చిన్నారి తలలోకి బుల్లెట్ ఎలా? | kuwait kid fired at sister bullet struck in head

Kuwait kid fired at sister bullet struck in head

kuwait kid gun, Adan Hospital, four-year old sister, brother bullet sister, తాజా వార్తలు, తెలుగు వార్తలు, కువైట్ అన్న, చెల్లి తలలో బుల్లెట్, latest news

A boy mistakenly shot at his four-year old sister and the bullet was lodged inside her head, reports Al-Rai daily. According to security sources, the girl was carried by her family to Adan Hospital where the family said the girl fell down and a piece of metal pierced into her head.

చిన్నారి తలలోకి బుల్లెట్ ఎలా?

Posted: 06/07/2016 02:53 PM IST
Kuwait kid fired at sister bullet struck in head

అన్న చేసిన పనికి చావు బతుకుల్లో కొట్టాడుతున్న చెల్లి ఉదంతమిది. కువైట్ రాజధాని కువైట్ సిటీలోని అద్నాన్ హస్పిటల్. టాప్ ఆస్పత్రి కావటంతో నిత్యం పెషెంట్లతో బిజీగా ఉంటుంది. హఠాత్తుగా ఓ నాలుగేళ్ల చిన్నారిని ఒళ్లో ఎత్తుకుని పరిగెత్తుకు వచ్చాడు ఆమె తండ్రి. తలకు గాయం కావటంతో తమ బిడ్డ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని వైద్యుల వద్ద రోదించసాగాడు. అయితే ఎక్సరే తీసిన వైద్యులు ఆ రిపోర్ట్ లు చూసి ఆశ్చర్యపోయారు. ఆ చిన్నారి తలలో వారికి బుల్లెట్ కనిపించడంతో సర్జరీ కోసం వేరే ఆస్పత్రికి తరలించారు. మరోవైపు విషయాన్ని పోలీసులకు చేరవేశారు. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా ఆ తండ్రి అసలు విషయం చెప్పాడు.

ఆ పాప అన్నయ్య (10 ఏళ్లు) తన చెల్లెల్ని ఆటపట్టిద్దామనుకున్నాడంట. అందుకోసం తన తండ్రి లైసెన్స్ రివాల్వర్ ను తీసుకుని బయపట్టించాలని ఫ్లాన్ వేశాడు. అయితే గన్ అన్ లోడ్ చేసి ఉండటంతో అది కాస్త పేలి బుల్లెట్ ఆ చెల్లెలి తలలోకి దూసుకెళ్లింది. దీంతో కంగారు పడిన ఆమె తండ్రి విషయం దాచి అబద్ధం చెప్పాడంట. మొత్తం మీద చెల్లెల్ని భయపట్టిదామనకున్న ఆ బుల్లి అన్న ప్లాన్ బెడిసి కొట్టడమే కాకుండా జువెనైల్ హోంకు వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. బుల్లెట్ తొలగించినప్పటికీ ప్రస్తుతం ఆ పాప పరిస్థితి సీరియస్ గానే ఉందట. సరదాగా చేసే చిలిపి పనులు ఒక్కోసారి అనుకోకుండా విషాదాలుగా మారుతుంటాయి ఇలా.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kuwait kid gun  Adan Hospital  four-year old sister  brother bullet sister  

Other Articles