‘‘హస్తం అందరికి ఆదర్శ’’ అనే మాటలు పోయి హస్తం వారికే సంకెళ్లు? అనే మాటలు వినిపిస్తున్నాయి. జరుగుతున్న పరిస్థితులు అలాగే ఉన్నాయి. రెండు స్లారు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని అక్రమాలే చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన భారీ అక్రమాలకు కారణం ఆ మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డే అని కొంత మంది కాంగ్రెస్ మంత్రులు అంటున్నారు. అయితే ఆ మంత్రులు చెప్పే మాటల్లో ఎంత నిజముందో పైనున్న .. వైఎస్ఆర్ కే తెలియాలి. తండ్రి పదవని అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు సంపాదించి, జైల్లో కూర్చున్న వైఎస్ జగన్ అక్రమా ఆస్తుల కేసు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చందమామల కనిపిస్తుంది. అయితే చందమామ కురిపించిన వెన్నల కింద్ర హాయిగా నిద్రపోయిన నాయకులు చాలా మంది ఉన్న విషయం తెలిసిందే. అయితే అలాంటి వారికి ఇప్పుడు నిద్రలేకుండా చేస్తుంది సీబీఐ. అయితే నిన్న సాయంత్రం సీబిఐ కోర్టుల 5వ ఛార్జీషీట్ ఫైల్ చెయ్యటం జరిగింది. కానీ సీబీఐ చేసిన ఛార్జీషీట్ లో ఏ4 నిందితురాలిగా .. రాష్ట్ర హోంశాఖ మంత్రి సబితా ఇంద్రరెడ్డి పేరు చేర్చటంతో.. రాష్ట్ర ముఖ్య నాయకులకు వేసవి కాలంలో చలి మొదలైంది.
ముఖ్యంగా ముగ్గురు కాంగ్రెస్ మంత్రులకు రాత్రి నిద్రపోలేదనే వార్తలు గాంధీభవన్ లో వినిపిస్తున్నాయి. సీబిఐ సడన్ గా తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ నాయకులకు వెన్నులో వణుకు పడుతుంది. ఎందుకంటే విచారణ పేరుతో పిలిచి నాయకులు అరెస్టై .. చంచల్ గూడ జైల్లో ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అలాంటి వారిలో వైఎస్ జగన్ , మోపిదేని వెంకట రమణ, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీ, కొంచెంలో తప్పించుకున్న దర్మన ప్రసాద్ రావు. అయితే తాజాగా సబితా ఇంద్ర రెడ్డి పేరు బయటకు రావటంతో ఏ క్షణమైన ఆమె అరెస్ట్ ఉంటుందనే భయంతో కాంగ్రెస్ మంత్రులకు నిద్ర దూరమైనట్లు తెలుస్తోంది. రాత్రి జగారం చేసిన ఆ ముగ్గురు మంత్రులు ఎవరు అంటే.. 1.మంత్రి గీతా రెడ్డి 2. కన్నా లక్ష్మీనారాయణ 3. పొన్నాల లక్ష్మయ్య . ఈ ముగ్గురు మంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అన్ని సహాయ సహకారాలు చేసినట్లు సీబీఐ అధికారులు చెబుతున్నారు. అప్పట్లో ఈ ముగ్గురు మంత్రులుగా ఉండి వైఎస్ఆర్ ఏం చెబితే అధిచేసినట్లు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు వారి మెడపైన సీబిఐ కత్తి రెడీగా ఉందని రాజకీయ నాయకులు అంటున్నారు. ఈ ముగ్గురిలో పొన్నాల లక్ష్యయ్య ఎక్కువగా ఒత్తిడి గురవుతున్నట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఎందుకంటే గతంలో ఆయన నీటిపారుదల మంత్రిగా చేయటమే ఇందుకు కారణమని వారు చెబుతున్నారు.
ఇక పోతే మంత్రి గీతా రెడ్డి కూడా సీబీఐ ఛార్జీ షీట్ పై ఆందోళన చెందుతుంది. ప్రభుత్వం బ్రహ్మిణి స్టీల్స్ మరియు బ్రహ్మిణి ఇన్ర్పా పరిశ్రమలకు కేటాయించిన బూములను తిరిగి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆసమయంలో ప్రభుత్వానికి కలిగిన నష్టం తక్కువ కాదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. గీతా రెడ్డి రీసెంట్ తిరుపతి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోని రావటం జరిగింది. వైఎస్ సమయంలో కీలక మంత్రిగా ఉన్న గీతా రెడ్డికి .. ఇప్పుడు నిన్నటి రాత్రిపూట జగరం చేస్తున్నట్లు తెలుస్తోంది. కళ్ల ముసుకుంటే .. కళ్ల ముందు సీబీఐ వారు కనిపిస్తున్నారని తన సన్నిహితులతో గీతా రెడ్డి చెబుతుంది. మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ. ఈయన ఇప్పటికే రెండు సార్లు సీబీఐ వారు విచారణ చెయ్యటం జరిగింది. కానీ అప్పుడు భయపడని కన్నా.. మొదటి సారిగా సబితా ఇంద్రరెడ్డి పేరు సీబీఐ వారు చెప్పటంతో మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నిద్రకు దూరమైనట్లు తెలుస్తోంది. కన్నా లక్ష్మి నారాయణ అప్పుడప్పుడూ రాంకీ సంస్థ పన్ను రాయితీలు అందించే బాధ్యత . డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జరిగింది అయితే, అది జగన్ కు సంబంధం లేకపోవచ్చు, కానీ జగన్ అక్రమాస్తుల కేసును సీబీఐ వారు స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది. సీబీఐ స్పీడ్ తో రాజకీయ నాయకులకు మాత్రం చెమట్లు పడుతూ.. రాత్రి పూట నిద్రలేకుండా పోతుందని ఈ మగ్గురు మంత్రులు తన సన్నిహితుల దగ్గర వాపోతున్నారు. సబితా రెడ్డి పేరు విన్న మంత్రులకు .. నా నెంబర్ ఎప్పుడు వస్తుందనే భయంతో నిద్రకు దూరమైనట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more