పాకాల యశోదారెడ్డి.. దేశంలో ప్రసిద్ధిచెందిన రచయిత్రిలలో పేరుగాంచిన మహిళ. ఓ సాధారణ కుటుంబంలో జన్మించిన ఈమె.. ఎన్నో ఉన్నతచదువులు చదివి తన సత్తాను చాటుకుంది. ఇతర మహిళలకు ఆదర్శంగా నిలిచింది. తన విద్యాప్రతిభను ఆమె కథాసంపుటల ద్వారా వెలువరించి, అందరికీ జ్ఞానోదయాన్ని కలిగించింది. తెలుగు ప్రాచీన సాహిత్యంపై ఆమె చేసిన ప్రసంగాలు పండితుల మన్ననలు పొందాయి. తెలంగాణ సజీవ భాషను ఆమె తన రచనల్లో వాడి పలువురి మన్ననలు పొందింది. అంతేకాదు.. ఆకాశవాణిలో తెలంగాణ మాండలికంలో ప్రసంగం చేసిన తొలి రచయితగా ఆమె పేరొందింది.
జీవిత విశేషాలు :
1929 ఆగస్టు 8వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా, బిజినేపల్లిలో సరస్వతమ్మ, కాశిరెడ్డి దంపతులకు యశోదారెడ్డి జన్మించారు. మహబూబ్ నగర్ లో మూడవ తరగతి వరకు చదివిన ఈమె.. ఆ తర్వాత ఉన్నత పాఠశాల విద్యను హైదరాబాద్ లో పూర్తి చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు, సంస్కృత భాషలలో పోస్ట్గ్రాడ్యుయేషన్ను పూర్తి చేసింది. అలాగే జర్మన్ భాషలో, భాష శాస్త్రంలో డిప్లొమా చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే తెలుగులో ‘హరివంశాలు’ అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టాను పొందింది. 1976లో అలీఘర్ విశ్వవిద్యాలయం నుండి డి.లిట్ అందుకుంది.
1955లో హైదరాబాద్, కోఠి మహిళా కళాశాలలో అధ్యాపకురాలిగా ఉద్యోగ జీవితం ప్రాంభించింది. తరువాత రీడర్గా, ప్రొఫెసర్గా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేసి, 1989లో పదవీ విరమణ చేసింది.ఈమెకు హిందీ, ఉర్దూ, కన్నడ భాషల్లో ప్రావీణ్యంతోపాటు, జర్మన్ భాషతో కూడా పరిచయముంది. ఆమె ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షురాలుగా కూడా పనిచేసింది.
రచయిత్రిగా :
యశోదారెడ్డి వందకు పైగా కథలు వ్రాశారు. ఈమె ప్రచురించిన మూడు కథాసంపుటాల్లో ‘మావూరి ముచ్చట్లు’ (1973) 1920-40 నాటి తెలంగాణ గ్రామీణ జీవన విధానాన్ని చిత్రీకరిస్తే, ‘ఎచ్చమ్మ కథలు’ (1999) 1950-70 నాటి తెలంగాణ సంస్కృతికి ప్రతీకలు, ‘ధర్మశాల’ (2000) 1980-1990 నాటికి తెలంగాణ సమాజంలో వచ్చిన మార్పులకు దర్పణం పట్టింది. ఈ మూడు కథా సంపుటాల్లో ఈమె తెలంగాణ భాషను, యాసను, సంస్కృతిని, సామాజిక జీవితాన్నిఅక్షర బద్ధం చేసింది. ఈమె కథలు తెలంగాణ జనజీవన సంస్కృతినా, తెలంగాణా మాండలిక నుడికారానికి అద్దం పడుతున్నవి.
కవియిత్రిగా :
యశోదారెడ్డి కథారచయిత్రిగానే కాదు.. కవయిత్రిగానూ ప్రసిద్డు చెందారు. ఆమె రాసిన కవితలు అనేక పత్రికలలో ముద్రించబడ్డాయి. మలేషియాలో జరిగిన తెలుగు సమ్మేళనంలో కవయిత్రిగా పాల్గొని, ప్రశంసలు అందుకుంది. ఈమె 2007 అక్టోబర్ 7న హైదరాబాదులో మరణించింది.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more