ఢిల్లీలో వైద్య విద్యార్థినిపై జరిగిన ఘటనకు దేశమంత నిరసనలతో రగిలిపోతుంది. విద్యార్థులు, మహిళ సంఘాలు, రాజకీయ పార్టీలు, నిందితులకు ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దాని పై కమిటీలు, మీటింగ్ లతో మంతనాలు జరుపుతు కాలం గడుపుతుంది. కానీ లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ మాత్రం నిందితులకు ఉరి శిక్ష వేయటం సరైంది కాదని ఆయన అంటున్నారు. మానభంగం అదనేది దారుణమైన హేయమైన నేరం. ఇలాంటి నేరాలకు కఠినమైన శిక్షలు కావాలి. కానీ ఉరిశిక్ష సరికాదని ఆయన అంటున్నారు. ఒక వేళ ఉరిశిక్ష విదానం అమలైతే నేరస్తుడు అత్యాచారం చేసిన తరువాత ఆధారాలను చెరిపేసే, బాధితురాలిని అంతం చేసే ప్రమాదం ఉందని జేపి అంటున్నారు. అయితే జేపీ ఆలోచనలో మరోల ఉన్నాయి. దేశంలో మహిళల పై అత్యాచారం ఎక్కువుగా జరుగుతున్నాయి. ప్రపంచ మొత్తం మీద ఇండియా రెండో స్థానంలో ఉందని ఆయన అన్నారు. టాప్ స్థానంలో అమెరికా ఉన్నప్పటికి అక్కడి శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఇకపోతే అరబ్ దేశాల్లో అయితే శిక్ష మరోలా ఉంటుందని ఆయన అన్నారు. జేపి మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు – పరిష్కారం అనే అంశంపై మాట్లాడుతూ కొంచెం ఆవేశానికి లోనైనట్లు తెలుస్తోంది. అరబ్ దేశాలలో నేరం చేస్తే .. శరీరంలోని ఒక భాగాన్ని శాశ్వతంగా తొలగిస్తారు. మన సమాజం అలాంటి వాటిని ఆహ్వానించదు. మన న్యాయవ్యవస్థలో జరిమానా విధించడం, జైలు శిక్ష , లేదా ఉరిశిక్ష వేయడం మాత్రమే చేస్తామని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు ఈ పద్దతి మారాలి. కఠినంగా వేగంగా శిక్ష అమలయ్యే విధంగా చట్టాలను రూపొందిస్తే.. మానసికంగా భౌతికంగా శిక్ష అనుభవించిన నిందితుడు మరోసారి నేరం చేయాలంటే జంకుతాడని ఆయన కొంచెం ఆవేశంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే మానభంగం కేసుల్లో ఉరిశిక్ష వేయడం తప్పుకాదు. కానీ పర్వవసానం ఆలోచించకుండా చట్టాలను మార్చుకుంటూ పోతే మాత్రం ఫలితం ఉండదన్నారు. మన దేశంలో నిందితులు తప్పించుకోవాటానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఒక కేసులో ఇరుక్కున్న నిందితుడు .. ఆ కేసులో తీర్పు నివేదిక వచ్చేలోపు మరో నేరం చేస్తున్నాడు. అలాంటి సమయలో నిందితులకు శిక్ష ఏవిధంగా వేస్తారు? అందుకే నేరస్తులు రెచ్చిపోతున్నారు. దేశంలో నేరాలు పెరిగిపోతున్నాయి. ముందు చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి, వేగంగా శిక్ష అమలు జరిగినప్పుడే, నేరాలు సంఖ్య తగ్గుతుందని జేపి అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more