ప్రపంచం మొత్తం మీద గర్వించదగ్గ మహిళలు మన భారతదేశంలో ఎందరో అవతరించారు. మహిళలకు స్ఫూర్తిగా, వారిలో చైతన్యాన్ని నింపుతూ ఎందరో వనితలు చరిత్రను సృష్టించారు. అన్ని రంగాలలోనూ మగవారితో ధీటుతో, అన్ని ఆటంకాలను ఎదుర్కొంటూనే ఓటమిని అంగీకరించకుండా ముందుకు నడిచారు. తమ లక్ష్యాలను ఎలాగైనా సాధించుకోవాలన్న ఆకాంక్షతో పట్టు వదలకుండా నిరంతరం శ్రమించి ఉన్నత స్థానాలను అవరోధించారు. యుక్త వయస్సులో వున్న అమ్మాయిలకు, మహిళలకు నిదర్శనగా వుంటూ విజయపథంలోకి దూసుకుపోయారు.
అటువంటి ప్రతిభావంతులైన మన భారతదేశ మహా మహిళమణుల గురించి ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం...
1. సావిత్రిబాయి ఫూలే... 1848వ సంవత్సరంలో తొలి భారతీయ మహిళా ఉపాధ్యాయురాలిగా పనిచేసి చరిత్రను సృష్టించారు. సావిత్రి ఫూలేగారు సంఘ సంస్కర్త అయిన జ్యతిరావ్ ఫూలేను వివాహమాడారు. వీరిద్దరూ కలిసి పూణెలోని బుధవార్ పేటలో మహిళలకోసం ఒక ప్రత్యేకమైన పాఠశాలను 1848వ సంవత్సరంలో నిర్మించారు. ఆనాడు సమాజంలో జరిగిన బాల్య వివాహాలను, స్త్రీ - శిరోముండనం, సతీ సహగమనం వంటి దుష్ట సంప్రదాయాలకు, మహిళలకు జరిగిన అన్యాయాల గురించి నిరసిస్తూ వాటికి వ్యతిరేకంగా ‘‘నాయీ’’ (మంగలి) సమాజాన్ని ఏర్పాటు చేసిన ఘనత సావిత్రిఫూలేగారికే దక్కుతుంది.
2. కాదంబినీ గంగూలీ... బ్రిటీష్ పరిపాలన కాలంలోని 1883వ సంవత్సరంలో కాదంబినీ గంగూలీ, చంద్రముఖి బసు ఇద్దరూ మొదటి మహిళా గ్రాడ్యుమేట్స్ గా ఆవిర్భవించి చరిత్రలోనే నిలిచిపోయారు. మహిళలు కూడా చదువులో ఏమాత్రం తీసుకుపోరని, వారికి కూడా సమాజంలో సమాన హక్కు కలగాలనే నెపంతో వీరిద్దరు ఈ హోదాను సంపాదించుకోగలిగారు. ఆనాటి ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. అలాగే కాదంబినీ గంగూలీ, ఆనందినీ గోపాల్ జోషీ 1886వ సంవత్సరంలో వెస్టర్న్ మెడిసిన్ లో శిక్షణ పొందిన తొలి భారతీయ మహిళలుగా రికార్డులకెక్కారు.
3. 1905వ సంవత్సరంలో సుజనే ఆర్డీ టాటా కారును నడిపిన తొలి భారతీయ మహిళగా చరిత్రలో సంచలనం సృష్టించారు.
4. అనీబిసెంట్... 1917వ సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. ఈమె భారతదేశం, ఐరోపాలలో జరిగిన స్వరాజ్య పోరాటాలకు తన మద్దతును అందించింది. మహిళలకు కూడా సమాజంలో మగవారిలాగా సమాన హక్కులు కల్పించాలని ఎన్నో ఉద్యమాలను నిర్వహించింది. 1898వ సంవత్సరంలో కేంద్రీయ హిందూ కళాశాలను స్థాపించడంలో ఎంతో సహకరించింది. 1907వ సంవత్సరంలో దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షురాలిగా కూడా వ్యవహరించింది.
5. పండిత రమాబాయి... భారతదేశ సమాజ సేవలను అందించినందుకు ‘‘కౌసర్ ఐ హింద్’’ అనే మెడల్ ను 1919వ సంవత్సరంలో అందుకున్న తొలి భారతీయ మహిళగా గుర్తింపును సంపాదించుకున్నారు. స్త్రీ జనరోద్ధరణకు, స్త్రీలకు విద్యను అందించాలని ఎంతోగానో కృషి చేశారు. ఈమె సంస్కృత పండితురాలిగా కూడా ప్రసిద్ధి చెందారు.
6. సరోజినీ నాయుడు... బ్రిటీష్ పరిపాలన కాలంలో భారతదేశానికి స్వాతంత్ర్యం కల్పించడానికి పాటుపడిన సమరయోధురాలు. ఈమె తన కవిత్వాల ద్వారా ‘‘భారత కోకిల’’ (ద నైటింగేల్ ఆఫ్ ఇండియా)గా ప్రసిద్ధి చెందారు. 1935వ సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు తొలి మహిళా ప్రెసిండెంట్ గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ తరఫు నుంచి ఈమె ఎన్నో మహాసభలను అధ్యక్షరాలిగా వ్యవహరించారు. అంతేకాదు.. స్వతంత్ర భారతదేశానికి తొలి మహిళా గవర్నర్ గా కూడా 1947వ సంవత్సరంలో ఎన్నికయి చరిత్రను సృష్టించారు.
7. అసీమా ఛటర్జీ... 1944వ సంవత్సరంలో యూనివర్సీటీ ఆఫ్ కలకత్తా నుంచి సైన్స్ విభాగంలో తొలిసారిగా డాక్టరేట్ ను తీసుకున్న ఘనత ఈమెకే వరిస్తుంది. ఈమె ప్రముఖ భారతీయ రసాయనశాస్త్ర కూడా! ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫైటో మెడిసిన్ రంగాలలో ఎంతగానో కృషిచేసి... మలేరియా, ఎపిలెప్సీ, వింకా ఆల్కలాయిడ్లు వంటి వ్యాధులకు మందులు కనుగొనడంలో ముఖ్యపాత్రను పోషించారు. భారతదేశంలో వైద్యానికి ఉపయోగపడే మొక్కల గురించి కూడా ఒక పుస్తకాన్ని రచించారు.
8. ప్రేమ మాధుర్... 1951వ సంవత్సరంలో తొలి కమర్షియల్ ఉమెన్ పైలట్ గా వ్యవహరించి, చరిత్రలో తన పేరును నమోదు చేసుకున్నారు. దెక్కన్ ఎయిర్ వేస్ లో తన సహాయ సహకారాలను అందించారు.
9. విజయలక్ష్మీ పండిట్... 1953వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి ప్రెసిడెంట్ గా ఎన్నికయిన తొలి భారతీయ మహిళ. ఈమె భారతదేశ రాజకీయ, దౌత్యవేత్త. అంతేకాదు.. మంత్రి పదవిని పొందిన తొలి మహిళగా కూడా ప్రసిద్ధి చెందారు. తరువాత 1962 నుంచి 1964వరకు మహారాష్ట్ర రాష్ట్రానికి గవర్నర్ గా తన సేవలను అందించారు. భారత స్వాతంత్ర్యం కోసం అహర్నిశలు కష్టపడి, ఎన్నో కారాగార శిక్షలను, అవమానాలకు కూడా భరించారు.
10. అన్నా చాందీ... 1959వ సంవత్సరంలో కేరళ హైకోర్టుకు తొలి మహిళా జడ్జిగా నియమితులయి.. భారతీయ మహిళలకు ఆదర్శంగా నిలిచారు. సమాజంలో మహిళల మీద జరుగుతున్న అన్యాయాలను, అత్యాచారాలను అరికట్టాలనే మనోధైర్యంతో ఈమె లా చదువును పూర్తి చేసింది. తొలుత న్యాయవాదిగా విధులను కొనసాగించిన ఈమె... హైకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టి.. సరికొత్త రికార్డును సృష్టించారు.
11. సుచేతా కృపలానీ... 1963వ సంవత్సరంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పాటుపడిన స్వాతంత్ర్య సమరయోధులలో ఈమె కూడా ఒకరు. అలాగే భారత రాజకీయ వ్యవస్థలో ఆనాడు జరిగిన అక్రమాలను అణచివేసింది.
12. దుర్గా బెనర్జీ... ఇండియన్ ఎయిర్ లైన్స్ కు పైలట్ గా పనిచేసిన తొలి మహిళగా గుర్తంపును పొందారు. 1966వ సంవత్సరంలో అదే ఎయిర్ లైన్స్ సంస్థలో తొలి మహిళా కెప్టెన్ గా ఎన్నికయ్యారు.
13. కమలాదేవీ ఛటోపాధ్యాయ... కమ్యూనిటీ లీడర్ షిప్ విభాగంలో ‘‘రామస్ మెగసెసె’’ అవార్డును 1966వ సంవత్సరంలో పొందిన తొలి మహిళగా పేరు పొందారు. అంతేకాదు... గృహకుటీర పరిశ్రమల సముద్ధరణకోసం విశ్రాంతి లేకుండా సేవలు అందించినందుకు భారత ప్రభుత్వం 1955వ సంవత్సరంలో పద్మభూషణ్, 1987లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందించింది. అలాగే శాంతినికేతన్ నుంచి ‘‘దేశి కోత్తమ’’ సత్కారాన్ని కూడా అందుకున్నారు. ఈమె నటనలో కూడా తన ఖ్యాతిని చాటుకున్నారు. శంకరపార్వతి, ధన్నాభగత్ వంటి సినిమాల్లో నటించి మంచి పేరును సంపాదించుకున్నారు.
14. ఇందిరాగాంధీ... భారతదేశానికి ప్రధానమంత్రిగా 1966వ సంవత్సరంలో తొలి మహిళగా ఎన్నికయి చరిత్రను సృష్టించారు. జవహర్ లాల్ నెహ్రూ కూతురయిన ఈమె.. ఆయన ప్రధానమంత్రిగా వున్నప్పుడు ఒక్క రూపాయి జీతం కూడా తీసుకోకుండా సెక్రటరీగా పనిచేశారు. అలాగే లాల్ బహుదూర్ శాస్త్రిగారి మంత్రి మండలిలో ప్రసారశాఖ మంత్రిగా కూడా వ్యవహరించారు.
15. కమల్ జిత్ సంధు... 1970వ సంవత్సరంలో భారతదేశం తరఫు నుంచి ఏషియన్ గేమ్స్ లో పాల్గొన్న ఈమె ఏకంగా గోల్డ్ మెడల్ నే సంపాదించి రికార్డులకెక్కారు. 400 మీటర్ల గల దూరాన్ని కేవలం 57.2 సెకండ్లలోనే పూర్తి చేసి తన ప్రతిభను చాటుకున్నారు.
16. కిరణ్ బేడి... భారతదేశంలో గర్వించదగ్గ మహిళల్లో ఈమె ఒకరు. 1972వ సంవత్సరంలో తొలి మహిళా ఐపీఎస్ గా ఎంపిక అయి, నిబద్ధతతో తన పనిని నిర్వర్తించింది. పోలీసు శాఖలో అనేక పదవులు, సంస్కరణనలను చేపట్టినందుకు మెగసెసె అవార్డుతో ఇంకా పలు అవార్డులు ఈమెకు వరించాయి. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చి అండ్ డెవలప్ మెంట్ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తూ.. 2007వ సంవత్సరంలో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు.
17. మదర్ థెరిసా... 1979వ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న తొలి భారతీయ పౌరురాలుగా తన ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా వెదజల్లారు. భారతదేశంలో వున్న పేద పిల్లలకు, మహిళలకు, వృద్ధులకు తనవంతు సహాయంగా ఆశ్రమాలను నిర్మించింది. ఛారిటీల పేరుతో దేశం నలుమూలల వున్న పేదప్రజలకు పరిచర్యలు చేశారు. 1980వ సంవత్సరంలో భారతదేశంలోనే అత్యున్నత పురస్కారమైన భారతరత్నను కూడా పొందారు.
18. బచేంద్రిపాల్... 1984వ సంవత్సరంలో అత్యంత ఎత్తయిన ఎవరస్టు శిఖరాన్ని అవరోధించిన తొలి మహిళగా చరిత్ర రికార్డులకెక్కారు. తల్లిదండ్రులు, బంధువుల సహాయంతో ఎంఎబిఎడ్ ను పూర్తి చేయగలిగారు.
19. ఫాతిమా బివి... కేరళ రాష్ట్రానికి చెందిన ఒక న్యాయమూర్తి. 1989వ సంవత్సరంలో సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జిగా ఖ్యాతిని గడించి, చరిత్రలో వున్న రికార్డులనే తిరగరాశారు. మన భారతదేశంలోనే అత్యున్నత స్థానం పొందిన మొదటి ముస్లిం మహిళ కూడా ఈవిడే. తరువాత కొన్నాళ్లపాటు తమిళనాడు గవర్నరుగా కూడా తన సేవలను అందించారు.
20. ప్రియా జింగాన్... 1992వ సంవత్సరంలో ఇండియన్ ఆర్మీలో చేరిన తొలి మహిళ క్యాడెట్ గా ఈమెను సరికొత్త చరిత్రను సృష్టించారు. ఆనాటి వరకు ఆర్మీలోకి రావడానికి మగవారే భయపడుతున్న తరుణంలో... ఈమె రంగప్రవేశం చేసి మహిళలలో స్ఫూర్తిని పెంపొందించింది. మగవారికి ధీటుగానే తన సేవలను అందిస్తూ వచ్చింది.
21. హరితా కౌర్ డియోల్... ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో తొలి మహిళా పైలట్ గా 1994వ సంవత్సరంలో చేరి చరిత్ర రికార్డులకు ఎక్కారు.
22. కల్పనా చావ్లా... భారతీయ సంతతికి చెందిన వ్యోమగామి యంత్రి నిపుణురాలు అయిన ఈమె 1997వ సంవత్సరంలో అంతరిక్షంలో అడుగుపెట్టిన ఖ్యాతిని సొంతం చేసుకుని, ప్రపంచ రికార్డులకెక్కారు.
23. కర్ణం మల్లీశ్వరి : 2000 సంవత్సరంలో భారతదేశం తరఫున సిడ్నీ వేసవిలో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ ఒలంపిక్స్ లో కాంస్య పతకం పొందిన తొలి భారతీయ మహిళగా రికార్డును సృష్టించింది. అంతేకాదు.. ఈమె ఆయా ఛాంపియన్ గేమ్స్ లలో కూడా కొన్ని పతకాలను సొంతం చేసుకుంది.
24. లక్ష్మీ సెహగల్... 2002వ సంవత్సంలో రాష్ట్రపతి పదవికి పోటీ పడిన వారిలో తొలి మహిళగా వార్తల్లోకెక్కారు. విదేశీ వస్తు బహిష్కరణ, మద్యనిషేధం వంటి జాతీయ పోరాటాలలో కూడా తనవంతు సహాయాలను అందించడంలో కృషిచేశారు. సుభాష్ చంద్రబోస్ ప్రసంగాలకు ప్రభావితులైన ఈమె స్వాతంత్ర్యోద్యమంలో ‘‘ఆజాద్ హింద్ ఫౌజ్’’ మహిళా దళాల్లో చేరి, కెప్టెన్ గా హోదాను సంపాదించుకున్నారు.
25. పునీతా అరోరా... ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్ గా 2004వ సంవత్సరంలో ఎంపికయిన తొలి భారతీయ మహిళగా ఖ్యాతికెక్కారు. ఒక మహిళా ఈ స్థాయికి చేరుకోవడంలో ఈమె ముఖ్యం.
26. ప్రతిభా పాటిల్... భారతదేశ తొలి మహిళా రాష్ట్రపతిగా ఎన్నికయి చరిత్రను సృష్టించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఈమె 1962 నుంచి 1985 వరకు జల్ గావ్ జిల్లాలోని ఏద్లాబాద్ నియోజకవర్గం నుంచి మహారాష్ట్ర శాసన సభ్యురాలిగా పనిచేసింది. తరువాత డిప్యూటీ ఛైర్మన్ గా, ఆ తరువాత అమరావతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయి పార్లమెంట్ సభ్యురాలిగా పనిచేసింది. రాష్ట్రపతిగా ఎన్నికయ్యే ముందు రాజస్థాన్ రాష్ట్రానికి తొలి మహిళ గవర్నర్ గా పనిచేసింది.
27. మీరా కుమార్... లోక్ సభ స్పీకర్ కు 2009లో ఎంపికైన తొలి భారతీయ మహిళగా మీరా కుమార్ మంచి గుర్తింపును పొందారు.
ఇలా ఈ విధంగా మన భారతదేశంలో మహిళలు అన్ని రంగాలలోనూ తమ సత్తాను చాటుకుంటూ.. ఇతర మహిళలకు నిదర్శనగా నిలుస్తున్నారు. భారతదేశ ఉన్నతికి పాటు పడుతున్నారు. అప్పటివరకు సరైన ఉన్నతి లేని మన భారతదేశానికి.. మహిళలు కూడా దాని తోడ్పాటుకు పాటుపడుతూ.. ప్రపంచంపటంలోనే చరిత్రను తిరగరాస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more