అమెరికా ఫెడరల్ రిజర్వు సమావేశం నిర్ణయాలపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఫెడ్ రిజర్వు నిర్ణయాలపై స్వర్ణం ధరల కూడా నిర్ధేశించబడుతుంది. ఫెడ్ రిజర్వు వడ్డీ రేట్లు పెంచే నిర్ణయం తీసుకుంటే భారత్‌లో పది గ్రాముల బంగారం ధర 20,500 రూపాయలకు పడిపోయే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. ఇవాళ ముగియనున్న ఫెడ్ సమావేశం ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటుందోనన్ని ఆసక్తి సర్వత్రా నెలకోనగా, ఫెడ్ నిర్ణయాన్ని అనుసరించి బంగారం ధర తగ్గుతుందా..? లేక పెరుగుతుందా అన్న విషయమై క్లారీటీ వస్తుందని ఇండియా రేటింగ్స్ అభిప్రాయపడింది. ఫెడ్ నిర్ణయం మేరకు సమీప భవిష్యత్‌లో 20,500- 24,000 రూపాయల మధ్య కదలాడవచ్చని పేర్కొంది.
ప్రస్తుతానికి బంగారంపై నెగిటివ్ ఔట్‌లుక్‌ను కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. ఫెడ్ నిర్ణయాన్ని బట్టి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 900-1050 డాలర్ల మధ్య కొనసాగవచ్చని అంచనావేసింది. అంతర్జాతీయ వృద్ధిపై అనిశ్చితి తొలగేవరకు బంగారం ధరలు 2009 సంవత్సరానికి ముందరి స్థాయిలకు చేరే అవకాశాలు తక్కువని ఇండియా రేటింగ్స్ పేర్కొంది. ఆర్థిక అనిశ్చితి ఉన్న తరుణంలో బంగారం ధరలు పెరగడం, అనిశ్చితి తొలగే తరుణంలో బంగారం ధరలు తగ్గడం జరుగుతుంటాయని తెలిపింది.
యుఎస్ రియల్ వడ్డీరేట్లు, బంగారం ధరలు విలోమ సంబంధ కలిగి ఉంటాయని, అలాగే బంగారం, డాలర్ ఇండెక్స్ కూడా విలోమ సంబంధం కలిగి ఉంటాయని ఇండియా రేటింగ్స్ తన నివేదికలో తెలిపింది. ప్రపంచ బంగారం డిమాండ్‌లో దాదాపు సగం వాటా భారత్, చైనాలదేనని, ప్రస్తుతం ఈ రెండుదేశాలు 2011-12 కొనుగోలు స్థాయిలను మెయిన్‌టెయిన్ చేస్తున్నాయని తెలిపింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో చైనాలో బంగారం డిమాండ్ 8 శాతం క్షీణించగా, భారత్‌లో డిమాండ్ 15 శాతం పెరిగిందని తెలిపింది. అయితే నికరంగా చూస్తే ప్రస్తుతం భారత్‌లో డిమాండ్ ఆరేళ్ల కనిష్ఠ స్థాయిల వద్ద ఉందని తెలిపింది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more