బ్రిటీషు కాలం నాటి దేశద్రోహ చట్టం కొనసాగింపుపై ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో వినిపించిన వాదనపై కేంద్రం ప్రభుత్వం వెనక్కుతగ్గింది. ఇటీవల ఈ కేసు విచారణ సందర్భంగా దేశద్రోహం చట్టం కొనసాగించాలని, అయితే.. ఈ చట్టం సక్రమంగా అమలు జరిగేట్టుగా చూస్తే చాలునని వాదించిన కేంద్రం తాజాగా ఈ చట్టం అమలుపై యూటర్న్ తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. బ్రిటీష్ కాలం నాటి చట్టాలను ఇంకా కొనసాగిస్తున్నారన్న అంశంలో దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.
ఈ చట్టాన్ని రద్దు చేయాలన్న ఆలోచనలో ఉన్న కేంద్ర సర్కార్ తాజాగా దేశ ద్రోహ చట్టాన్ని పున సమీక్షించనున్నట్లు తెలిపింది. ఇవాళ సుప్రీంకోర్టులో కేంద్రం ఈ విషయాన్ని చెప్పింది. ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)లోని 124ఏ చట్టాన్ని సంపూర్ణంగా సమీక్షించనున్నట్లు కేంద్రం కోర్టుకు విన్నవించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నేపథ్యంలో పాతకాలం చట్టాలను రద్దు చేయాలని ఇటీవల ప్రధాని మోదీ కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశద్రోహ చట్టాన్ని కూడా రద్దు చేయాలని భావించారు.
కానీ ఆ చట్టాన్ని మళ్లీ సమీక్షించనున్నామని, ఆ చట్టంలో ఉన్న లోపాలను సరిదిద్దనున్నట్లు ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కేంద్రం చెప్పింది. 124ఏ సెక్షన్‌పై పూర్తిగా స్టడీ చేసే వరకు సుప్రీం వేచి ఉండాలని కేంద్రం వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శిస్తున్న వారిపై దేశద్రోహ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు గత ఏడాది కేంద్రంపై ఆరోపణలు వచ్చాయి. అయితే బ్రిటీష్ కాలంలో మహాత్మా గాంధీ లాంటి వారిని సెలెంట్ చేసేందుకు ఈ చట్టాలను వాడారని, ఎందుకు ఆ చట్టాలను రద్దు చేయడంలేదని ఇటీవల సుప్రీం కూడా ప్రశ్నించింది. 1962లో దేశద్రోహ చట్టంపై వచ్చిన తీర్పుపై సమీక్షించేందుకు ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి పంపేందుకు సుప్రీం ఆలోచిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more