ఢిల్లీ లో జరిగిన నిర్బయ సంఘటనతో దేశంలోని రాజకీయ నాయకులు స్వరం పెంచారు. రాజకీయ విలువల కోసం వారే చేసే వ్యాఖ్యలతో కొత్త వివాదాలు పుట్టుకొస్తున్నాయి. రాజకీయ నాయకులు మాటలతో దేశంలో మంటలు రేపుతున్నారు. అత్యాచారాలపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన, ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న తరుణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆస్సెస్) అధిపతి మోహన్ భగవత్, మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వంలోని మంత్రి కైలాస్ విజయ్వార్గియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘గ్రామీణ భారత్’లో అత్యాచారాల్లేవని, పాశ్చాత్యీకరణ కారణంగా ‘అర్బన్ ఇండియా’లోనే రేప్‌లు జరుగుతున్నాయని ఆరెస్సెస్ చీఫ్ పేర్కొనగా, మహిళలకు ‘లక్ష్మణరేఖ’ దాటితే సీత గతేనని మధ్యప్రదేశ్ మంత్రి వ్యాఖ్యానించారు. వీటిపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కావడంతో మంత్రి విజయ్వార్గియా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఆరెస్సెస్ అధినేత అభివూపాయాన్ని బీజేపీ, సంఘ్ సమర్థించాయి. ఆయన మాటలను సరైన రీతిలో అర్థం చేసుకోవాలని పేర్కొన్నాయి. ఆయన అభిప్రాయాన్ని తప్పుగా అన్వయించుకున్నారని, నిజానికి ఆయన అత్యాచారాలపై తీవ్ర నిరసన తెలిపారని పేర్కొన్నాయి. పాశ్చాత్య ప్రభావాల కారణంగా పట్టణాల్లోనే ఎక్కువగా అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయని, గ్రామీణ భారత్‌లో అలాంటి పరిస్థితి లేదని ఆరెస్సెస్ చీఫ్ అన్నారు. ‘‘అర్బన్ ఇండియాలో మహిళలపై జరుగుతున్న నేరాలు సిగ్గుచేటు. ఇది ప్రమాదకర ధోరణి.
కానీ ఇలాంటి నేరాలు భారత్‌లోగానీ, దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోగానీ సంభవించవు. గ్రామీణ, అటవీ ప్రాంతాలకు వెళ్ళి చూడండి.. అక్కడ సామూహిక అత్యాచారాలు లేదా లైంగిక నేరాలు కనిపించవు’’ అని ఆయన అసోంలోని సిల్చార్‌లో జరిగిన ఓ సమావేశంలో పేర్కొన్నారు. ‘‘ఎక్కడైతే ‘భారత్’ పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో ‘ఇండియా’గా మారుతోందో అక్కడ ఈ తరహా ఘటనలు సంభవిస్తున్నాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. మహిళను తల్లిగా పరిగణించిన సమాజంలో అసలైన భారతీయ విలువలను, సంస్కృతిని నెలకొల్పాలని అన్నారు.అవాంఛనీయ పరిణామాలు ఎదురుకాకుండా ఉండాలంటే మహిళలు ‘లక్ష్మణరేఖ’ను దాటొద్దని మధ్యప్రదేశ్ మంత్రి కైలాస్ విజయ్వార్గియా పేర్కొన్నారు. లక్ష్మణరేఖను దాటినందునే సీత అపహరణకు గురయిందని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగడంతో బీజేపీ ప్రతిస్పందించింది. ఆ మంత్రి మాటలతో బీజేపీకి సంబంధం లేదని పేర్కొంది. అనంతరం ఆ మాటలను ఉపసంహరించుకోవాల్సిందిగా సూచించడంతో ఆయన క్షమాపణలు సీత (మహిళ) లక్ష్మణరేఖను దాటినప్పుడు సీతాపహరణం (మహిళలపై నేరాలు) చోటుచేసుకుంటుంది’’ అని మంత్రి విజయ్వార్గియా భోపాల్‌లో వ్యాఖ్యానించారు. ‘‘ప్రజలు తమ పరిమితులను దాటినప్పుడు ప్రమాదం జరిగే అవకాశముంటుంది. ఇది సమాజంలోని అందరికీ మహిళలకు, పురుషులకూ వర్తిస్తుంది’’ అని ఆయన అన్నారు. మంత్రి మాటలను కాంగ్రెస్ నేత అజయ్‌సింగ్, సీపీఎం రాజ్యసభ సభ్యురాలు టీఎన్ సీమా, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్‌సింగ్ ఖండించారు. అభ్యంతరాలు వెల్లు నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ ప్రతిస్పందించి ఆ వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధం లేదని పేర్కొన్నారు. ఆ మాటలను ఉపసంహరించుకోవాల్సిందిగా కోరామని చెప్పారు. దాంతో తన మాటలు మహిళా కార్యకర్తల మనోభావాలను గాయపరిస్తే క్షమించాల్సిందిగా మంత్రి కోరారు. తన మాటలను మహిళలకు వ్యతిరేకంగా తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను మొత్తం సమాజాన్ని.. రాజకీయవేత్తలను, మీడియాను కలిపి అందరికీ వర్తించేలా చెప్పానని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more