భారతీయ చిత్రపరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు గడించిన వారిలో నటి యోగీతా బాలీ ఒకరు. హిందీ చలనచిత్ర నటీమణి అయిన ఈమె.. తన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదుగుతూ అత్యున్నత స్థానానికి చేరుకుంది. తన అందం, హావభావాలతో ఎందరో అభిమానుల్ని సాధించింది. ఎన్నో చిత్రాల్లో నటించి బాలీవుడ్ తెరపై సరికొత్త రంగులు పూయించింది. ఆనాడు ఈమె ఇమేజ్ ఎంతమేర వుండేదంటే.. ఈమె లేని సినిమా థియేటర్లలో అంతగా ప్రదర్శింపబడేది కాదు. కాస్త ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ ఈమెను తమ సినిమాల్లో నటింపజేసేవారు దర్శకనిర్మాతలు.
జీవిత విశేషాలు :
1952 ఆగస్టు 13వ తేదీన ముంబాయి నగరంలో జన్మించింది. ఈమె బాలీవుడ్ నటి గీతా బాలీ మేనకోడలు కావడంతో ఆ వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఈమెకు తనను తాను నటిగా నిరూపించుకోవడానికి తొలినాళ్లలో కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది కానీ.. ఆ తర్వాత తన నటనా ప్రతిభతో దూసుకుపోయింది. బాలనటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె 1960ల చివరలో, 1970లలో అనేక చిత్రాలలో నటించారు.
ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతున్న సమయంలో ఈమెకి గాయకుడు/నటుడు అయిన కిషోర్ కుమార్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి, చివరికి పెళ్లిదాకా వెళ్లింది. వీరిద్దరూ కలిసి ‘శభాష్ డాడీ’ అనే చిత్రంలో నటించారు. అయితే.. వీరి మధ్య అప్పుడప్పుడు విభేదాలు ఏర్పడేవి. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య కాస్త దూరం పెరిగింది. ఈ క్రమంలోనే ఈమె నటుడు మిథున్ చక్రబర్తితో అతను నిర్మించిన చిత్రం ‘ఖ్వాబ్’(1980) నిర్మాణంలో ఈమె భాగం పంచుకుంది. ఆ సినిమా సెట్ లో వుండగానే ఈమె మిథున్ తో ప్రేమలో పడ్డారు. అతనితో వివాహం చేసుకోవటానికి కిషోర్ కుమార్‌కు విడాకులు ఇచ్చారు. దీంతో మిథున్, కిషోర్ మధ్య దూరం కూడా పెరిగింది. కిషోర్ తో విడాకులు తీసుకున్న తర్వాత యోగీతా గాయనీమణిగా తన గానవృత్తిని బప్పీలహిరితో ఆరంభించింది.
యోగీతా ఇండస్ట్రీలో ఇంకా నటిగా తన ప్రస్థానం కొనసాగించకముందే ఆమె కంప్యూటర్ ఇంజనీర్‌గా పనిచేశారు. ఆమె కలకత్తా విశ్వవిద్యాలయంలో B.S.తో పట్టభద్రులు అయ్యారు. అలాగే ఆమె M.Sc.ని కూడా పొందారు. బాలీ నటించిన కొన్ని ప్రముఖ చిత్రాలలో అమితాబ్ బచ్చన్‌తో నటించిన పర్వానా, నాగిన్, బీవి ఓ బీవి, జానీ దుష్మన్, మెహబూబా, జనతా హవల్దార్, ఖ్వాబ్, గ్రిహస్తి, లైలా, ఝీల్ కే ఉస్ పార్.. తదితర చిత్రాలు ఉన్నాయి.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more