తనిఖీలు చేసిన కొద్ది సెల్ ఫోన్లు, గంజాయి బయటపడుతూనే వున్నాయి. గత వారమే అధికారులు అర్థరాత్రి పూట తనిఖీలు నిర్వహించి భారీ సంఖ్యలో గంజాయిని, సెల్ ఫోన్లను పట్టకోగా, నాలుగు రోజులు తిరగకుండానే మరోమారు తనిఖీలు నిర్వహించగా, అదే స్థాయిలో గంజాయి, సెల్ ఫోన్లు పట్టుబడ్డాయి. దీంతో అదికారులు ఇది జైలా..? ఇంకేమన్నానా..? అంటూ చిరెత్తిపోతున్నారు. చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఆ శాఖ ఉన్నతాధికారుల ఇవాళ తెల్లవారుజామున అకస్మిక తనిఖీలు నిర్వహించారు.
జైలులోని కృష్ణ, బ్రహ్మపుత్ర బ్యారెక్లలో సోదాలు నిర్వహించారు. పలువురు ఖైదీల నుంచి భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఖైదీలకు అంతపెద్ద మొత్తంలో గంజాయి ఎలా చేరింది అని జైలు అధికారులను ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై వెంటనే విచారణ జరిపి నివేదిక అందించాలని ఆ శాఖ ఉన్నతాధికారులు సదరు అధికారులను ఆదేశించారు. ఇంత భారీ సంఖ్యలో ఖైదీల నుంచి గంజాయి లభ్యం కావడంలో జైలు అధికారులు, సిబ్బంది పాత్ర వుందన్న పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి.
కాగా నిన్న జైలు ప్రాంగణలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా జైలు ఆవరణలోని అగరబత్తి తయారీ కేంద్రం వెనక బాగంలో భూమిలోపల కవర్లలో దాచి ఉంచిన సెల్ ఫోన్లను కనుగోన్నారు. వాటిలో ఓ సెల్ ఫోన్లో సిమ్ కార్డు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు... ఆ ఫోన్కు సంబంధించిన కాల్ డేటాను గుర్తించే పనిలో నిమగ్నమైయున్నారు. రోజు వారిగా తనిఖీలు చేస్తేనే ఖైదీలతో పాటు జైలు సిబ్బంది, అధికారులు కూడా క్రమశిక్షణతో వ్యవహరిస్తారని ప్రజా సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more