గురుపూజోత్సవ కార్యక్రమంలో చిత్తూరుజిల్లా విద్యాశాఖ అధికారులు జాతీయ నాయకులను అవమానపర్చారు. సమావేశానికి హాజరైన అతిథులకు, సభికులకు జాతీయ నాయకుల ఫోటోలతో ముద్రించిన పేపర్ ప్లేట్లలో అల్పాహారం అందించి వారిని తీవ్రంగా అవమానించారు. చిత్తూరు నగరంలోని అంబేద్కర్ భవన్‌లో గురుపూజోత్సవం విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులకు, సభికులకు జాతీయ నాయకుల ఫోటోలతో తయారైన పేపర్‌ప్లేట్లతో అల్పాహారం పంపిణీ చేశారు. అనంతరం వాటిని చెత్తబుట్టలో పడేశారు. చెత్తబుట్టలో పడేసిన ప్లేట్లపై కన్నెయగా వాటిపై జాతీయ నాయకుల ఫొటోలు ముద్రించి ఉన్నాయి. దీనిపైనే సభలో అందరూ చర్చించుకున్నారు. నిర్వాహకుల తీరును తప్పుబట్టారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న భూగర్భ గనుల శాఖ మంత్రి గల్లాఅరుణకుమారికి ఈ కార్యక్రమానికి కొంచెం ఆలస్యంగా రావడంతో విషయాన్ని మీడియా ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. విషయం తెలుసుకున్న ఆమె కొద్దిసేపు అవాక్కయ్యారు. దీనిపై నిర్వాహకులను మందలించి తయారుచేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more