వేలాది కోట్ల రూపాయల విలువ చేసే సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ఆస్తులను కొల్లగొట్టడం కోసం ఇద్దరు సభ్యులు కుట్ర చేస్తున్నారా? అనే సందేహాలు ప్రస్తుతం సర్వత్రా వినిపిస్తున్నాయి. ప్రశాంతి నిలయంలోని విశ్వసనీయ వర్గాల అభిప్రాయం మేరకు వివరాల్లోకి వెళితే..సత్యసాయి మరణం తర్వాత ట్రస్టు ఆస్తులపై కన్నేసిన కొందరు ట్రస్టు సభ్యులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ వస్తున్నారు. బాబా భౌతికకాయం వీడాక 2011 జూన్ 16న యజుర్వేద మందిరం తలుపులు తెరిచి, ఆస్తులను లెక్కించడానికి పూనుకున్నారు. ఈ సోదాల్లో రూ. 11.56 కోట్ల నగదు, 98 కేజీల బంగారం,307 కేజీల వెండి మా త్రమే లభ్యమయ్యాయని ట్రస్టు సభ్యులు తొలుత ప్రకటించారు. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లేకుండా యజుర్వేద మందిరం తలుపులు తెరవడం.. ట్రస్టుకు చెందిన రూ.35 లక్షలను బెంగళూరుకు తరలిస్తుండగా జూన్ 16న కొడికొండ చెక్‌పోస్టు వద్ద పోలీసులు పట్టుకోవడంతో ట్రస్టు సభ్యుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
దాంతో ప్రభుత్వం.. జాయింట్ కలెక్టర్ అనితను తనిఖీ అధికారిగా నియమించింది.2011 జూలై 2న తొలి విడత.. జూలై 18, 19 తేదీల్లో రెండో విడత అధికారులు సోదాలు చేశారు. జూలై 20న వైట్‌ఫీల్డ్‌లో కూడా సోదా చేయగా లభ్యమైన బంగారు, వెండి అభరణాలను బ్యాంకుల్లో భద్రపరిచారు. ట్రస్టు సభ్యులు యజుర్వేద మందిరంలో 2011 జూన్ 16న గుట్టుగా నిర్వహించిన సోదాల్లోనే సత్యజిత్ బయటపెట్టిన డిక్లరేషన్ వెలుగు చూసిందని తెలుస్తోంది. అప్పట్లో దీనిని బయటపెట్టని సభ్యులు ఇప్పుడు వ్యూహాత్మకంగా బహిర్గతం చేయించారనే అభిప్రాయం విన్పిస్తోంది. సెంట్రల్ ట్రస్టును 1972లో బాబా నెలకొల్పారు. 1967 లోనే ధర్మక్షేత్రలో సత్యసాయి ట్రస్టును బాబాయే ఏర్పాటు చేశారు. 1967 మార్చి 23న బాబా చేసిన డిక్లరేషన్ ధర్మక్షేత్ర ట్రస్టుకు వర్తిస్తుదని, సత్యసాయి సెంట్రల్ ట్రస్టుకు వర్తించదనే అభిప్రాయాన్ని భక్తుల్లో కలిగించడానికే ఓ ట్రస్టు సభ్యుడు..సత్యజిత్ ద్వారా ఈ నాటకం ఆడించారని ప్రశాంతి నిలయం వర్గాలు పేర్కొన్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more