సౌదీ అరేబియాలో పని చేస్తున్న విదేశీ ఉద్యోగుల్లో ఇరవై లక్షల మంది ఉద్యోగాలను పోగొట్టుకోబోతున్నారు. అందులో ప్రధాన భాగం భారతీయులదే అవుతుంది.
సౌదీ సెంట్రల్ డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం, దేశీయ నిరుద్యోగుల శాతం 12.2 కి చేరింది. అంటే 588000 మంది వరకు సౌదీయులు నిరుద్యోగులుగా ఉన్నారు. మరో సంచలనాత్మక వార్త ఏమిటంటే, 15 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్కులైన యువతలో 39 శాతం నిరుద్యోగులు. ఇంకేముంది, సౌదీ కింగ్ డమ్ నితాఖత్ కార్యక్రమాన్ని అమలు జరపబోతోంది. అంటే, స్వదేశీయులను ఉద్యోగలోకి నెట్టే కార్యక్రమం. దాని కోసం ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థలను రంగులతో వర్గీకరణ చేసారు. ఏ సంస్థలోనైనా 10 మంది కంటే తక్కువ పనివాళ్ళున్నట్లయితే వాళ్ళకి ఈ నితాఖత్ వర్తించదు.
సౌదీ జాతీయులను ఉద్యోగంలో పెట్టుకోవటానికి ఉన్న కనీస సంఖ్యకి తక్కువ లో ఉన్న సంస్థలు అన్నిటికన్నా పెద్ద నేరస్తులుగా ఎర్రరంగు ముద్ర వేయించుకుంటాయి. పసుపు రంగు ముద్ర వేయించుకున్న సంస్థలు కూడా కనీస సంఖ్యకు తక్కువలోనే దేశీయ ఉద్యోగులను పెట్టుకున్నా, కనీస సంఖ్యను పూరించే ప్రయత్నంలో ఉన్నవారు. ఆకుపచ్చ రంగు ముద్ర వేయించుకున్న సంస్థలు సౌదీ రాజ్య లేబర్ నియమాలను పూర్తిగా పాటిస్తున్నవారు. అలాంటివాళ్లు తమ సంస్థలను అభివృద్ధి చేసుకునే ప్రయత్నంలో ఇతర దేశాల వారిని నియమించుకోవచ్చును.
ఎర్రరంగు వేయించుకున్న సంస్థలకు వర్క్ పర్మట్లు రెన్యూ అవవు. దానితో వాళ్ళ నివాసానికి అర్హతను కూడా పోగొట్టుకుంటారు. అటువంటి వారిని అరెస్ట్ చేసి డిపోర్ట్ చేసి దేశం నుంచి పంపించివేస్తామని హెచ్చరిస్తూ ఇంటీరియర్ మినిస్ట్రీ ఇప్పటికే ప్రకటించింది. అయితే, ఎక్కువగా బ్లూ కలర్ లేబర్ ని నియమించుకునే సంస్థలైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలను ఈ మినిస్ట్రీ పట్టించుకోకపోవచ్చు. ఎందుకంటే అందులో దేశీయులను నియమించుకున్నా వాళ్ళకి చాలా తక్కువ జీతం వస్తుంది.
నియమాల విషయంలో సౌదీ రాజ్యాలు కఠినంగా ప్రవర్తిస్తాయి. పోనీలే పాపం అనుకునే ప్రసక్తే ఉండదు. దేశ ప్రజల సంక్షేమం దృష్ట్యా మేము నియమాలను ఉల్లంఘించిన సంస్థలను ఉపేక్షించదు. దేశంలోని అంతర్గత, కార్మిక సంక్షేమ మంత్రిత్వ శాఖల నుంచి కఠిన దండన ఉంటుందంటూ లేబర్ మినిస్టర్ అదేల్ ఫర్ఖీ చెప్పారు.
దేశీయాభిమానం కంటే మరో విషయం కూడా సౌదీ అరేబియా రాజ్యం పరిగణనించే విషయం మరొకటి ఉంది. ఈజిప్ట్ లాంటి దేశాలలో నిరుద్యోగులే అంతర్గత వ్యతిరేక శక్తులుగా మారి విప్లవాలను తీసుకునివచ్చారు. అలాంటి పరిస్థితి రాకుండా నిరుద్యోగులను పనిలో పెట్టి వ్యస్తులను చేస్తే మంచిదన్న భావన కూడా నితాఖత్ కార్యక్రమానికి ఉసిగొల్పింది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more