పోప్ కొత్తగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే పోప్ తొలి ప్రసంగంలో పేదవారికి అండగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పోప్ ఎన్నిక విషయంలో కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. పోప్ గత చరిత్ర పై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అమెరికాలో విభిన్న మతాల వారు సహజీవనం చేస్తున్నప్పటికీ ఆ దేశంలోని అధిక సంఖ్యాకులు ఎవరూ మతానికి అంత ప్రాధాన్యతనివ్వరు. జనాభా నియంత్రణ, విడాకులు, గర్భస్రావం వంటి అంశాలకు సంబంధించి కేథలిక్ చర్చ్ తన మతస్తులకు అనుమతినివ్వటానికి నిరాకరించటంతో అనేక మంది ఆ మత పరిధి నుండి బయటకొచ్చేశారు. అదే విధంగా మహిళలకు మత బోధకులుగా అవకాశం కల్పించకపోవటం, స్వలింగ వివాహాల వంటి అంశాలు కూడా చర్చ్‌ని రెండుగా చీల్చాయంటే అతిశయోక్తి కాదు. అటువంటి కేథలిజం అమెరికాలో జాతీయస్థాయిలో వున్నప్పటికీ అది మైనార్టీస్థాయిలో మాత్రమే కొనసాగుతోంది. శ్వేతజాతీయులు, ఆంగ్లో శాక్సన్లు, ప్రొటెస్టెంట్‌లతో కలిసిన పాలక వర్గాలకు 'వాస్ప్' (వైట్-ఆంగ్లో శాక్సన్-ప్రొటెస్టెంట్) పేరు స్థిరపడిపోయింది. వీరంతా పెట్టుబడిదారీవర్గం వేళ్లూనుకున్న ఉత్తర ఐరోపా దేశాలనుండి ఇక్కడికి వలస వచ్చి కేథలిక్ చర్చిపై తిరుగుబాటు చేశారు. ఈ నేపథ్యంలో 1978లో జాన్ పాల్ 2 పోప్‌గా ఎన్నికైన తరువాత కేథలిక్ చర్చ్ నాయకత్వంపై ప్రజల దృష్టి మళ్లింది. పోలండ్‌కు చెందిన జాన్‌పాల్ సోవియట్ అనుబంధ సోషలిస్టు రాజ్యాల పతనంలో తనవంతు పాత్ర పోషించాడు. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన పోప్ జార్జ్ మారియె బెర్గాగ్లియో తన పేరును పోప్ ఫ్రాన్సిస్‌గాప్రకటించుకున్నారు.
అర్జెంటీనా మాజీ కార్డినల్ అయిన బెర్గాగ్లియోను 'హంబుల్, సింపుల్, ఎ మాన్ ఆఫ్ పీపుల్ ' అంటూ కీర్తిస్తున్నప్పటికీ అధికారికంగా ఆయన 'చర్చ్ యువరాజు'గానే గుర్తింపు పొందుతున్నారు.జాన్ పాల్ మాదిరిగానే పోప్ ఫ్రాన్సిస్‌కు కూడా రాజకీయ ఆసక్తి ఎక్కువగానే వుంది. అమెరికా బ్యాంకులు, కార్పొరేట్ దిగ్గజాలు అనుసరిస్తున్న వ్యూహాలకు ఫ్రాన్సిస్ రాజకీయ ఆసక్తి అతికినట్టుగా సరిపోతుంది. కేథలిక్ చర్చి కన్జర్వేటివ్‌గా ముద్ర ఉన్న ఫ్రాన్సిస్ గతంలో అర్జెంటీనాలో సైనిక నియంతలతో కలిసి సృష్టించిన భయానక వాతావరణం సృష్టించాడు. అది గుర్తొచ్చినపుడల్లా ఈ కన్జర్వేటిజం అంటేనే ప్రజలు హడలి పోతున్నారు. 70వ దశకం ప్రథమార్ధంలో కొనసాగిన మతబోధకుల కిడ్నాపింగ్, రహస్య జైలులో వారిని ఆర్నెల్ల పాటు చిత్ర హింసలకు గురిచేసిన ఘటనల్లో బెర్గాగ్లియో పాత్ర ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
ఆ సమయంలో లాటిన్ అమెరికన్ చర్చ్ బెర్గాగ్లి యోవంటి మితవాదులకు, విముక్తి సిద్దాంత కర్తలకు మధ్య తలెత్తిన విభేదాలతో చీలిక అంచుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో 1973లో జరిగిన ఆపరేషన్ కండోర్‌లో అమెరికా ప్రభుత్వం నాటి పాలక వర్గాలకు అండగా నిలిచింది. ఈ ఆపరేషన్ కండోర్‌లో భాగంగానే చిలీలో నాడు సాల్వడార్ అలెండీ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వాన్ని కూల్చివేసి గద్దెనెక్కిన నియంత అగస్టో పినోచెట్ ప్రజలను ఊచకోత కోశాడు. ఈ ఆపరేషన్ కండోర్ కేవలం చిలీకి మాత్రమే పరిమితం కాలేదు. అర్జెంటీనాలో ప్రస్తుతం యావజ్జీవిత జైలు శిక్ష అనుభవిస్తున్న ఆ దేశ మాజీ సైనిక పాలకులు తమదేశంలో ఈ ఆపరేషన్ కండోర్‌ను అమలుచేసేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోప్ ఫ్రాన్సిస్ ఎంపిక వెనుక అమెరికన్ బిషప్‌లు పోషించిన పాత్రను కార్పొరేట్ మీడియా కూడా ఇప్పటివరకూ వెలుగులోకి తీసుకురాకపోవటం విశేషం.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more