నిజాం పరిపాలనాకాలంలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు ఎందరో వీరులు, వనితలు ముందుకు వచ్చారు. అధికారబలం వుండటంతో తమకు ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తూ.. ఇతర రాజ్యాల ప్రజలపై ఎన్నో ఆకృత్యాలకు పాల్పడుతున్న నిజాంవారిని ఎంతో ధైర్యంగా ఎదుర్కునేందుకు కేవలం కొంతమంది మాత్రమే తమ ధైర్యాన్ని ప్రదర్శించారు. అటువంటివారిలో మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ కూడా ఒకరు!
జీవిత చరిత్ర :
ఆదిలక్ష్మిదేవమ్మ మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల సంస్థానాన్ని పాలించిన మహారాణి. రాజా చిన సీతారామభూపాలుని భార్య అయిన ఈమె.. ఆయన పాలనానంతరం ఈమె రాజ్యాధికారాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. 1946 నుంచి 1949 వరకు పాలించిన ఈ రాణి.. ఆ సంస్థానానికి చివరి పాలకులు! ఈమె తర్వాత మళ్లీ ఇంకెవరూ ఆ రాజ్యాన్ని పాలించలేదు. ఈమె తన పరిపాలనాకాలంలో గద్వాల సంస్థానాన్ని స్వతంత్ర్య సంస్థానంగా ప్రకటించింది పాలించింది.
సీతారామభూపాలునికి సంతానం లేకపోవడం వల్ల ఆ రాజు తర్వాత అతని గద్వాల్ సంస్థానాన్ని పాలించేవారు ఎవరూ వుండరని భావించిన నిజాం నవాజు మిర్ ఉస్మాన్ అలీఖాన్.. దానిని తమ రాజ్యంలో కలుపుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న రాణి.. న్యాయపోరాటం చేసి తన సంస్థానాన్ని తిరిగి చేజిక్కించుకుంది. ఎన్ని ఇబ్బందులు వున్నప్పటికీ తన సంస్థానాన్ని కోల్పోకూడదన్న థృక్పధంలో ముందుకు సాగిన ఈమె.. ఆ నిజాం నవాబును ఓడించి వీరవనితగా నిలిచింది.
అలా తన సంస్థానాన్ని చేజిక్కించుకున్న అనంతరం ఆమె సంప్రదాయంగా వస్తున్న సాహిత్య పోషణను కొనసాగిస్తూ వచ్చింది. ఆనాడు ఎందరో కవులను ఆదరించడంతోపాటు తోమంది కవుల పుస్తకాలను ముద్రింపజేసింది. తన రాజ్యంలో ఏ లోటూ లేకుండా చూసుకోగలిగింది. అయితే 1949 లో సంస్థానాల, జాగీర్ధారుల పాలనలు రద్దు కావటంతో రాణి సంస్థానపు ఆస్తులను, చారిత్రాత్మక గద్వాల కోటను ప్రభుత్వ పరం చేశారు. ఏదైతేనేం.. వీరవనితగా పేరుపొంది సాటిమహిళలకు ఆదర్శంగా నిలిచింది.
1663లో రాజా పెద సోమభూపాలుడి పాలనతో ప్రారంభమైన గద్వాల సంస్థానపు పాలన.. 1949లో మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ పాలనతో ముగిసింది. ఈమె 18.08.1953లో పరమపదించారు. ఆమె చేసిన మంచి కార్యక్రమాలకు ప్రతిరూపంగా ఆమె పేరు మీదుగా గద్వాల కోటలో మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశారు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more