మహిళలపై అరుచరాకలు, అన్యాయాలు జరుగుతున్న సమయంలో వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఇతర మహిళలకు ఆదర్శంగా నిలిచిన ఎందరో ప్రతిభావంతులు మన భారతదేశంలో జన్మించారు. వారిలో అసీమా ఛటర్జీ కూడా ఒకరు. ఇతర మహిళల్లాగా భయపడకుండా తన కలల్ని సాకారం చేసుకుంటూ, ఇతర మహిళలను తన బాటలో నడిపించేలా ఉత్సాహాన్ని పెంపొందించింది. కోల్ కతాలో జన్మించిన ఈమె.. ప్రముఖ భారతీయ రసాయన శాస్త్రవేత్త. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫైటోమెడిసిన్ రంగాలలో అమూల్యమైన కృషి చేశారు. ఈమె నిర్వహించిన పరిశోధనల్లో వింకా ఆల్కలాయిడ్లు, మలేరియా, ఎపిలెప్సీ వంటి వ్యాధులకు చెందిన మందులు ముఖ్యమైనవి. భారతదేశానికి చెందిన వైద్యసంబంధమైన మొక్కలు గురించి ఒక పుస్తకాన్ని రచించారు.
జీవిత విశేషాలు :
ఈమె 1917 సెప్టెంబర్ 23వ తేదీన బెంగాల్ లోని కోల్ కతాలో జన్మించారు. తండ్రి పేరు ఇంద్రనారాయణ ముఖర్జీ! పుట్టినప్పటినుంచి జీవితాంతం కలకత్తాలోనే గడిపిన ఈమె... ప్రాథమిక విద్యాభ్యాసం అనంతరం కలకత్తా విశ్వవిద్యాలయానికి చెందిన స్కాటిష్ చర్చి కళాశాల నుండి 1936లో రసాయనశాస్త్రంలో పట్టా పొందారు. అలాగే 1938లో ‘‘ఆర్గానిక్ కెమిస్ట్రీ’’లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఈమె సంస్లేషిత కర్బన రసాయన శాస్త్రం లో వృక్ష ఉత్పత్తుల గురించి పరిశోధనలు చేశారు. 1940లో కలకత్తా యూనివర్సిటీ ‘‘లేడీ బ్రబోర్నె కాలేజి’’లో చేరి రసాయన శాస్త్ర విభాగానికి అధిపతిగా ఉన్నారు.
1944లో ఇండియా విశ్వవిద్యాలయంలో శాస్త్రీయ విజ్ఞానంలో డాక్టరేట్ పొందిన మొదటి మహిళగా నిలిచారు. 1944లో కలకత్తా యూనివర్సిటీ నుండి డి.ఎస్.సి. పట్టా పొందిన అనంతరం అక్కడినుంచి నేరుగా అమెరికాకు వెళ్ళి యూనివర్సిటీ ఆఫ్ విస్కన్సిస్ లో పరిశోధనలు (1947-48) నిర్వహించారు. 1954లో ఆసిమా చటర్జీ కలకత్తా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా కెమిస్ట్రీ విభాగంలో చేరారు. 1962 లో కలకత్తా విశ్వవిద్యాలయంలో గౌరవ ప్రొఫెసర్ గా పనిచేయుచున్నారు. ఈమె 1982 నుండి ఆ పదవిలోనే కొనసాగుతున్నారు. ఈమె ఎన్నో రసాయన సంస్థల్లో పరిశోధనలు నిర్వహించారు.
అంతేకాదు.. ఈమె నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఆఫ్ ఇండియా, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ మొదలైన సంస్థలలో పరిశోధనలు నిర్వహించారు. కలకత్తా యూనివర్సిటీ లో కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా , ప్యూర్ మెమిస్ట్రీ ప్రొఫెసర్ గా పలు పదవులు నిర్వహించారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ కు అధ్యక్షురాలిగా (1975) ఉన్నారు. ప్రొఫెసర్ ఆసిమా గారు భారతీయ ఔషథ మొక్కల నుంచి ఆల్కలాయిడ్స్, పాలీ ఫినోలిక్స్, టెర్పెనోయిడ్స్, కౌమరిన్స్ మొదలైన సహజ ఉత్పత్తులను పరిశోధించడంలో విశేష కృషి చేశారు.
240 కి పైగా పరిశోధనా పత్రాలను వెలువరించిన ఈమె.. ‘‘జర్న్ ఆఫ్ ది ఇండియన్ కెమికల్ సొసైటీ’’కి సంపాదకులుగా ఉన్నారు. అమెరికా లోని సిగ్మా XI సంస్థకు గౌరవ సలహాదారుగా ఉన్నారు. కొన్నాళ్లపాటు రాజ్యసభ సభ్యురాలుగా (1982 - 90) ఉన్నారు. ఈ విధంగా విధులను నిర్వహించిన ఈమెకు.. భారత ప్రభుత్వం ఎన్నో పురస్కారాలను అందజేసింది. అందులో ముఖ్యంగా.. పద్మభూషణ్ అందుకున్న మొట్టమొదటి మహిళా శాస్త్రవేత్త ఈమె! పరిశోధనాకాలంలో గోల్డ్ మెడల్ ను కూడా సాధించింది. ఈమె కేవలం జాతీయంగానే కాదు... అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలను సాధించిన భారతీయ మహిళగా ఖ్యాతికెక్కారు. అయితే అనారోగ్యానికి గురైన ఈమె నవంబర్ 22, 2006 సంవత్సరంలో మరణించారు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more