మరోవైపు సోనియాగాంధీ తనయుడైన రాహుల్ గాంధీ వీటికి సంబంధించి అన్ని కార్యక్రమాలను సిద్ధం చేసుకున్నారు. తమ పార్టీల తరఫు నుంచి అనేకానేక ప్రాంతాలను సందర్శించి ప్రచారాలను కొనసాగించారు.
అయితే దురదృష్టవశాత్తూ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం పాలయ్యింది. దేశంలో అన్ని చోట్ల నుంచి ఏ ఒక్క ప్రాంతానికి అధికారాన్ని చేజిక్కుకోలేకపోయింది. చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టి, తెలంగాణాకు అనుకూలంగా తీర్పులు ఇచ్చినప్పటికీ.. వారికి విజయం వరించలేదు. 120 సంవత్సరాల నుంచి భారతదేశ అధికారాన్ని నడిపిన కాంగ్రెస్ పార్టీ.. నేడు నామరూపాలు లేకుండా కనుమరుగయిపోయింది. అధికారంలో వున్నంతకాలం కేవలం కరప్షన్, స్కాముల కేసుల్లోనే తలమునకలై మునిగిపోయింది.
ఇటువంటి పరిణామాలే మోదీని గెలిపించడంలో కీలకపాత్రను వహించాయి. ఎటువైపు చూసినా.. ‘‘అబ్ కీ బార్ మోదీ సర్కార్’’ నినాదం వ్యాపించింది. సుదీర్ఘకాలంగా గుజరాత్ సీఎం పదవి బాధ్యతలను కొనసాగించడంతోపాటు అక్కడ చేసిన మంచి కార్యక్రమాలకు ప్రపంచం మొత్తం మీద మోదీ హవా కొనసాగిపోయింది. అమెరికా అధ్యక్షుడైన బరాక్ ఒబామా కూడా ఎన్నికలకు ముందే మోదీ గెలుస్తాడన్న ధీమాను వ్యక్తం చేసి, ఆయనపై ప్రశంసల జల్లులు కురిపించేశారు.
ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి ఒకవైపు పవన్ కల్యాణ్, మరోవైపు టీడీపీ అధ్యక్షుడైన చంద్రబాబునాయుడు కూడా మోదీకి అనుకూలంగా ప్రచారాలు చేశారు. అలాగే ఉత్తరప్రదేశ్ లో కూడా ఎన్నడూ లేని విధంగా లోక్ సభ స్థానాలను గెలుచుకుంది. ఇలా ఈ విధంగా నరేంద్రమోదీ కాంగ్రెస్ పార్టీపై ఎక్కువ మెజారిటీతో గెలుపొంది, ప్రధానమంత్రి పదవి పగ్గాలు చేపట్టేందుకు సన్నద్ధమయ్యారు.
ఇలా నరేంద్రమోదీ ప్రధానిగా పదవీబాధ్యతలు చేపట్టడం కోసం గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి బుధవారం రాజీనామా చేశారు. బీజేపీ పార్టీలో వున్న సీనియర్ మంత్రులు, కార్యకర్తలు గుజరాత్ కొత్త సీఎం విషయమై అనేకానేక సమావేశాలు నిర్వహించుకున్నారు. చివరికి మోదీ ప్రోత్సాహంతో గుజరాత్ లోనే ఎమ్మెల్యేగా తనకంటూ ఒక రికార్డును సాధించుకున్న ‘‘ఆనందీబెన్’’ ను శాసనసభాపక్షనేతగా ఎన్నుకున్నారు. ఈమె ‘‘గుజరాత్ ఉక్కుమహిళ’’గా పేరు పొందారు.
ఆనందీబెన్ గురించి కొన్ని విశేషాలు :
బాల్యం - విద్యాభ్యాసం :
1941 నవంబరు 21వ తేదీన మెహసనా జిల్లాలో ఆనందీబెన్ జన్మించారు. ఈమెకు తన బాల్యం నుంచే చదువుపై వున్న శ్రద్ధను గమనించిన ఆమె తల్లిదండ్రులు.. ఈమె విద్యాభ్యాసానికి అడ్డు పడలేదు. ఈమె పాఠశాలలో విద్యను అభ్యసించేటప్పుడు ఆమె తప్ప మిగతా విద్యార్థినులు లేకపోవడం విశేషం. అంతగా ఆమె చదువుపై దృష్టిని కేటాయించడంపై కుటుంబసభ్యులు కూడా సహకరించారు. ఈమె కేవలం చదువులోనే కాదు.. ఆటల్లో కూడా మంచి ప్రావీణ్యాన్ని చూపించింది. చిన్నప్పుడే అథ్లెటిక్స్ లో మంచి ప్రతిభను చూపించడంతో ‘‘వీర్ బాల’’ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు.
జీవితంలో అనేక కష్టాలను, ఒడిదుడుకులను ఎదుర్కుంటూ ఆనందీబెన్ తన చదువును పూర్తి చేసుకున్నారు. అనంతరం అహ్మదాబాద్ కు వెళ్లి.. అక్కడే 30 సంవత్సరాలవరకు ఉపాధ్యాయురాలిగా కొనసాగారు. పిల్లలకు మంచి చదువుతోపాటు భారతదేశ సమాజం పట్ల జ్ఞానాన్ని అందజేసేవారు.
రాజకీయ ఆరంగేట్రం :
1987వ సంవత్సరంలో ఆనందీబెన్ తన పాఠశాల విద్యార్థులతో కలిసి విహారయాత్రకు బయలుదేరారు. అక్కడే వున్న నదీపరివాహక ప్రాంతంలో పిల్లలందరూ ఆడుకుంటుండగా.. అందులో నుంచి ఇద్దరు పిల్లలు నదిలో పడిపోయారు. అది చూసిన ఆనందీబెన్ ముందువెనకా ఆలోచించకుండా వారిని కాపాడటానికి నదిలో దూకి రక్షించారు. ఈ సంఘటనే ఆమె రాజకీయ ఆరంగేట్రానికి తొలిమెట్టుగా కలిసివచ్చింది.
ఆమె సాహసాన్ని గమనించిన అప్పటి భాజపా సీనియర్ నాయకులు, శ్రేణులు ఆనందీబెన్ ను పార్టీలోకి గౌరవంగా ఆహ్వానించాయి. ఇలా ఈ విధంగా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఈమె.. అంచెలంచెలుగా ఎదుగుతూ తన రాజకీయ ప్రస్థానాన్ని పదిలం చేసుకున్నారు. ఈమె భర్త అయిన మఫత్ రాయ్ కూడా అదే పార్టీలో సుదీర్ఘకాలంగా కొనసాగుతూనే వున్నారు.
తన రాజకీయ జీవితంలో అందించిన సేవలకు ఆనందీబెన్ ఏకంగా జాతీయ రాజకీయాల్లోకే ప్రవేశించారు. ఆమె ప్రవేశించిన అనంతరం నరేంద్రమోదీ కూడా ఆమెకు అనుకూలంగా అన్ని విధాలుగా సహకరించారు. ఆయన ప్రోత్సాహంతోనే గుజరాత్ మహిళామోర్చా అధ్యక్షురాలిగా బెన్ నియమితులయ్యారు.
ఇలా అధ్యక్ష పదవిలో కొనసాగిన కొన్నాళ్ల తరువాత ఆనందీబెన్ గుజరాత్ లో మహిళా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సుదీర్ఘకాలంగా గుజరాత్ లో మహిళా ఎమ్మెల్యేగా కొనసాగించి ఒక కొత్త రికార్డును సృష్టించారు. మోదీ సీఎంగా వున్న రోజుల్లో ఆయన గుజరాత్ లో లేనప్పుడు.. ఆనందీబెన్ సారధ్యంలో అన్ని ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగేవి. అంతేకాకుండా విద్యాశాకమంత్రిగా వున్నప్పుడు రాష్ట్రమంతటా వున్న పాఠశాలలను పర్యటించి, బాలికల నివృత్తిని పెంచేందుకు అనేక పథకాలను కూడా ప్రవేశపెట్టారు. అందులో బేటీ బచావో, కన్యాకేలవాణిశాల ప్రవేశోత్సవ్ వంటి పథకాలకు గుజరాత్ లో మంచి ఆదరణ లభించింది.
ఇలా అనేకరకాలుగా ఆనందీబెన్ రాజకీయాల్లో మంచి పనితీరును చూపించడంతో నేడు ఆమె ముఖ్యమంత్రి పదవికి చాలా చేరువయ్యారు. మునుపటిలాగే ఈమె కూడా గుజరాత్ రాష్ట్ర తోడ్పాటుకు అన్ని విధాలుగా సహకరిస్తారని ఆకాంక్షిస్తూ.. గుజరాత్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఎన్నికయినందుకు ఆమెకు శుభాకాంక్షలు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more