సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలంటే ఏదో ఒక మార్గాన్ని అనుసరించాల్సి వుంటుంది. కొందరు ఉద్యమాలు జరిపి లీడర్ గా నిలబడితే.. మరికొందరు న్యాయపరమైన విధానాలను అనుసరించి అవినీతిపై పోరాటం కొనసాగిస్తారు. అలా రెండో విధానాన్ని అనుసరిస్తూ ముందుకు నడుస్తున్న వారిలో టీ.మీనాకుమారి ఒకరు. ‘లాయర్’ కుటుంబంలో జన్మించిన ఆమె.. సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై పోరాటం కొనసాగించేందుకు వారసత్వ వృత్తినే ఎంచుకున్నారు. ఆ రంగంలో తన సత్తా చాటుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ.. నూతనంగా ఏర్పడిన మేఘాలయ రాష్టానికి తొలి ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నుకోబడ్డారు.
జీవిత విశేషాలు :
1956 ఆగష్టు 3 తేదీన విశాఖపట్నం జిల్లాలోని యలమంచిలిలో జానపరెడ్డి, రాజమణి దంపతులకు మీనాకుమారి జన్మించారు. ఈమె ప్రముఖ వాయులీన విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడి మనుమరాలు. ఈమె బి.యస్.సి. పూర్తిచేసిన తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రం అభ్యసించి, 1976 నుండి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా వృత్తిజీవితాన్ని ప్రారంభించారు. 1981 నుంచి 1984 వరకు అసిస్టెంట్ ప్రభుత్వ ప్లీడరుగా, 1988-89 మధ్యకాలంలో ఆదాయపన్నుల శాఖ జూనియర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు.
1990లో హైకోర్టు ప్రభుత్వ ప్లీడరుగా మీనాకుమారి నియమితులయ్యారు. 1994 వరకు ఆమె ఆ పదవిలో ఉన్నారు. విద్య, పౌరసరఫరాలు, కాలుష్య నియంత్రణ, విద్యుత్ వంటి విభాగాలకు ఇన్ఛార్జిగా వ్యవహరించారు. 1998 ఫిబ్రవరి 23 తేదీ నుండి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం మద్రాసు హైకోర్టుకు బదిలీపై వెళ్ళారు. 1999లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2001 సెప్టెంబర్ 5 తేదీన ఆంధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. స్వల్పకాలం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. అనంతరం పాట్నా హైకోర్టుకు బదిలీ చేయబడ్డారు.
మీనాకుమారి 2013 మార్చి 23న కొత్తగా ఏర్పాటు చేయబడిన మేఘాలయా రాష్ట్ర హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డారు. 2013 మార్చి 24వ తేదీర మేఘాలయ చీఫ్ జస్టిస్ గా మీనాకుమారి ప్రమాణం చేశారు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more