కుటుంబ గౌరవాన్ని నిలబెట్టే స్త్రీలకు సమాజంలో ఏమాత్రం గౌరవం లభించడం లేదు. చీకటిలో మునిగిన జీవితాల్లో వెలుగులా భరోసా కల్పించే స్త్రీల స్వేచ్ఛను ‘ఇల్లాలి’ అనే బానిస సంకెళ్లతో సమాజం హరిస్తోంది. ముఖ్యంగా 20వ శతాబ్దంలో అయితే మహిళల పరిస్థితి మరీ దారుణంగా వుండేది. అలాంటి సమయంలో కొందరు మహిళలు తమ స్వేచ్ఛాహక్కును పొందడం కోసం సమాజానికి వ్యతిరేకంగా గొంతెత్తారు. పురుషులతోపాటు తమకూ సమాన హక్కులు కల్పించాలంటూ ఉద్యమ పోరాటం కొనసాగించారు. అటువంటి వారిలో ‘మల్లాది సుబ్బమ్మ’ ఒకరు. ‘కేవలం పిల్లల్ని కంటూ, ఇంటి పనులు చేసుకొంటూ, అత్తమామల అదుపాజ్ఞలలో జీ వించడమే మహిళల కర్తవ్యమా?’ అని ప్రశ్నించిన ప్రముఖ స్త్రీవాద రచయిత్రి.
జీవిత చరిత్ర :
1924 ఆగస్టు 2వ తేదీన గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పోతార్లంకలో సుబ్బమ్మ జన్మించారు. ఈమెకి చిన్న వయస్సులోనే బాపట్ల వాస్తవ్యులైన మల్లాది వెంకట రామమూర్తితో వివాహం జరిగింది. అయితే.. జీవితంలో ఏదో సాధించాలనే పట్టుదలతో ఆమె భర్త సహకారంతో ఉన్నత విద్యనభ్యసించారు. మెట్రిక్కి, పి.యు.సి., బి.ఎ., ఇలా వరుసగా చదివి, కుటుంబ నియంత్రణ ప్రచారకురాలిగా కొన్నేళ్లు ఉద్యోగం చేశారు. బాపట్లలో అయిదేళ్లు స్త్రీ హితైషిణీ మండలి కార్యదర్శిగా, బాలికా పాఠశాలకు మేనేజరుగా, శారదా మహిళా విజ్ఞాన సమితికి అధ్యక్షురాలిగా పనిచేస్తూ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో దిగారు.
1970లో విజయవాడలో వికాసం అనే పత్రిక స్థాపించి పదేళ్లు నడిపారు. 1980లో మహిళాభ్యుదయం అనే సంస్థను స్థాపించారు. అభ్యుదయ వివాహ వేదిక ద్వారా అతి తక్కువ ఖర్చుతో ఆదర్శ వివాహాలు జరిపించారు. కుల నిర్మూలన, ఛాందస వ్యతిరేక పోరాటం, మూఢవిశ్వాస నిర్మూలన, స్త్రీ జనోద్ధరణ, కుటుంబ నియంత్రణ, స్త్రీ విద్యకోసం కృషి చేశారు. మహిళాభ్యుదయ గ్రంథాలయం, కుటుంబ సలహా కేంద్రం, స్త్రీ విమోచన శిక్షణ కేంద్రం, వరకట్న హింసల దర్యాప్తు సంఘం, స్త్రీల హక్కుల పరిరక్షణ కేంద్రం, శ్రామిక మహిళాసేవ, సుబ్బమ్మ షెల్టర్, మల్లాది సుబ్బమ్మ ట్రస్టు ద్వారా మహిళలకు సేవ చేశారు. ‘వికాసం’, ‘స్త్రీ స్వేచ్ఛ’ అనే మాస పత్రికకు సంపాదకురాలిగా ఉన్నారు. 1979 నుంచీ ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘానికీ, 1989 నుంచీ అఖిలభారత హేతువాద సంఘానికీ ఉపాధ్యక్షులుగా ఉన్నారు.
ఈమె మహిళా జీవన విధానంపై ఎన్నో రచనలు చేశారు. బాల్యం, దాంపత్య జీవితం, మహిళలపై జరిగే అన్యాయాలు.. ఇంకా ఎన్నో రచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో మహిళోద్యమం - మహిళా సంఘాలు 1960-1993 అనే పుస్తకం.. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ గ్రంథం అవార్డు పొందింది. సంఘసేవకు గాను ఎమ్.ఎ.థావుస్ నేషనల్ హ్యూమన్ రైట్స్ అవార్డుపొందారు. ఈమె 2014 మే 15న మరణించారు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more