subrata roy pays rs 1.23 crore for special facilities in tihar jail

Subrata roy leads comfort life in tihar jail

Tihar jail, Subrata Roy, Sahara group, Rs 1.23 crore, special facilities, Tihar Jail authorities, subrata roy special privileges, subrata roy sahara group, subrata roy tihar jail, subrata roy comfort life in jail,

Sahara Group chief Subrata Roy has paid a whopping Rs 1.23 crore to Tihar Jail authorities for all the special privileges he enjoyed for the past one year in a special cell.

జైలులో కూడా ఇంట్లో మాదిరిగానే రాజభోగాలు.. తప్పు తెలుసుకునేదెలా..?

Posted: 12/07/2015 09:53 AM IST
Subrata roy leads comfort life in tihar jail

కలికాలం వచ్చిన తరువాత ఏం చేస్తున్నావ్ అని అడగటం కన్నా ఎంత సంపాదిస్తున్నావ్ అని అగడం ఉత్తమం. అయితే ఎం చేసి సంపాదిస్తున్నావ్ అని కూడా అగడరాదు. ఎందుకంటారా.. బాగా డబ్బున్న మారాజులు ఎక్కడికి వెళ్లినా వారి గౌరవ మర్యాదలు అవే దక్కుతాయి. అదే డబ్బులేని నిరుపేదలు ఎక్కడికెళ్లినా కష్టపడాల్సిందే. చివరకు కలియుగ దైవం శ్రీవారి దగ్గరకు వెళ్లినా.. సంపన్నులకు ఆ టిక్కెట్టు, ఈ టిక్కెట్లు అంటూ గంటల్లో దర్శనం లభిస్తుండగా, పేదలు మాత్రం గంటలు, పలు సందర్భాల్లో రోజుల తరబడి క్యూ లో నిల్చుంటే కాని శ్రీవారు కనుకరించని వైనం. సాక్ష్యాత్ దైవమే సంపన్నులను ఒకలా, పేదలను మరోలా వేరుచేసి చూస్తుండగా  ఇక వీరు మాత్రం ఎందుకు చేయరు..?

వారెవరంటారా..? వారు తిహార్ జైలు అధికారులు. ఇప్పుడు వీళ్ల విషయం ఎందుకంటారా..? దేశ ప్రజలను మోసం చేసి ఒకటి రెండు కాదు సుమారు ఇరవై వేల కోట్ల రూపాయలను వసూలు చేసిన సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్.. జైల్లో పెట్టిన అధికారులు ఆయనకు రాజభోగాలు అందించారు. ఏడాదికిపైగా ప్రత్యేక సెల్లో ఉన్న రాయ్ ఏ లోటూ లేకుండా విలాసవంతమైన జీవితం గడిపారు. ప్రత్యేక వసతులు కల్పించినందుకుగాను తీహార్ జైలు అధికారులకు ఆయన చెల్లించిన మొత్తం 1.23 కోట్ల రూపాయలు.

భద్రత, విద్యుత్, కాన్ఫరెన్స్ రూమ్ అద్దె, భోజనం, నీళ్లు వంటి సౌకర్యాలు కల్పించినందుకు జైలు అధికారులు ఈ మొత్తాన్ని వసూలు చేశారు. ఆయనకు వీడియో కాన్ఫరెన్స్, వైఫై, ఏసీ గదులు ఏర్పాటు చేయడంతో పాటు రెండు ల్యాప్టాప్లు, ల్యాండ్ ఫోన్లు, ఓ సెల్ఫోన్, సహాయ సిబ్బందిని వినియోగించుకునేందుకు అనుమతించారు. సహారా గ్రూప్ జైలు అధికారులకు ఇంకా 7.5 లక్షల రూపాయలు చెల్లించాలని అధికారులు చెప్పారు. కాగా గత నెలలో రాయ్ను సాధారణ సెల్కు మార్చారు.

డిపాజిటర్లకు 20 వేల కోట్ల రూపాయలు చెల్లించడంలో విఫలమైనందుకు రాయ్తో పాటు సహారా గ్రూపు డైరెక్టర్లు అశోక్ రాయ్ చౌదరి, రవి శంకర్ దుబెలను కోర్టు ఆదేశాల మేరకు గతేడాది మార్చిలో తీహార్ జైలుకు తరలించారు. రాయ్కు బెయిల్ మంజూరు చేయడానికి 10 వేల కోట్ల రూపాయలను పూచీకత్తుగా సమర్పించాలని కోర్టు ఆదేశించింది. 5 వేల కోట్లు రూపాయల నగదు, మరో ఐదు వేల కోట్లకు చెక్ రూపంలో సమర్పించాలని సూచించింది. అయితే ఈ డబ్బు చెల్లించలేని పరిస్థితిలో ఆయన విడుదల కాలేదు. అయినా ఇంట్లో అనుభవించే విలాసాలన్నీ జైలులోనూ అందుతుండగా, ఇక జైలైతే ఏంటీ, ఇళ్లైతే ఏంటీ..? అంటూ విమర్శలు కూడా వినబడుతున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sahara Group  Subrata Roy  Tihar jail  

Other Articles