మంత్రి పార్థసారథి చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. 2009 ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. మంత్రి పార్థసారధి ఎన్నికల అఫిడవిట్‌ను పరిశీలించిన రెవెన్యూ అదికారులు కేసులు లేవని అఫిడవిట్లో నమోదు చేసినట్లు గుర్తించారు. దీంతో మంత్రిపై మరిన్ని సెక్షన్ల కింద కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.ఇటీవల ఆర్థిక నేరాల కోర్టు మంత్రికి శిక్ష విధించటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గతంలో మంత్రి పార్థసారధి కేపీఆర్ టెలీ ప్రొడెక్ట్స్ ఎండీ గా ఉన్నప్పుడు ఫెరాను ఉల్లంఘించారంటూ 2002లో ఈడీ కేసు నమోదు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు మంత్రి ఫెరాను ఉల్లాంఘించినట్లు నిర్థారించింది. రెండు నెలల జైలు శిక్ష, ఐదులక్షల జరిమానాను కోర్టు విధించగా అప్పీలు చేసుకున్న పార్థసారధి బెయిల్ తీసుకున్న విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more