తెలుగు రాష్ట్రాల్లో ఎందరో ప్రసిద్ధ రచయితలు వున్నారు. అందులో కొంతమంది నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా రాసిన నవలలు సంచలనం సృష్టించినవి ఎన్నో వున్నాయి. ఇతరుల మనోభావాలు దెబ్బతగలకుండా ఆయా నవలలు రచించినప్పటికీ.. వాటివల్ల సమస్యలు వస్తాయన్న నెపంతో ఆనాడు ప్రభుత్వం కొన్ని నవలలను నిషేధించడం జరిగింది. అందులో తెలుగు ప్రసిద్ధ నవలా-కథ రచయిత్రి ‘‘నక్సలిజం’’ గురించి రాసిన ‘‘మరీచిక’’ నవల ఒకటి! అప్పట్లో ఈ నవల మీద ఎన్నో చర్చలు జరిగాయి. అయితే చివరగా ఇతర సాహిత్యకారుల అభిప్రాయాలపై దానిని తిరిగి మళ్లీ ప్రచురించడం జరిగింది.
సీతాదేవి జీవిత చరిత్ర :
1933 డిసెంబర్ 15వ తేదీన గుంటూరు జిల్లాలోని చేబ్రోలులో నివాసమున్న వాసిరెడ్డి రాఘవయ్య, రంగనాయకమ్మ దంపతులకు వాసిరెడ్డి సీతాదేవి జన్మించారు. ఈమె చిన్నవయస్సులో వున్నప్పుడే కుటుంబం మొత్తం చెన్నైకు చేరుకున్నారు. ఈమె చదువుకున్నది కేవలం 5వ తరగతివరకే అయినా... ప్రైవేట్ గా హిందీ ప్రచారక్, ప్రవీణ, సాహిత్య రత్నలో ఉత్తీర్ణులయ్యారు. తర్వాత నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి బి.ఎ., ఎమ్.ఎ. పూర్తిచేశారు. నవలలు, కథలు రాయాలనే ఆసక్తి ఈమెకు చిన్నతనం నుండే వుండేది. ఆ ఆసక్తితోనే ఈమె ఎన్నో నవలలు, కథలను రాశారు. ప్రసిద్ధ రచయిత్రిగా పేరు సాధించిన ఈమెకు ‘‘ఆంధ్రపెర్ల్‌బక్’’ బిరుదు లభించింది.
ఈమె రచించిన మొదటి నవల ‘‘జీవితం అంటే’’ (1950)... తొలి కథ ‘‘సాంబయ్య పెళ్ళి’’ (1952). ఇక అప్పటినుంచి తన కలానికి పనిపెట్టిన ఆమె.. ఎన్నీ సమస్యలు వచ్చినా వెనుదిరిగి చూడలేదు. సుమారు 39 పైగా నవలలు మరియు 100 పైగా కథలు రచించారు. ఇందులో కొన్ని ప్రసిద్ధి చెందగా.. మరికొన్ని సంచలన సృష్టించాయి. అందులో ‘‘మరీచిక’’ నవల ఒకటి! 1982వ సంవత్సరంలో ‘‘నక్సలిజం’’ గురించి రచించిన ‘‘మరీచిక’’ నవలను రాష్ట్రప్రభుత్వం నిషేధించింది. కొన్నాళ్లపాటు ఈ నవలపై తీవ్ర చర్చలు కూడా జరిగాయి. అయితే తర్వాత ఆరుద్ర వంటి సాహిత్యకారుల అభిప్రాయాలపై హైకోర్టు కేసు కొట్టివేసి నిషేధాన్ని తొలగించింది.
ఇక ప్రసిద్ధ చెందిన నవవలో ‘‘మట్టి మనిషి’’ (2000)గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. ఈ నవల ఏకంగా 14 భాషలలోకి అనువదించబడింది. అలాగే ఈమ నవలల్లో బాగా ప్రాచుర్యం పొందినవి కొన్ని తెలుగు సినిమాలుగా మరికొన్ని దూరదర్శన్ సీరియల్లుగాను నిర్మించబడ్డాయి. ‘‘సమత’’ నవల ఆధారంగా ‘‘ప్రజా నాయకుడు’’, ‘‘ప్రతీకారం’’ నవలను ‘‘మనస్సాక్షి’’ సినిమాగా, మానినీ మనసును ఆమె కథ సినిమాలుగా వచ్చాయి. ‘‘మృగతృష్ణ’’ నవలను అదే పేరుతో సినిమాగా నిర్మించారు.
ఈమె కేవలం రచయితలు రాయడం మాత్రమే కాదు.. జవహర్ బాలభవన్ డైరెక్టర్ గా పనిచేశారు. 1985 - 1991 మధ్యకాలంలో ఫిల్మ్ సెన్సార్ బోర్డు సబ్యురాలిగా సేవలందించారు.
అవార్డులు
1. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం - ఐదు సార్లు
2. ఆత్మగౌరవ పురస్కారం
3. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం - గౌరవ డి.లిట్. (1989).
4. శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం - గౌరవ డి.లిట్. (1989)
5. తెలుగు విశ్వవిద్యాలయం - జీవితకాల సాఫల్య పురస్కారం (1996)
AS
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more