కాంగ్రెస్ ఎంపీ రాయపాటి సాంబశివరావు. ఇటీవల ఈపేరు మీడియాలో మారుమ్రోగింపోయింది. రాయపాటి సాంబశివరావు పేరు వినగానే అందరికి తార చౌదరి గుర్తు వచ్చే విధంగా పాప్లులర్ అయ్యాడు. ఇటీవల కేంద్ర మంత్రి వర్గంలో తనక పదవి రాలేదని అగిన రాయపాటి రాజీనామా ఇస్తున్నట్లు, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నట్లు వార్తలు వినిపించాయి. అలాంటి వార్తలకు కేంద్రం అడ్డుకట్ట వేసింది. మంత్రి పదవి దక్కలేదని నిరాశలో ఉన్న రాయపాటికి అమ్మ మంచి వరం ఇవ్వటం జరిగింది. అదే రాయపాటికి పోలవరం? మంత్రి పదవి దక్కనందుకే బహుమానంగా పోలవరం దక్కిందని కొంతమంది రాజకీయ నాయకులు అంటున్నారు. రాయపాటిలో ఆనందం కంటే కొంచెం బాధ కనపడుతుందని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు. ఈ పోలవరం ప్రాజెక్టు ఇవ్వటం అనేక అనుమానాలు ఉన్నాయని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ కి పోలవరం ప్రాజెక్టు దక్కడం పై కొత్త వివాదం మొదలయింది. ఒక వైపు సోమా కంపెనీ దీనిపై కోర్టుకు వెళ్లి రష్యా కంపెనీ వద్ద తీసుకున్న సర్టిఫికేట్ బోగస్ దేనని ఆరోపిస్తోంది. దానిని పరిశీలించాలని కోర్టు ఆదేశించింది. ఇలాంటి సమయంలోనే మళ్లీ ట్రాన్స్ ట్రాయ్ కే కాంట్రాక్టు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవటం వెనుక రాజకీయ కోణం ఉందని టీడీపీ నాయకులు ఆరోపిస్తోన్నారు. అసంత్రుప్తితో ఉన్న కమ్మ వర్గానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బహుమతి అని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. అంతేకాకుండా ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలను మనసులో పెట్టుకొని అధిష్టానం ఇలా చేసినట్లు తెలుస్తోంది. పార్టీ ఫండ్ కోసమే సీనియర్ నాయకులకు అధిష్టానం ఇలాంటి బహుమతులు ఇస్తుందని టీడీపీ, టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. రాయపాటికి పోలవరం ప్రాజెక్టు దక్కటం పై టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కూతురు కవిత కూడా విరుచుపడ్డారు. సుప్రీం కోర్టు తీర్పు రాకుండానే పోలవరం టెండర్లు ఖరారు చేయరాదని , వాటిని వెంటనే నిలిపివేయాలని ఆమె డిమాండ్ చేశారు. అయిన 3 వేల కోట్లు ప్రాజెక్టు కాంగ్రెస్ నాయకులే దక్కిందని అన్ని పార్టీ నాయకులకు ఈర్ష్యగా ఉందని రాయపాటి అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more