ఇటలీ దేశానికి చెందిన ఇద్దరు నావికా అధికారులను ఆ దేశం తిరిగి పంపించలేదని ప్రభుత్వం మీద విపక్షాలు వత్తిడి, ప్రభుత్వం దానికనుగుణంగా ఇటలీ దేశంతో కయ్యానికి దిగుతూ భారతదేశంలోని ఇటలీ రాయబారిని దేశం వదిలిపోరాదని ఆంక్షపెడుతూ, ఆయన గారు చెప్పా పెట్టాకుండా వెళ్ళిపోయినా వెళ్ళిపోవచ్చని విమానాశ్రయాలకు కూడా సందేశాలివ్వటం జరిగింది. కానీ ఇటలీలో జైళ్ళల్లో మగ్గుతున్న భారతీయులు ఎంతమంది ఉన్నారో లెక్క తెలియదు. వాళ్ళని తిరిగి రప్పించటం ఎలాగో అంతకంటే తెలియదు.
దేనిమీద ఎక్కువ వత్తిడి వస్తే అటువైపు దృష్టి సారించాల్సివస్తోంది కానీ ప్రభుత్వానికి ఒక ప్రణాళికంటూ లేదేమో అనిపిస్తోంది. ఏ వార్త వార్తల్లోకి ఎక్కి సంచలనం సృష్టిస్తుందో, లేక ఏ వార్తను ప్రతిపక్షాలు ఆధారంగా తీసుకుని ఎండగట్టటం ప్రారంభిస్తారో అదే అన్నిటికన్నా ముఖ్యమౌతోంది. పైగా ఒక సంవత్సరంలో ఎన్నికలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటలీ జైళ్ళల్లోని భారతీయుల గురించి ఎవరు పట్టించుకుంటారు.
పట్టించుకున్నా ప్రయోజనం లేకపోయింది. మూడు సంవత్సరాల క్రితమే రాజ్య సభలో ఈ విషయాన్ని లేవనెత్తితే ప్రభుత్వం, అది ఇటలీ దేశానికి చెందిన అతి గోప్యమైన విషయమని, జైళ్ళల్లో ఉన్నవాళ్ళ వివరాలు వాళ్ళు ఇవ్వరని చెప్పింది. మన ప్రభుత్వం ఎంత అడిగినా ఆ తర్వాత కూడా ఎటువంటి వివరణా ఇటలీ నుంచి రాలేదు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ స్వయంగా ఒప్పుకున్నారు. ఇటలీలో పనిచేసే భారత రాయబార కార్యాలయం, అక్కడి భారతీయుల మీద కేసులను పట్టించుకోదట. అక్కడ ఎవరి కేసుని వాళ్ళే పరిష్కరించుకోవాలట కానీ రాయబార కార్యాలయం నుంచి ఎటువంటి సహాయం లభించదట. అనుమతి లేని ప్రవేశం నుంచి హత్యా నేరాల వరకూ ఇటలీ జైలుపాలయినవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటివాళ్ళు ప్రస్తుతం ఇటలీలో ఎంతమంది ఉన్నారో సరైన లెక్క తెలియదు కానీ, 700 మంది వరకూ ఉండవచ్చని ఒక అంచనా.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more