పదేళ్ల తర్వాత అధికార పీఠాన్ని కాంగ్రెస్ అందుకోనుంది. కర్ణాటకలో కాంగ్రెస్ సత్తా చాటింది. సాధారణ మెజారిటీ సాధించింది. బీజేపీ స్వయంకృతాలు కాంగ్రెస్ కు కలిసొచ్చాయి. యడ్యూరప్ప, బీఎస్ ఆర్ కాంగ్రెస్ లు చీల్చిన ఓట్లతో కాంగ్రెస్ పార్టీ లాభపడింది. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు సాధించింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ప్రాంతాలతో పాటు మిగతా ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థులు ఓట్లు రాబట్టగలిగారు. వాణిజ్య కేంద్రం బెంగుళూరులో సైతం ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపారు. కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన మెజారిటీని కాంగ్రెస్ పార్టీ సాధించింది. సాధారణ మెజారిటీకి 113 స్ధానాలు కావలసి ఉండగా, 121 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మొత్తం 224 స్థానాలకు 223 స్థానాలలో ఎన్నికలు జరిగాయి. బిజెపి 40, జెడి(ఎస్) 40, కెజెపి 6, బిఎస్ఆర్ 4 స్థానాలలో ఇతరులు 12 స్థానాలో విజయం సాధించారు. ఈ సారీ కాంగ్రెస్ హవా కొనసాగించింది.
బీజేపీ, జేడీఎస్, కేజేపీ ఐదులోపు స్థానాలకే పరిమితం అయ్యాయి. గాలి జనార్దన్ రెడ్డి సన్నిహితుడు బీఎస్ఆర్ పార్టీ అధినేత బి.శ్రీరాములుతో పాటు ఆయన మేనల్లుడు సోమశేఖర్ గెలిచారు. ఉడిపి జిల్లా ఉడికిలో బీఎస్సార్ అభ్యర్థి విజయం సాధించారు. హర్పన హళ్లిలో పోటిచేసిన గాలి సోదరుడు కరుణాకర్ రెడ్డి ఓడిపోయారు. మరో ప్రాంతం ముంబై కర్ణాటక మహారాష్ట్రతో పాటు కొంత తెలంగాణ ప్రాంతానికి ఆనుకొని ఉంది. 50స్థానాలకు గాను సగానికి పైగా స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీకి అధికార బీజేపీ కొంత పోటీ ఇచ్చినా జేడీఎస్, కేజేపీలు చతికలపడ్డాయి.
కర్నాటక రాష్ట్రాన్ని 5 ప్రాంతాలుగా విభజించారు. హైదరాబాద్ కర్నాటక, ముంబై కర్నాటక, ఓల్డ్ మైసూర్, సెంట్రల కర్నాటక, దక్షిణ కర్నాటక. హైదరాబాద్ కర్నాటక ప్రాంతం మన రాష్ట్రానికి ఆనుకొని ఉంది. తెలంగాణ, రాయలసీమ జిల్లాలు సరిహద్దులుగా గల ఈ ప్రాంతంలో మొత్తం 31 అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. ముందు నుంచీ కూడా ఈ ప్రాంతంపై కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉంది. ముంబై కర్నాటక ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది. తర్వాత కమలగతమైంది. కానీ ఈ ఎన్నికల్లో ఓటర్లు కాంగ్రెస్ నే సమర్థించారు. ఓల్డ్ మైసూర్ లో 55స్థానాలున్నాయి. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ దూసుకు వెళ్లింది. జేడీఎస్ కూడా దూకుడు కొనసాగించింది. ఇక సెంట్రల్ కర్ణాటకలో 21నియోజక వర్గాలు ఉన్నాయి. ఇక్కడ కూడా కాంగ్రెస్ దూకుడు కొనసాగించింది.
పార్టీ అభ్యర్థులు దాదాపు సగం స్థానాలు సాధించారు. జేడీఎస్ సగం స్థానాలను గెలుచుకుంది. లింగాయత్ లు కొంత బీజేపీని సమర్థించారు. కర్నాటకలో మరో ప్రాంతమైన దక్షిణ కర్ణాటకలో 51స్థానాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ , జేడీఎస్ లు దాదాపు సమాన స్థానాలు సొంతం చేసుకున్నాయి. ఒక్కళిగ కులస్థులు జేడీఎస్ ను ఆదరించారు. దాంతో పాటే బీజేపీని తిరస్కరించారు. బెంగళూరు జిల్లాలో కాంగ్రెస్ హవా సాగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ అన్నారు. కాసేపట్లో గవర్నర్ ను కలిసి రాజీనామాపత్రాన్ని సమర్పిస్తానని చెప్పారు. గత ఐదేళ్లుగా ప్రభుత్వానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కర్ణాటక సిఎం రేసులో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లలో కేంద్ర మంత్రి మల్లికార్జున ఖర్గే పేరు కూడా ఉంది. కార్మిక శాఖ మంత్రిగా, ట్రేడ్ యూనియన్ నాయకుడిగా గుర్తింపు పొందిన ఖర్గే ఓటమి ఎరుగని నాయకుడిగా పేరుంది. 1972నుంచి 9సార్లు అసెంబ్లీకి ఎన్నికైన ఖర్గే 2009లో తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు. 2008ఎన్నికల్లో సిఎం అభ్యర్ధిగా భావించినా ఫలితాలు తారుమారవడంతో ఖర్గే జాతకం మారిపోయింది. తాజా ఫలితాల నేపథ్యంలో సిఎం పదవిపై ఖర్గేలో ఆశలు మళ్లీ చిగురించాయి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more