దేశ రాజధానిలో నేరాలను అదుపుచేయలేకపోతున్నారని బీజేపీ కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వంపై ధ్వజమెత్తింది. ఈ ఘటన చాలా సీరియస్ అంశమని, ఇలాంటివి తరచూ జరుగుతున్నాయని బిజేపీ వ్యాఖ్యానించింది. కాగా ఈ కేసులో పోలీసులు ఇప్పటికే నలుగురిని గుర్తించినట్లు సమాచారం. దేశం యావత్తూ తలదించుకునేలా దేశ రాజధాని ఢిల్లీలో ఓ విద్యార్ధినిపై జరిగిన గ్యాంగ్ రేప్‌పై పార్లమెంట్ ఉభయ సభల్లో గందగోళం నెలకొంది. రాజ్యసభలో ప్రశ్నోత్తర సమయాన్ని రద్దు చేసి, అత్యారారంపై చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు పట్టుపట్టారు. మరోవైపు లోక్‌సభలోనూ ఇదే అంశం కుదిపేసింది. దీనిపై ఎస్సీ ఎంపీ జయాబచ్ఛన్ ఉద్వేగంతో ప్రసంగించారు. జయాబచ్చన్ కన్నీళ్లతో భోరున విలపించారు. ఆమె దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు. సభ డిప్యూటీ చైర్మన్ కురియన్ జయాబచ్చన్ మరోసారి అవకాశమివ్వగా ఆమె కన్నీరు తుడుచుకుంటూనే ప్రసంగం కొనసాగించారు. ఈ దుర్ఘటనపై ప్రభుత్వం బాధిత కుటుంబానికి బహిరంగ క్షమాణ చెప్పిందా అని ఆమె ప్రశ్నించారు. స్వతహాగా కళాఖారిణినైన నన్ను ఈ దారుణం తీవ్రంగా కలచివేసింది. ఈ విషయాన్ని కొన్నాళ్లైతే అందరమూ మర్చిపోతాం.. కానీ ఆమె జీవితాంతం ఆ దుస్సంఘటన జ్నాపకాలను మోయాలి. అంతకన్నా మానసిక హింస మరొకటుంటుందా? ఆమె మీరే విధంగా పరిహారం ఇస్తారు? అని జయా బచ్చన్ ఆవేదనతో సభను ప్రశ్నించారు. సమాజంలో అణగారిన వర్గాల కోసమంటూ ఎన్నో చట్టాలు తెస్తున్నాం, కానీ మహిళ సంగతేమిటి? వారి రక్షణ బాధ్యత ఎవరిది.. అంటూ ఆమె ప్రశ్నించారు.
అత్యాచారాన్ని హత్యానేరంతో సమానమైన నేరంగా పరిగణించడానికి వీలుగా చట్టాన్ని సవరించాల్సిందిగా ఎంపీ జయాబచ్చన్ కోరారు. సామూహిక అత్యాచార ఘటనపై వసంత్ విహార్ పోలీసు స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇలాంటివి తరుచూ జరుగుతుండటంపై విద్యార్థులు పోలీసులను ప్రశ్నించారు. బస్సు డ్రైవర్, మరొకరు కలిసి ఈ అత్యాచారానికి పాల్పడ్డారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నిందుతులను వెంటనే శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని అత్యంత గోప్యంగా విచారిస్తున్నట్లు తెలియవచ్చింది. ఉత్తరాఖండ్‌కు చెందిన 23 ఏళ్ల యువతి డెహ్రాడూన్‌లో పారా మెడికల్ కోర్సు చదువుతోంది. విద్యానంతర శిక్షణ (ఇంటెర్న్షిప్)లో భాగంగా ఆమె ఢిల్లీకి వచ్చింది. ఇక్కడే ఆమె స్నేహితుడు ఒకరు సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తూ సివిల్స్‌కు సిద్ధమవుతున్నాడు. ఇద్దరూ కలిసి ఆదివారం రాత్రి 11 గంటలకు బస్సులో ద్వారక నుంచి మౌనిర్కాకు బయలుదేరారు. ఆ సమయంలో బస్సులో ఏడుగురు మాత్రమే ఉన్నారు. బస్సు మహిపాల్‌పూర్‌కు చేరుకుంది. అక్కడ ఆ ఏడుగురూ వారిద్దరిపై దాడి చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more