అసెంబ్లీ లో వేటు అనే ఘోర పరాభవం నుంచి బయటపడి తర్వాత ఫాంలోకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే రోజా తిరిగి తన నోటికి పని ప్రారంభించింది. తన రాజకీయ అనుభవం ఉన్నంత జగన్ తనను విమర్శిస్తున్నాడన్న చంద్రబాబు వ్యాఖ్యలపై కౌంటర్ వేసింది. అయితే ఇప్పటికే జగన్ చేసిన వ్యాఖ్యలు చాలాన్నట్లు ఇప్పుడు ఈ ఫైర్ బ్రాండ్ మరిన్నీ ఘాటు వ్యాఖ్యలు చేసేసింది. తనకున్నంత అనుభవం ఎవరికీ లేదని చెప్పుకునే ఆయనకు అవినీతిలో ఎంతో అనుభవం ఉందో చెప్పాలని ఎద్దేవా చేసింది.
మంగళవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లడుతూ... బాబు పాలనను రెండు పదాల్లో చెప్పాలంటే సంక్షోభం, దుర్భిక్షమని, అదే మూడు పదాల్లో చెప్పాలంటే అవినీతి, అరాచకం, అమర్థత అని విమర్శించింది. ప్రజలను మోసం చేసి సీఎం అయిన బాబు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపించింది. పనిలోపనిగా ఆయన కుమారుడు, టీడీపీ జాతీయ సెక్రటరీ లోకేష్ పై కూడా విమర్శలు గుప్పించింది. చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ కలిసి గుడిని, గుడిలో లింగాన్ని కూడా మింగేస్తున్నారని, విలాసాలకు, వినోదాల కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారని దుయ్యబట్టింది. "చంద్రబాబునాయుడు సంతకాలు పెడుతుంటే, మన లోకేష్ బాబు సూట్ కేసులు సర్దేస్తున్నారు. చంద్రబాబు డీల్ చేసి కాంట్రాక్టులు ఇస్తుంటే, ఆయన కొడుకు కమీషన్లను సెటిల్ చేస్తున్నారు.
కలెక్షన్ కింగ్ అంటే నటుడు మోహన్ బాబు గుర్తుకు వస్తారు. కానీ ఏపీలో అవినీతి సొమ్మును కలెక్ట్ చేయడంలో కలెక్షన్ కింగ్ అంటే లోకేష్ బాబే ఇప్పుడు అందరికీ గుర్తుకు వస్తున్నాడు" అంటూ చెప్పుకొచ్చింది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకూ తండ్రి కోడుకులిద్దరూ ఎక్కడ భూములు దొరికినా బినామీ పేరిట దోచేసుకుంటున్నారని ఆరోపించింది. చంద్రబాబు అవినీతి అనకొండని, లోకేష్ బాబు కమీషన్ల కొండచిలువని అనకుండా ఉండలేకపోతున్నానని చెప్పారు. డ్వాక్రా సంఘాల వెన్నెముక విరిచి కూర్చోబెట్టిన దౌర్భాగ్య ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడని, వచ్చే ఎన్నికల్లో డ్వాక్రా మహిళల వద్దకు ఓటేసేందుకు వెళితే పేడ నీళ్లతో సన్మానం చేస్తారని కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించింది.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more