తెలుగు దేశం పార్టీ నాయకులు శాసనసభలో ఆందోళన చేసారు, ముఖ్యమంత్రి కేబిన్ ముందు ధర్నా చేసారు, పాత ఎమ్మల్యే క్వార్టర్స్ లో నిరసన చేసి ప్రభుత్వం బలవంతంగా చేసిన దీక్షాభంగ ప్రయత్నంతో విరమించారు. పాదయాత్రలో చంద్రబాబు నాయుడు కరెంటు విషయంలో నిప్పులు చెరుగుతూనేవున్నారు. వామపక్షాలు నిరసనలు చేస్తూనే ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ నిరాహార దీక్ష ఈ రోజుకు నాలుగో రోజుకి చేరింది. తెలుగు దేశం పార్టీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి వారిని కలిసి సంఘీభావాన్ని తెలియజేసారు. ప్రభుత్వం దిగివచ్చేంత వరకూ నిరసనలు కొనసాగుతాయని భాజపా నేత రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేసారు. దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటంలేదని నిరసన ప్రకటిస్తూ భాజపా నేతలు సచివాలయాన్ని ముట్టడించటానికి ప్రయత్నించగా పోలీసులు ఆందోళనకారులలో భండారు దత్తాత్రేయ, ఇతర నాయకులను అదుపులోకి తీసుకున్నారు. వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఈ రోజు పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ లో దీక్షను ప్రారంభించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆమెకు తోడుగా దీక్షలో పాల్గొన్నారు. తెలుగు దేశం పార్టీ నాయకుడు సోమినేని చంద్రమోహన రెడ్డి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మాట్లాడుతూ, తెలుగు దేశం నుంచి పాఠాలు నేర్చుకోమని ముఖ్యమంత్రికి తామేమీ చెప్పలేదని, అయినా విద్యుత్ సంక్షోభం విషయంలో ముఖ్యమంత్రి సమీక్షలను ఎందుకు నిర్వహించటం లేదని ఆయన ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో ఆమ్ ఆద్మీ పార్టీ సంస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్ నిరాహార దీక్షతో పాటు సహాయనిరాకరణకు కూడా పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలన్నీ ఏకతాటిమీదకు రాకపోయినా ఇలా ఒకే విషయాన్ని పట్టుకోవటానికి కారణం విద్యుత్ సమస్య బలీయమైనది అవటమే కాకుండా మరో కారణం కూడా ఏమీ కనపడటం లేదు. ఎన్నికల వరకూ ప్రజల ముందుకు వస్తూ ఉండాలంటే ఏదో ఒక సమస్య మీద ఆందోళన చేపట్టవలసిందే. విద్యుత్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసహాయ స్థితిలో ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మరీ. ఎందుకంటే ఇక్కడ నిర్ణయాలు తీసుకునే అధికారమా లేదు. కేంద్రంలో ఏం చెయ్యబోతున్నారో తెలియదు కాబట్టి, చూస్తాం, చేస్తాం, మీరేమిటి మాకు చెప్పేది అనే మాటలు, మీ హయాంలో ఏం చేసారని విమర్శించటాలు తప్పితే మరేమీ చెయ్యలేకపోతున్నారు. కనీసం విద్యుత్ సమస్య మీద చేసిన అఖిలపక్ష సమావేశాన్ని ఒక నిర్ణయం వచ్చే వరకూ కొనసాగించటమో లేకపోతే ఒక కమిటీని నియమించటమో చేసినా బావుండేదేమో కానీ కేంద్రం తలాడించకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చెయ్యదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాకుండా కాంగ్రెస్ కి మద్దతునిచ్చే ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట కాస్త పరిస్థితి బాగానే ఉంది. ఈ పని చెయ్యకపోతే మద్దతును ఉపసంహరించుకుంటామని బెదిరించటానికుంది. ఇక్కడ అదీ లేదు. ఎక్కువ మంది కాంగ్రెస్ ఎంపీలున్నందుకు కేంద్రం మీద పట్టూ లేదు, బెదిరించనూ లేరు. మొత్తం మీద విద్యుత్ పుణ్యామాంటూ లాంతర్లు పట్టుకుని నిరసనలు తెలియజేయటంలో ప్రతిపక్షాలన్నీ ముందుకు అడుగులు వేస్తున్నాయి, ఒక పార్టీకి మరో పార్టీ మద్దుతుని ప్రకటించుకుంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more