gold chain, cell phone, money the reason behind software engineer murder

Cpm secratary madhu nephew murder case chased

software engineer murder, vallipalli Hasmi, Naresh kumar reddy, Gold chain, cell phone, money, CPM leader Madhu, telangana, Crime

andhra pradesh cpm party secratary madhu's nephew murdered because of gold chain, cell phone, money.

బంగారు గొలుసు, డబ్బు, సెల్ ఫోన్..

Posted: 05/25/2016 11:15 AM IST
Cpm secratary madhu nephew murder case chased

సీపీఎం ఆంధ్రప్రదేశ్‌ కార్యదర్శి మధు మేనల్లుడు హష్మి దారుణహత్యను పోలీసులు చేధించారు. ఫోన్ కాల్ డాటా అధారంగా నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. సెల్ ఫోన్, నగదు, బంగారు గోలుసు కోసం అతని ఇంటిపక్కనే అద్దెకుండే నరేష్ కుమార్ రెడ్డి బండరాయితో మోది దారుణానికి ఒడిగట్టాడని తేల్చారు. పోలీసులు. హష్మీ మృతదేహాన్ని లింగంపల్లిలోని రైల్వే ట్రాక్‌ వద్ద గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం అస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలావున్నాయి.

మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాలకు చెందిన హష్మి గత వారమే టీసీఎస్‌ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చేరాడు.... బల్కంపేట ఎల్లమ్మ గుడి సమీపం లో నివాసం ఉండే వల్లిపల్లి హష్మి (26) సోమవారం రాత్రి 8.15కి డ్యూటీ ముగించుకొని ఇంటికి బయలుదేరాడు. మంగళవారం ఉదయానికి కూడా అతను ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు కంపెనీలో ఆరా తీయగా ఇంటికి వెళ్లిపోయాడని చెప్పారు. కాల్‌ చేస్తే సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్‌ వచ్చింది. హష్మి కోసం గాలించినా ఆచూకీ దొరక్కపోవడంతో సోదరుడు ఉమామహేశ్వర్‌రావు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హష్మి కాల్ డేటా ఆధారంగా నరేష్ కుమార్ను పోలీసులు అదుపులోకి విచారిస్తే అసలు విషయం బయటపడింది. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ రూమ్ పక్కన ఉండే నరేష్ కుమార్ రెడ్డి రమ్మనడంతో హష్మి వెళ్లాడని, స్నేహితుడే కావడంతో హష్మి అతడి వెంట లింగంపల్లి వరకూ వెళ్లాడని తెలిపారు. తనకు ఓ పదివేలు డబ్బు అవసరమని నరేష్ కుమార్ అడిగాడని, అయితే హష్మి తన దగ్గర లేదని చెప్పడంతో, అతడి దగ్గరున్న డబ్బులు తీసుకునే ప్రయత్నం చేశాడని చెప్పారు.

వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, దీంతో బండరాయితో కొట్టి చంపినట్లు సీఐ పేర్కొన్నారు. తర్వాత హష్మి దగ్గరున్న పర్సు, సెల్ఫోన్ తీసుకుని నరేంద్ర కుమార్ రెడ్డి వెళ్లిపోయాడని, మర్నాడు ఏమీ తెలియనట్లు హష్మి బైక్ తిరిగి ఇచ్చేయడానికి వచ్చాడని, బైక్ స్నేహితుడికి ఇచ్చాడంటూ కట్టుకథ చెప్పినట్లు తెలిపారు. కాల్ డేటా ఆధారంగా నిన్న మధ్యాహ్నమే నరేష్ కుమార్ రెడ్డిన అదుపులోకి తీసుకుని విచారణ జరిపినట్లు సీఐ వెల్లడించారు. దీంతో మొత్తం ఘటన వెలుగుచూసిందని తెలిపారు.
 
మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles