రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు అధిష్టానానికి తలకు మించిన భారంగా పరిణమిస్తున్నాయి. కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ లాంటి సీనియర్ నాయకుడు సైతం రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితులపై తన అసంతృప్తిని బహిరంగపర్చేందుకు వెనకాడకపోవటం హైకమాండ్‌ను ఆలోచనలో పడేసిందని అంటున్నారు. కిశోర్ చంద్రదేవ్ లేఖ వ్యవహారంపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సీనియర్ నేతలతో మాట్లాడినా, ఇప్పటికిప్పుడే ఒక నిర్ణయానికి వచ్చే సూచనలు కనిపించటం లేదు. ప్రత్యేక తెలంగాణ వివాదంపై నిర్ణయం తీసుకోకుండా, పార్టీ, ప్రభుత్వంలో మార్పులు చేర్పులపై ఒక నిర్ణయానికి రావడం కష్టమని హైకమాండ్ భావిస్తోంది. ప్రత్యేక తెలంగాణ వివాదం, లోక్‌సభ సభ్యుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైకాపా దూకుడు, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, ప్రభుత్వ పనితీరుపై సీనియర్, జూనియర్ల పెదవి విరపులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వైకాపా వైపు వలసపోయే పరిస్థితులు ఊపిరాడనివ్వడం లేదని ఏఐసిసికి చెందిన సీనియర్ ఒకరు వ్యాఖ్యానించారు. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంఐఎం మద్దతు ఉపసంహరణ అంశంతో సమస్యలు మరింత జఠిలమయ్యాయని అంగీకరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ విషయం కాంగ్రెస్ హైకమాండ్‌కు ముందు నుయ్యి, వెనక గొయ్యి చందంగా తయారైందన్న భావన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో భారీ మార్పులు చేసేందుకు, తెలంగాణ ఏర్పాటు వివాదంపై స్పష్టమైన నిర్ణయం తీసుకునేందుకు పార్టీ హైకమాండ్‌కు ధైర్యం చాలటం లేదని ఏఐసిసి నేతలే అంగీకరిస్తున్నారు. రాష్ట్రంలో ఎలాంటి చర్యలు తీసుకుంటే పార్టీ, ప్రభుత్వం పరిస్థితి బాగుపడుతుందనే దానిపై తగు సూచనలు చేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా రాష్ట్ర వ్యవహారాలు చూస్తున్న ఇద్దరు సీనియర్ మంత్రులు గులాం నబీ ఆజాద్, వాయలార్ రవిని ఆదేశించినట్టు చెబుతున్నారు. ఈ ప్రచారం ఏమేరకు నిజమనేది కూడా స్పష్టం కావటం లేదు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి బాధ్యతల నుంచి గులాం నబీ ఆజాద్‌ను తప్పించి దిగ్విజయ్‌సింగ్‌కు అప్పగించాలని అధిష్ఠానం ఆలోచిస్తున్న తరుణంలో, మళ్లీ ఆజాద్, వాయలార్ రవినుంచి నివేదికలు అడగటంలో నిజమెంత? అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. కిశోర్ చంద్రదేవ్ లాంటి సీనియర్ నాయకుడు హైకమాండ్‌కు రాసిన నోట్‌లోని అంశాలు మీడియాకు వెల్లడికావడం పట్ల హైకమాండ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more