విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఈ రోజు కర్ణాటక రాజకీయలపై ద్రుష్టి పెట్టారు. కర్ణాటకలో ఉన్న బిఎస్సార్ పార్టీ, మన రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్ పార్టీ ఒక్కేటేనని ఆయన అన్నారు. కర్ణాటకలో బిఎస్సార్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదు. ధనబలం ఉన్న పార్టీగా తెరపైకి వచ్చిన గాలి జనార్థన్ రెడ్డి పార్టీ చివరకు ఓటమి చవిచూసిందని లగడపాటి మండిపడ్డారు. అంతేకాకుండా బిఎస్సార్ పార్టీకి, వైఎస్సార్ పార్టీకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయాని ఆయన అన్నారు. ఆ పార్టీ అధినేత జైల్లో ఉన్నారు. అలాగే వైఎస్సార్ పార్టీ అధినేత జైల్లో ఉన్నారు. బిఎస్సార్ పార్టీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ , వైఎస్సార్ పార్టీ ఎన్నికల గుర్తు ఫ్యాన్. ఇలా ఒకే పోలికలు కలిగి ఉన్నాయాని లగడపాటి గుర్తించారు. అయితే కర్ణాటకలో బిఎస్సార్ పార్టీకి జరిగిందే .. మన రాష్ట్రంలో వైఎస్సార్ పార్టీకి జరుగుతుందని ఆయన చెబుతున్నారు.
2014లో వైఎస్సార్ పార్టీ ఓడిపోవటం ఖాయమని లగడపాటి అంటున్నారు. ధనబలంతో శాసించగలమని బిఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార భారతీయ జనతా పార్టీ నుండి విడిపోయిందని, అలాంటి అవినీతి పార్టీని ప్రజలు కర్నాటకలో మట్టికరిపిస్తున్నారన్నారు. అహంకారంతో పెట్టిన పార్టీ అలాగే కూలిపోతుందన్నారు. గతంలో ఉప ఎన్నికల్లో బిఎస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి శ్రీరాములు సెంటిమెంటు కారణంగా గెలుపు సాధించి అదే తరహా రాష్ట్రంలో ఉంటుందని భావించారని ఎద్దేవా చేశారు. మన రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి తప్పదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఓటమి తప్పదన్నారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన పథకాలను జగన్ తమవిగా ప్రచారం చేసుకోవడం వల్ల కాంగ్రెసు పార్టీ కొద్దికాలం ఇబ్బందులను ఎదుర్కొందన్నారు. ఇప్పుడిప్పుడే ప్రజలు తెలుసుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎప్పుడు బలహీనపడలేదని, ఓట్లు మాత్రమే జగన్, కాంగ్రెసుగా చీలాయన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైపే అందరూ వస్తారన్నారు. ఇప్పుడిప్పుడే ప్రజలు మేలుకుంటున్నారని సహకార ఎన్నికల ఫలితాలను చూస్తే తెలుస్తుందన్నారు. అంతేకాకుండా వైసీపీ నాయకులు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరటానికి సిద్దంగా ఉన్నారని లగడపాటి అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more