ప్రపంచపటంలో దేశాన్ని ఒక ఉన్నత స్థానంలో చూడాలన్న కోరిక సగటు భారతదేశవాసికి వుంటుంది. అయితే కేవలం కొంతమంది మాత్రమే దేశఉన్నతి కోసం నిత్యం పాటుపడుతుంటారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను వ్యతిరేకంగా పోరాటాలు జరుపుతూ మార్పులు తేవడంలో తమ జీవితాన్ని అంకితమిస్తుంటారు. ఒక్కొక్కరి ఆలోచన విధానంమేరకు ఒక్కొక్క మార్గంపై అడుగులు వేస్తారు. ఒకరు మహిళల స్వేచ్ఛకోసం గొంతువిప్పితే.. మరొకరు బాలల హక్కుల కోసం ప్రభుత్వాన్ని ఎదురిస్తుంటారు.
కొందరు లంచానికి వ్యతిరేకంగా తమ గళం విప్పితే.. సమాజంలో తప్పుడు విధానాలను అనుసరిస్తున్న అధికారులనే సవాల్ విసురుతూ ధైర్యంగా నిలబడతారు. ఇలా చెప్పుకుంటే ఇప్పటికే ఎంతోమంది దేశాభివృద్ధికోసం తమవంతు సేవలందించి, నలుగురికి ఆదర్శంగా నిలిచినవాళ్లు వున్నారు. అటువంటివారిలో శాంతా సిన్హా ఒకరు. ఈమె బాలల కార్మికులపై విశేష కృషి చేసి, రామన్ మెగస్సే అవార్డును అందుకున్నారు. అంతేకాదు.. ఈమె సామాజిక సేవకురాలు, సంఘసంస్కర్త కూడా!
జీవిత చరిత్ర :
1950 జనవరి 7వ తేదీన విద్యావంతులైన బ్రాహ్మణ కుటుంబంలో శాంతాసిన్హా జన్మించారు. ఈమె తండ్రి మామిడిపూడి వెంకటరంగయ్య. ఈయన గొప్ప విద్యావేత్త, సమాజవాది, చరిత్ర ఆచార్యుడు. మద్రాసు విశ్వవిద్యాలయంలో వినూత్న విద్యావిధానానికి కృషిచేసిన సంస్కర్త. ఇక ఆమె సోదరుడు నాగార్జున ఐఏఎస్ అధికారిగా పదవిలో వుండగా.. 47వ ఏటలో మృతి చెందారు. ఆమె కుటుంబసభ్యులందరూ పెద్ద చదువులు చదివినవాళ్లే! అలాంటి కుటుంబం నుంచి వచ్చిన ఈమె.. నేడు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్‌కు చైర్ పర్సన్’గా కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఈమె.. బాల్యంలో సికింద్రాబాద్ సెయింట్ ఆన్స్ హైస్కూలులోనూ, కీస్ హైస్కూల్లోనూ విద్యాభ్యాసం చేశారు. 1972 సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రంలో పీజీ చేసారు. 1976లో ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా చేరారు. 1981 సంవత్సరంలో ఆమె తన తండ్రి పేరు మీదుగా ఎంవీ ఫౌండేషన్ (మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్) స్థాపించారు. మొదట్లో సామాజిక మార్పుకోసం, పేదలకు విద్యనందించే దృక్ఫథంతో ఆరంభించిన ఈ ఫౌండేషన్ 1991 తర్వాత బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం వీధిబాలలకు విద్యాబుద్ధులు చెప్పించింది.
ఇలా తాను స్థాపించిన ఫౌండేషన్ ద్వారా బాలల కార్మిలకులపై విశేష కృషి చేసిన ఈమెకు.. 2003లో ప్రభుత్వం రామన్ మెగసేసే అవార్డు అందించింది. అంతేకాదు.. 1999లోనే ఈమె పద్మశ్రీ అవార్డును గ్రహించింది. ఆ తర్వాత అంతర్జాతీయ విద్యాసంస్థ ఆల్బర్ట్ శంకర్ పురస్కరాన్ని అందుకున్నారు. ప్రస్తుతమున్న పరిణామాలకు అనుగుణంగా పిల్లలకు పనులకు కాకుండా బడికి పంపించి భావిభారత పౌరులుగా మార్చాలంటూ ఈమె అందించిన సందేశం దేశవ్యాప్తంగా ఎంతోమందిని మేల్కొలిపేలా చేసింది. ఈమె అందించిన సేవలకు చలించిన కొంతమంది ప్రజలు.. ఈమె బాటలోనే నడవడం మొదలుపెట్టారు. తమవంతు కృషి అందించడంలో సహాయ కార్యక్రమాలను మొదలుపెట్టారు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more