వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు చేపట్టిన పాదయాత్ర 16 రోజులు పూర్తి చేసుకుంది. అయితే షర్మిల పాదయాత్ర ఇప్పటి వరకు 213 కిలో మీటర్లు మాత్రం ఆమె వాకింగ్ చేసినట్లు తెలుస్తోంది. షర్మిల పాదయాత్రలో ముఖ్యంగా ఆమె తెలుగు దేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకోని వారి పై విమర్శలు కురిపిస్తుంది. షర్మిల విమర్శలకు ఆయ పార్టీ నాయకులు , దీటుగా సమాధానం చెబుతున్నారు. కానీ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు, పాదయాత్ర వలన ఎవరికి లాభం అనే విషయాలను ప్రజలకు షర్మిల చెప్పటంలేదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఆమె పాదయాత్ర చంద్రబాబు పాదయాత్రకు పోటీగా ఉంది గానీ , ప్రజలకు ఉపయోగపడే యాత్ర కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు. షర్మిల తన అన్న కోసం పాదయాత్ర చేస్తున్నట్లు కనిపిస్తుందని , రాష్ట్ర ప్రజల కోసం చేసే యాత్ర కాదని తెలుగు దేశం పార్టీ నాయకులు అంటున్నారు. షర్మిలా పాదయాత్ర కోసం ఖర్చు పెట్టే డబ్బులతో రాష్ట్రంలోని పేద వారికి కొన్ని సంవత్సరాలు పాటు అన్ని సౌకర్యాలు కల్పించవచ్చని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. షర్మిల పాదయాత్రలో మహిళలు, మహిళ నాయకులుగానీ కనిపించటంలేదని కొన్ని మీడియా వర్గాలు అంటున్నాయి.
పాదయాత్రలో ఎక్కువ బాగం రాజన్న ఉన్నప్పుడు అన్ని సమస్యలు తీరాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రజల సమస్య వలయంలో చిక్కుకున్నారని అందుకోసం జగనన్న వస్తే మీ సమస్యలు తొలగిపోయి మీకు రాజన్న రాజ్యం తెస్తాడని షర్మిల ఉద్రేకంతో ప్రసంగాలు చేయటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారట. ‘‘ ఇప్పుడు తింటానికి అన్నం లేదుగానీ .. నా పెళ్లి కి పంచపరవనాలు పెడతాన్నాడట’’ అనే సామెత మాదిరిగా షర్మిల ప్రసంగాలు ఉన్నాయని పాదయాత్రలో ప్రజలు చెవ్వులు కోర్కుకుంటున్నారని మీడియా వర్గాలు అంటున్నాయి. షర్మిల ఇప్పుటి వరకు 213.60 కిలోమీటర్లు పాదయాత్ర చేసినట్లు సాక్షి మీడియా గొప్పలు చెప్పుకుంటుంది , కానీ ఆమె రోజు ఆరు గంటలే వాకింగ్ చేస్తుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇలా రోజు ఆరు గంటలే వాకింగ్ చేసే బదులు , ప్రతి రోజు ఒక గ్రామంలో వెళ్లి వారి సమస్యలు గుర్తించి తెలుసుకోని వారి సహాయం చేస్తే సరిపోతుందని రాజకీయ విశ్లేషాకులు అంటున్నారు. పాదయాత్రకు ఖర్చు పెట్టే డబ్బు ఆ గ్రామానికి వినియోగిస్తే .. రాష్ట్రం ఒక గ్రామం అయిన బాగుపడుంది, అది ఆలోచించకుండా అటు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే, ఆ పనులకు ఆటకం చేకూర్చుతూ, ప్రభుత్వం పై , ప్రతిపక్ష పార్టీ ల విమర్శలు చేయటం మంచి కాదని రాజకీయ విశ్లేషాకులు అంటున్నారు. ప్రజా సేవ చేయాలని ఉంటే పాదయాత్రతో ఫలితం ఉండదని , ప్రజల సమస్యలు తీరావని , షర్మిల పాదయాత్ర లోని ప్రజలు చెవులు కోర్కుకుంటున్నారని మీడియా వర్గాలు అంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more