ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న నల్లధనం ఆయా దేశాలకు తీరని నష్టాన్ని మిగుల్చుతుంది. ప్రపంచ దేశాలు నల్లధనం కారణంగా ఎంతెంత నష్టపోయాయో అనే దాని పై అమెరికాకి చెందిన గ్లోబల్ ఫైనాన్సియల్ ఇంటెగ్రిటీ (జీఎఫ్ఐ) నిర్వహించిన ఓ సర్వేలో భయంకరమైన నిజాలు బయటికి వచ్చాయి. 2001-2010 మధ్య కాలంలో నల్లధనం రూపంలో ఏ దేశం ఎంతవరకు నష్టపోయిందో ఈ నివేదికలో వెల్లడించారు. నల్లధనం బాధిత దేశాల జాబితాలో చైనా మొదటి స్థానం సంపాదించుకోగా, భారత్ ఎనిమిదో స్థానంలో ఉంది. చైనా పదేళ్లలో 2,74,000 కోట్ల డాలర్లు నష్టపోయింది. ఆ తర్వాతి స్థానంలో మెక్సికో (47600 కోట్లు), మలేషియా (28500), సౌదీ అరేబియా (20100 కోట్ల డాలర్లు) ఉన్నాయి. రష్యా, ఫిలిప్పీన్స్, నైజీరియా దేశాలు కూడా భారత్ కంటే ఎక్కువగానే నష్టపోయినట్లు తేలింది. "పదేళ్లలో 12,300 కోట్ల డాలర్లు నష్టపోయింది.
చైనాతో పోల్చుకుంటే భారత్‌లాంటి ఆర్థిక వ్యవస్థకు ఇది చాలా ఎక్కువ'' అని ఆర్థికవేత్త దేవ్ కర్ వ్యాఖ్యానించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్న 2008లో ఈ మొత్తం 87,130 కోట్ల డాలర్లు కావడం గమనార్హం. ఈ డబ్బు విద్యా, ఆరోగ్యరంగాల్లో, దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగపడేదని అన్నారు. ఇందులో కొంతైనా దేశంలోనే ఉండి, విద్యుత్ గ్రిడ్లకు వినియోగించి ఉన్నట్టయితే గత వేసవిలో విద్యుత్ సంక్షోభం నివారించగలిగేవారని చెప్పారు. ఒక్క 2010లోనే రూ.7 వేల కోట్లకు పైగా డబ్బు దేశం తరలిపోయిందన్నారు. ఇటీవలి కాలంలో కొంత అభివృద్ధి సాధించినప్పటికీ.. ఈ విధంగా డబ్బు తరలిపోవడం కొనసాగుతూనే ఉందని జీఎఫ్ఐ డెరైక్టర్ రేమాండ్ బేకర్ చెప్పారు. మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి, నల్లధనం అరికట్టడానికి చర్యలు చేపడుతుందో లేదో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more