Telugu famous singer p susheela biography

p susheela, p susheela biography, p susheela life story, p susheela story, p susheela songs, p susheela wiki, p susheela life history, p susheela awards, p susheela movie career, telugu singers, telugu women singers, tollywood singers

telugu famous singer p susheela biography who sings over 50 thousands songs in her 50 years film career

మధురకంఠంతో మైమరిపించిన తెలుగు గాయకురాలు

Posted: 09/24/2014 01:46 PM IST
Telugu famous singer p susheela biography

పాటల పూతోటలో పూచిన పుష్పాల్లో పి.సుశీల ఒకరు. తన గానంతో సినిమాకు ప్రాణం పోసిన గొప్ప గాయని. ఇప్పటివరకు యాబైవేలకు పైగా పాటలు పాడినా.., గొంతులో అదే మాధుర్యం.. వినసొంపైన స్వరం సుశీల సొంతం. భాష ఏదయినా సరే.. అద్భుత కంఠస్వరానికి స్పష్టమైన ఉచ్ఛారణకి సుశీల పెట్టింది పేరు. అంత అద్భుతమైన తన స్వరంతో ప్రేక్షకులను మైమరిపించేవారు. గాయనిగా 50 సంవత్సరాల సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్న సుశీల.. తెలుగు, తమిళం,  తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, బడగ, సింహళ వంటి రకరకాల భాషలలో తన అందమైన స్వరాన్ని వినిపించారు.

జీవిత చరిత్ర :

1935వ సంవత్సరంలో విజయనగరంలో వున్న సంగీతాభిమానుల కుటుంబంలో సుశీల జన్మించారు. ఈమె తండ్రి పి.ముకుందరావు.. ప్రముఖ క్రిమినల్ లాయర్. తల్లి శేషావతారం. 1950లో సంగీత దర్శకుడు నాగేశ్వరరావు నిర్వహించిన ఆలిండియా రేడియో పోటీలలో ఆయన సుశీలను ఎన్నుకున్నారు. ఆ తర్వాత ఆమె ఏ.ఎమ్.రాజాతో కలిసి పెట్రతాయ్ (తెలుగులో కన్నతల్లి) అనే సినిమాలో ‘‘ఎదుకు అలత్తాయ్’’ అనే పాటను మొదటిసారిగా పాడారు. ఇక అప్పటినుంచి గాయనిగా తన కెరీర్ ని మొదలుపెట్టిన ఆమె.. ఇప్పటివరకు తన గళంతో ప్రేక్షకులను మైమరిపిస్తూనే వుంది. నేటితరంలో ఎందరో యువగాయకులు వచ్చినప్పటికీ.. ఈమె మధురస్వరాన్ని ఎవ్వరూ అందుకోలేరు.

ఈమె ఐదు జాతీయ పురస్కారాలతోపాటు పలు ప్రాంతీయ పురస్కరాలు కూడా అందుకున్నారు. ఉత్తమ గానియగా అందుకున్న ఐదు జాతీయ పురస్కారాల వివరాలు... 1969 - ఉయిర్ మనిదన్, 1972 - సావలే సమాలి, 1978 - సిరిసిరి మువ్వ, 1983 -మేఘ సందేశం మరియు 1984- ఎం.ఎల్.ఏ.ఏడుకొండలు. ఇక భారత ప్రభుత్వం 2008 జనవరి 25న భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారంతో గానకోకిలగా సుశీలను పురస్కరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : p susheela  telugu women singers  tollywood singers  p susheela biography  

Other Articles