మన భారతదేశ రాజ్యాంగంలోని రాజకీయ పరిస్థితులలో కొత్త మార్పులు సంభవించుకుంటున్నాయి. మొన్నటివరకు రాజకీయ రంగంలో మహిళలకు అంతగా గౌరవం లభించకపోయినప్పటికీ.. తమ సత్తాను చాటుకుంటూ కొంతమంది తమ ప్రతిభను ప్రదర్శించుకోగలిగారు. మగవారితోపాటు మహిళలకు కూడా సమాజంలో సమాన హక్కులను కల్పించాలని ఎందరో మహిళా మహాజనులు ముందుకు వచ్చారు. సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను తరిమికొట్టే విధంగా నిలువెత్తు నిరసనలను తెలుపుతూ.. ప్రస్తుతకాలంలో వున్న యువతులకు, మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. ఆకలితో అలమటిస్తున్న పేదరిక ప్రజలకు అండగా వుంటూ, వారి హక్కుల కోసం భారత ప్రభుత్వాల పట్ల సవాళ్లుగా మారి తమ సేవలను అందించారు. ప్రజల గుండెల్లో మనోధైర్యాన్ని నింపుతూ... వారిని సరైన బాటలో నడిపించేందుకు అన్నివేళలా కృషి చేశారు. రాజకీయ రంగంలో తమకుంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకుని, దేశం - సమాజం - ప్రజల పట్ల జరుగుతున్న అన్యాయాలను అరికట్టడంలో తమవంతు పాత్రను పోషించారు. సామాన్య ప్రజలను కేంద్ర బిందువులుగా మార్చుకుని, వారికి ఎటువంటి లోటు లేకుండా అన్ని సదుపాయాలను కల్పించడంలో నిత్యం కసరత్తు చేశారు. అటువంటి మహిళా రాజకీయ నాయకురాలలో ఒకరు మన భారతదేశ రెండవ మహిళా లోక్ సభ స్పీకర్ ‘‘సుమిత్రా మహాజన్’’.
1975వ సంవత్సరంలో భారత ప్రజాస్వామ్యం అన్నివైపులా జరుగుతున్న ఆంక్షలతో స్తంభించిపోయింది. ఎన్నో దారుణాలు జరుగుతున్న ఆనాటి కాలంలో ప్రశ్నించే నాథుడే కరువైపోయాడు. ఎవరైనా సహాయం చేద్దామని ముందుకు వస్తే.. వారిని అప్పటికప్పుడే జైలులో బంధించి, రకరకాల చిత్రహింసలతో బాధపెట్టేవారు. సామాన్య ప్రజలకు అండగా వుంటూ, దేశ ప్రజాస్వామ్య పరిస్థితిని సరిదిద్దడం కోసం ఎవరూ లేరన్న తరుణంలో ప్రతిఒక్కరు బాధపడుతుండగా... ఓ యువతి ధైర్యసాహసాలతో ప్రజలకు మంచి చేయాలనే నెపంతో ముందుకు వచ్చింది. ఎటువంటి అన్యాయాలు చేయకుండా పోలీస్ స్టేషన్లో బంధించిన సామాన్య ప్రజలను విడిపించేందుకు, వారి కష్టనష్టాలలో పాలుపంచుకునేందుకు, సమాజంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు పెనుసవాళ్లుగా నిలిచి ముందుకు సాగిపోయారు. ‘‘మీకోసం నేనున్నా’’నంటూ సామాన్యుల కోసం రాజకీయ రణరంగంలో ప్రవేశించిన సుమిత్ర మహాజన్ గారు.. నాలుగు దశాబ్దాలుగా ఇండోర్ వాసులకు అండగా నిలుస్తూ తన రాజకీయ ప్రస్థానాన్ని పదిలం చేసుకున్నారు. పడిన కష్టాలకు, సామాన్య ప్రజలకు అందించిన సేవలకు ఆ నగరవాసులు ఆమెను ‘‘తాయి’’గా ఆదరాభిమానంతో పిలుచుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీలో స్థానం సంపాదించుకున్న సుమిత్రగారు అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం రెండవ మహిళా లోక్ సభ స్పీకర్ గా ఎన్నికయ్యారు.
రాజకీయ జీవితం :
1975వ సంవత్సరంలో నలువైపులా ఆంక్షలతో స్థంబించిపోయిన ప్రజాస్వామ్యానికి అండగా నిలబడడానికి ముందుకు వచ్చారు సుమిత్ర మహాజన్ గారు. మహిళలకు కనీస గౌరవ మర్యాదలు లభించిన ఆనాటి సమాజంలో ఏమీ లెక్కచేయకుండా ప్రజల పక్షాన వుంటూ పోరాడారు. ఆ విధంగా పోరాటం మొదలుపెట్టిన సుమిత్ర జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. 1982వ సంవత్సరంలో ఇండోర్ కార్పొరేట్ గా ఎన్నికయిన ఈమె 1985వరకు అదే పదవిలో కొనసాగారు. విధులు నిర్వహిస్తుండగానే 1984 నుంచి 1985వరకు అంటే రెండేళ్లవరకు ఆ నగరానికి డిప్యూటీ మేయర్ గా బాధ్యతలను స్వీకరించారు. అయితే ఒకేసారి అన్ని వ్యవహారాలను చూసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కున్న ఆమె.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి వరుసగా మూడుసార్ల వరకు ఓడిపోయారు.
ఓటమిపాలయినా ఏమాత్రం పట్టింపు లేకుండా కేవలం ప్రజాసేవ చేసుకుంటూ తన రాజకీయ జీవితాన్ని ముందుకు కొనసాగించారు సుమిత్రగారు. మహిళలపై జరిగిన వేధింపులకు, హింసకు, అన్యాయాలకు వ్యతిరేకంగా గళం విప్పి, సాటి మహిళకు స్ఫూర్తిగా నిలిచారు. పొదుపు, ఉపాధి పథకాల పట్ల అందరికీ అవగాహనం కల్పించేందుకు రకరకాల కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అలా ఆ విధంగా సామాన్య ప్రజలకు ఆమె అందించిన సేవలకుగాను 1989లో జరిగిన ఎన్నికల్లో లోక్ సభకు పోటీచేసి ఘన విజయం సాధించారు. 1992 - 94 వరకు భారతీయ జనతాపార్టీరి వైస్ ప్రెసిడెంట్ గా విధులను నిర్వహించారు. 1996లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. 1999 నుంచి 2002 వరకు కేంద్రమంత్రిగా పనిచేసి, తనవంతు కృషిని అందజేశారు. ఆ తరువాత 2009లో కూడా 7వ సారి భారతీయ జనతాపార్టీ తరఫున లోక్ సభ సభ్యురాలిగా పదవిని చేపట్టారు. ఇలా వరుస విజయాలతో ముందుకు దూసుకుంటూపోయిన సుమిత్రగారు.. ప్రస్తుతం రెండవ మహిళా లోక్ సభ స్పీకర్ గా బాధ్యతలను స్వీకరించి, చరిత్రను సృష్టించారు.
బాల్యం - విద్యాభ్యాసం - వ్యక్తిగత జీవితం :
సుమిత్ర మహాజన్ గారు 1942 ఏప్రిల్ 12వ తేదీన మహారాష్ట్రలోని చిప్లన జిల్లా రత్నగిరిలో నివాసం వుంటున్న శ్రీ పురుషోత్తం నీలకాంథ్ సాథే, శ్రీమతి ఉషా దంపతులకు జన్మించారు. అయితే ఈమె పెరిగిందీ, చదివిందీ మాత్రం మహారాష్ట్ర రాష్ట్రంలోని ఇండోర్ ప్రాంతంలో. ఆరెస్సెస్ కార్యకర్త అయిన తండ్రి నీలకాంథ్ గారు క్రమశిక్షణకు, సిద్ధాంతాలకు ఎల్లప్పుడూ కట్టుబడి వుండేవారు. సుమిత్రగారు కూడా తండ్రి నడిచిన బాటలోనే నడుస్తూ, ఆయననే మార్గదర్శిగా చేసుకుని సమాజంలో ముందుకు నడిచారు. చదువులో డిగ్రీ, పీజీ, న్యాయవిద్య వంటి ఉన్నత విద్యాభ్యాసాలను పూర్తి చేశారు. 1965 జనవరి 29వ తేదీన శ్రీ జయంత్ మహాజన్ గారితో సుమిత్ర వివాహం జరిగింది. వీరిద్దరికీ ఇద్దరు కుమారులు వున్నారు. వీరిలో పెద్దబ్బాయి ఐటీ రంగంలో వుండగా.. చిన్నబ్బాయి పైలట్ గా వ్యవహరిస్తున్నాడు.
మరికొన్ని విశేషాలు :
సాధారణంగా రాజకీయాలలో గెలుపు ఓటములు సహజంగా వుంటాయి. ఏ ఒక్క నాయకుడు కూడా కనీసం పదేళ్లవరకు నాయకత్వ బాధ్యతలను చేపట్టలేడు. కానీ సుమిత్ర మహాజన్ గారు అటువంటి సుసాధ్యాన్ని కూడా సులువుగా సాధ్యం చేసి, దేశ ప్రజలకు తన ప్రతిభను చాటి చెప్పారు. దాదాపుగా పాతికేళ్లపాటు ఇండోర్ ఎంపీగా ప్రజాభిమానాలను పొందుతూ.. కాంగ్రెస్ పార్టీకి పట్టపగలే చుక్కలు కనిపించేలా చేశారు. అసలైన రాజకీయాలంటే ఏమిటో అందరికీ తెలియపరిచేలా నిత్యం శ్రమిస్తుండేవారు. సుమిత్రగారు మాట్లాడుతూ.. ‘‘నేను రాజకీయ నేతలలాగా దూకుడుగా ప్రవర్తించే మనిషిని కాను. నేను ప్రజల మనిషిని. వారితోనే కలిసి పనిచేస్తూ, వారి కష్టాలు - సమస్యలను తెలుసుకుని తీర్చే ప్రయత్నం చేస్తాను’’ అన్న మాటకు కట్టుబడి వుంటూ.. అందరికీ రాజకీయం మీద నమ్మకం కలిగేలా అభివృద్ధి పనులను చేపట్టారు. ప్రజల మంచి కోసమే ఎప్పుడూ ఆలోచించే సుమిత్రగారు వరుసగా గెలుచుకుంటూ పాతికేళ్లవరకు రాజకీయ రణరంగాన్ని ఏలారు.
సుమిత్ర మహాజన్ గారికి కేవలం తన పార్టీలోనే కాదు.. ప్రత్యర్థి పార్టీలో కూడా అభిమానించేవారు చాలామంది వున్నారు. అందుకు ఉదాహరణగా.. 2013 మార్చి నెలలో ఆర్థిక బడ్జెట్ పై లోక్ సభలో చర్చ మొదలైంది. దానికి సంబంధించిన ప్రశ్నలను సుమిత్ర మహాజన్ గారు ఒక్కొక్కటిగా మొదలుపెడితే.. కొందరు కాంగ్రెస్ సభ్యులు ఆమె ప్రసంగాన్ని అడ్డుకోవడానికి ఎంతో రభస సృష్టించారు. అయితే అదే అధికార పక్షంలో వున్న నేతలు సుమిత్రకు అనుకూలంగా.. ‘‘ఆమెను మాట్లాడనివ్వండి.. ప్లీజ్’’ అంటూ మద్దతును ప్రకటించారు. ఇలా ఈ విధంగా తన పాతికేళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో సుదీర్ఘ ప్రసంగాలలో పాల్గొని తన అభిమానాన్ని చాటుకున్నారు సుమిత్ర మహాజన్.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more